స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురువు లక్షణాలు
సామ ద్విబర్హా మహి తిగ్మభృష్టిః సహస్రరేతా వృషభస్తువిష్మాన్‌
పదం న గోరపగూళ్హం వివిద్వానగ్నిర్మహ్యం ప్రేదు వోచన్మనీషామ్ ॥
భావం:- విద్య మరియు లోకానుభవాల రెండింటిలో ప్రజ్ఞావంతుడై, సర్వవిషయాలలో సంపూర్ణ విజ్ఞానవంతుడై, శిష్యుల అజ్ఞానాన్ని తొలగించడంలో మహాశక్తివంతుడై, సర్వశ్రేష్ఠుడై, శారీరక, మానసిక బలసంపన్నుడైన ఉత్తమగురువు లేదా జ్ఞాని నాకు ఇంద్రియాలు, వేదాలు, పృథివ్యాది సమస్త్భూతాల రహస్య విజ్ఞానంవంటి గొప్పగొప్ప సిద్ధాంతాలను, విజ్ఞానాన్ని బోధించుగాక!
వివరణ:- ఈ మంత్రంలో సద్గురువులో ఉండే ప్రధాన ఉత్తమ గుణాలు వివరింపబడ్డాయి.
1. ద్విబర్హా:- విద్య మరియు విశేషమైన నయ (నీతి)శాస్త్రంలో ఉద్ధండ జ్ఞానఖనికావడం గురువుకు ముఖ్య లక్షణం. ఇట్టి గురువే శిష్యుని విజ్ఞానవంతుడిగానే గాక ఉత్తమ గుణశీలవంతుడైన వ్యక్తిగా తీర్చిదిద్దగలడు.
2. తిగ్మభృష్టిః:- సర్వవిజ్ఞానాల పాండిత్యంతోబాటు సమస్టి సమన్వయ రూపమైన సంపూర్ణవిజ్ఞానం కూడ గురువు కలిగియుండాలి. అట్టి పరిపక్వతలేని గురువు వివిధ విజ్ఞాన విషయాల ఎడల నిమ్నోన్నతాభావాలను కలిగించి పాక్షిక దృష్టిగల హఠపండితుడిగాచేసి సమాజానికి చెరుపు కలిగిస్తాడు.
3. సహస్రరేతాః:- గొప్ప పరాక్రమవంతుడు కావాలి. గురువులోని ఈ పరాక్రమం శరీర సంబంధి కాదు. శిష్యుని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానవంతుని చేయడంలో బుద్ధికుశలత కలిగియుండాలని భావం. ఈ బుద్ధికుశలత గురువునకే కాదు ఏ వ్యక్తికయినా ఇంద్రియ చాంచల్యం లేని బ్రహ్మచర్య నిష్ఠాగరిష్టత వలననే సిద్ధిస్తుంది. ఇక గురువు విషయం చెప్పవలెనా? బ్రహ్మచర్యానిష్ఠుడైన గురువే శిష్యునిలో జ్ఞానాన్ని నింపగలడని యోగదర్శన వ్యాఖ్యాత వ్యాసదేవుడు ‘సిద్ధశ్చ వినయేషు జ్ఞానమాధతుం సమర్థ్భోవతి’ ‘‘బ్రహ్మచర్య వ్రతంలో సిద్ధుడైన గురువే ఛాత్రులను జ్ఞానవంతులను చేయగలదు’’అని పేర్కొన్నాడు.
4. అపగూఢం వివిద్వాన్:- రహస్య విద్యలలోని మర్మాన్నికూడ గ్రహించగలిగినవాడే గురువు.
5. తువిష్మాన్:- బలశాలి అని ఈ మాటకర్థం. గురువు బలశాలి కావాలని వేదనిర్దేశం. బలం కేవలం శాస్తజ్ఞ్రానాది విషయాలలోనేగాక వానిని బోధించేందుకు యోగ్యమైన శారీరక, మానసిక బలాలుకూడ గురువు కలిగియుండాలని వేద వచనం. నిజమేకదా! శారీరక, మానసిక శక్తిహీనుడు బోధన నేమిచేయగలడు?
వేదం ప్రతిపాదించిన ఈ గురులక్షణాలు వేదమంత్రగతమైనవి కావడంవలన అవి వేదప్రబోధక గురువులకే పరిమితమని భావించరాదు. అవి వేద గురువులతోబాటు లౌకిక గురువులకు కూడ వర్తించే సార్వకాలిక, సార్వజనీన గురులక్షణాలే.
మాటలోని మర్మాన్ని తెలుసుకో
నిశ్చర్మణో గామరిణీత ధీతిభిర్యా జరంతా యువశా తాకృణోతన
సౌధన్వనా అశాదశ్వమతక్షత యుక్త్వా రథముప దేవాన్ అయాతన॥
భావం:- మనసులో బాగా విచారణచేసి మాటలలోని మర్మాన్ని గ్రహించు. వృద్ధులైన తల్లిదండ్రులను యువకులతో సమానంగా తయారుచేయి. విలువిద్యానిపుణులారా! అశ్వసంపదనుండి మంచి అశ్వసంపదను సృష్టించండి. రథాలను సిద్ధపరచి దివ్యపదార్థాలను సులభంగా పొందండి. లేదా రథాలను పూన్చి విద్వాంసుల వద్దకు వెళ్లండి.

ఇంకా ఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు