స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-46

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరీర సంరక్షణయే యజ్ఞం
స్వయం యజస్వ దివి దేవ దేవాన్ కిం తే పాకః కృణవదప్రచేతాః
యథా యజ ఋతుభిర్దేవ దేవా నేవా యజస్వ తస్వం సుజాత
భావం: ఓ మానవుడా! శిరస్సున నుండే జ్ఞానేంద్రియాల ద్వారా సమీకరింపబడిన సదాలోచనలను ఉత్తేజపరచుము. సదాలోచన తత్పరుడవైన నిన్ను మూఢులేమి చేయగలరు? ప్రతి ఋతువునందు తదనుగుణంగా దేవతలనెలా ఆరాధిస్తావో అదే విధంగా నీవు దేవతామయమైన శరీరాన్ని ఆరాధనాభావంతో ఆదరించుము.
వివరణ: ఈ మంత్రంలో ఎన్నో గ్రహింపదగిన అంశాలు ప్రస్తావించబడ్డాయి.
1.దేవ= జ్ఞానేంద్రియాలు. వీనికి దివ్యధామం శిరస్సు. ఈ మానవ దేహం సమస్త బ్రహ్మాండానికి సూక్ష్మరూపం. (ఎపిటోమి) బ్రహ్మాండంలో ద్యులోకం- అంతరిక్షం- పృథివి అనే మూడు లోకాలున్నాయి. ద్యులోకంలో సూర్య - చంద్ర - తారాది ప్రకాశవంతమైన గోళాలలు ఉన్నాయి. అంతరిక్షంలో వావు మొదలగు పంచభూతాలు ఉన్నాయి. భూమి సర్వప్రకృతికి, జీవరాశులకు నిలయం. శరీరంలో తల ద్యులోకం. ఇందులో ఆత్మ కంటె భిన్నంగ ఆవుండే సమస్త పదార్థ విజ్ఞాన్నా సమీకరించు కళ్లు- చెవులు- ముక్కు- నాలుక- చర్మం అనే జ్ఞానేంద్రియాలుంటాయి. శరీర మధ్యభాగం అంతరిక్షం. అధోభాగం పథివీలోకం.
2.ద్యులోక సదృశమైన శిరోభాగంలో గల జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానాన్ని నీకు నీవు తప్ప ఇతరులా జ్ఞానాన్ని గ్రహించలేరు. నీ కళ్ళతో నీవే గాని ఇతరులు చూడలేరు. నీ చెవులతో నీవే గాని మరొకరు వినలేరు. ఇదేవిధంగా మిగిలిన ఇంద్రియాల విషయమూ అంతే. ఈ ఇంద్రియజ్ఞానాన్ని నీవొక్కడివే ఎలా గ్రహించగలవో వానివలన కలిగే సుఖదుఃఖాలు కూడా నీ వొక్కడివే అలా అనుభవించవలసి యుంటుంది.
3.మూఢుడు ఏ ఒక్కడిని సక్రమ మార్గంలో ఉంచజాలడు. పవిత్రతోబాటు జ్ఞానం కూడా మనిషికి చాలా అవసరం.
4.ప్రతి ఋతువునందు దానికనుగుణంగా యజ్ఞాలు నిర్వహించాలి. అట్టి యజ్ఞాలను గోపథబ్రాహ్మణంలో భైషజ్య యజ్ఞాలుగా చెప్పబడ్డాయి. వీనివలన శరీరానికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది.
5.నిత్యమూ దైవయజ్ఞ మేవిధంగా చేయాలో అదేవిధంగా శరీర సంరయంరూపమైన యజ్ఞాన్ని (యజస్వ తన్వమ్) ఆచరించాలి.
వేదం సమస్త మానవాళి సంక్షేమం కోసం భగవంతుని చేత విన్పింపబడిన పవిత్ర గ్రంథం. ప్రస్తుతం ‘యజస్వ తన్వమ్’ అన్న వేద మంత్రోపదేశం ఒక్క భారతీయులకే కాదు, సమస్త మానవజాతికి విన్పిబడిన మహోపదేశం. శరీరాన్ని ఏ విధంగానూ ఉపేక్షించమని వేదం బోధించదు. యజ్ఞం వైదిక ధర్మానికి ప్రాణం. శరీర యాగం కూడా అట్టి ప్రాణరూపమైన యజ్ఞాలలో ఒకటి. ఇచట దాని నిర్వహణా విధానం చెప్పబడింది.
ఈ శరీర యజ్ఞ ప్రాముఖ్యాన్ని గూర్చి యజుర్వేదంలో ‘ఇయం తే యజ్ఞియా తనూః’ - ఈ నీ శరంర యజ్ఞం చేయదగినది. అర్చనీయుడైన పరమాత్మతో అనుసంధానింపదగింది అని వివరించింది. అట్టి అమూల్య శరీర రత్నాన్ని సంరక్షించుకోకుండా ఎవడుంటాడు? ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు