స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-47

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంసార సాగరాన్ని దాటడానికి ఈ దేహం నౌక వంటిది. దానికి చిల్లు పెట్టి ముంచివేస్తే మునిగేది నౌకే కాదు దానితోబాటు మీరూ మునిగిపోతారు. మోక్ష్య లక్ష్యాన్ని చేరుకోకనే సంసార కూపంలో మునిగిపోతారు. అందుకే దేహనౌకను శ్రద్ధగా రక్షించుకోవాలి. అందుకే వేదమీ మంత్రంలో ‘యజస్వ తన్వమ్’ అని చెప్పింది.
ఈ విధంగా తనువును సంరక్షించుకోవడం ద్వారా మానవుడుపై ‘ఇయం తే యజ్ఞియా తనూః’ అన్న యజుర్వేద మంత్రానుసారంగా అది ఈ జీవాత్మను పరమాత్మతో అనుసంధింపబడగల ముఖ్యసాధనం కాగలదు.
ఈ దృష్టితోనే కాక దేహ ప్రాధాన్యాన్ని వేదాలు మరో దృష్ట్యా కూడా ప్రశంసించాయి. భగవదనుసంధాన విషయమటుంచినా తనువు మహత్వం చాలా విశిష్టమైనది. ఎట్లంటే లౌకిక జీవన సుఖ - భోగానుభవాలు ఈ దేహంతోనే ఆధారపడి యున్నాయి. ఎప్పుడు? ఆ దేహం సంపూర్ణారోగ్యవంతంగా వున్నపుడు మాత్రమే. అలా కాక రోగగ్రస్తమయితే తన వారికే కాదు తనకు తానే భారమైపోతాడు. దైనందిన జీవనాన్ని గూడ సుఖణగా నిర్వహించుకోలేని అసమర్థుడైపోతాడు. ఈ దుస్థితిని గుర్తించియే అథర్వవేదం.
నీ దేహంలో రోగ రాహిత్యం వర్థిల్లాలి అని దీవించింది. అంటే రోగాలు ఏ రూపంగా కూడా శరీరంలో ప్రవేశింపకుండ ఆహార విహారాలను నియంత్రించుకొమ్మని వేద మంత్రోద్దేశ్యం. అపథ్యాహారం, దుష్టాహారం, అశౌచ వ్యవహారాలవలన రోగాలు శరీరంలో ప్రవేశిస్తాయి. ఆహార పానీయాలు, శయన- ఆసనాదుల వ్యవహారంలో సంయమనం మరియు నియమాలను పాటిస్తే రోగాలే దరిజేరవు. ఆ ప్రకారంగా నడుచుకొన్నా కూడా శరీరం రోగగ్రస్తమయితే పూర్వ జన్మకృత దోషాచరణ ఫలంగా అనుకోవాలి. ఇలా భావించడం వలన ప్రధానఫలం ప్రస్తుతం మరింత జాగరూకతతో ప్రవర్తించే శ్రద్ధ కలగడమే. పూర్వజన్మ స్మరణవల్ల భవిష్యత్ జన్మను గురించి కూడా విచారణ ఇప్పుడే కలగాలి. దానివలన పూర్వజన్మలోని ఆచార వ్యవహారాలు, ఆహార విహారాలు, మనోభావాల ననుసరించి ప్రస్తుత మానవ దేహం సంప్రాప్తించిన రీతిగా ఈ జన్మలోని ఆహార విహార- వ్యవహారాదులవలన సంభవింపగల భవిష్యజ్జన్మకు హేతువులు కాగలవను సంస్కార భావం కలుగుతుంది.
మన ఆలోచనలు మన శరీరంమీద అత్యధిక ప్రభావిన్న చూపిస్తాయన్న విషయాన్ని మనం మరువరాదు. అందుకే మన శరీరారగ్య సంరక్షణకు (శరీర యాగం) మన ఆలోచనలను చాలా పవిత్రంగా నిలుపుకోవడం అత్యంతావశ్యకం. శరీరం తుష్టిగా (సంతోషం) పుష్టిగా వున్నాఆలోచనలు మాత్రమపవిత్రమై యుంటే శరీర సంరక్షణ (శరీరయాగం) సంభవించదు. అటువంటివాడు చలా బలహీనుడై యుంటాడు. కేవలం శారీరికంగానే కాదు మానసికంగా కూడా బలహీనుడై యుంటాడు. అట్టివాడు పవిత్ర భావాలతో శారీరక మానసిక ధారుఢ్యం కలవానిని ఏ విధంగా కూడా ఎదుర్కోలేడు. ఈ జీవిత సత్యాన్ని ఈ వేదమంత్రం ‘కింతే పాకః కృణవద ప్రచేతాః’ అన్న వాక్యంలో ప్రకటించింది. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు