స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ తరువాతపరమాత్మనారాధించి తన్మయుడవుతున్నాడు. ముండక మహర్షి ఈ మంత్రార్థానే్న గ్రహించి ముండకోపనిత్తు ఇలా వివరించాడు.
పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాన్నాస్త్యకృతః కృతేన॥ ॥
‘‘కర్మల చేత సాధింపబడిన స్వర్గాదిలోక భోగాలను మీమాంస న్యాయాదుల చేత పరీక్షించి అనిత్యమైనవని తెలుసుకొన్న బ్రాహ్మణుడు (బ్రహ్మజ్ఞాని) నిత్యుడైన ఆ పరమపురుషుడు అనిత్యమైన-కేవలం కర్మానుష్ఠానం చేత లభ్యంకాడు’’అని నిర్వేదాన్ని పొందుతాడు. అట్టి భగవద్దర్శనాభిలాషికి తగిన ఉపాయం కూడ ప్రస్తుత వేద మంత్రంలో చెప్పబడింది. అదే సర్వాన్ని పరీక్షించి సర్వవ్యాపకుని తెలుసుకోవడం. మరి ఆ విధంగా చేయక ఆ సర్వవ్యాపకుని దర్శించడమసంభవం. అందుకు ముందుగా పంచభూతాలను, లోకాలను, దిశలను, విదిశలను ఇలా దృశ్యమాన సృష్టిసర్వాన్ని పరిశీలించాలి. ఎందుకు అంటే ఆ అన్నింట దైవం సర్వవ్యాపకమైయుంది కాబట్టి.
అలా అన్నింటిని పరిశీలించి తెలుసుకొని పరమాత్మని దర్శించినవానికి ఫలమేమిటి? ఈ విషయం వేదం మంత్ర ద్వితీయార్థంలో ‘ఆత్మనాత్మానమభి సంవివేశ’ ఆత్మద్వారా ‘‘పరమాత్మలో విలీనం కావడమే’’నని స్పష్టపరచింది. పరమాత్మ భౌతికమైన చక్షుఃశ్రోత్ర జిహ్వా ఘ్రాణ చర్మాల ద్వారా బోధపడడు. ఆయన కేవలం ఆత్మచేతనే తెలియబడువాడు. తలవకార మహర్షి ఈ విషయాన్ని హృదయంగమంగా ఇలా వర్ణించాడు.
‘న తత్ర చక్షుర్గచ్ఛతి వాగ్గచ్ఛతి నో మనో న విద్మో న విజానీమో యథైతదనుశిష్యాత్. అన్యదేవ తద్విదితాదథో అవిదితాదధి’ (కేనోపనిషత్తు 1-3) అక్కడకు కళ్లు, మాట, మనస్సు ఏవీచేరుకోలేవు. అక్కడాయనను గురించి బాహ్యేంద్రియాలతోగాని, అంతఃకరణాలతోగాని తెలుసుకోలేము. తెలిసిన వస్తుజాలంకంటే ఆయన వేరైనవాడు. తెలియని వస్తుజాలంకంటె అతీతమైనవాడు.
ఇంద్రియాలనుండి సంపాదింపబడిన జ్ఞానం ఆత్మవరకే పరిమితం. అది కూడ భౌతిక పదార్థ జ్ఞాన పరిధికి మాత్రమే పరిమితం. ఆ దైవం వానికంటే అతీతం. అందుకు ఇంద్రియాలు ఆ పరదైవ జ్ఞానాన్ని గ్రహించజాలవు. ఆత్మ ఇంద్రియాలను విడిచి సమాధి ద్వారా సాక్షాత్తుగా సర్వభూతాంతరాత్ముని దర్శిస్తుంది. అలా దర్శనమైనంతనే బహిరంతరాలలో అంతట దైవమే ఉందన్న ఎరుక ఆత్మకు సిద్ధిస్తుంది. ఆ స్థితియే నిర్వికల్ప సమాధి.
**
విరుద్ధ ప్రకృతి-పురుషతత్త్వాలు జీవుడనే బిడ్డకు పాలనిచ్చి పోషిస్తున్నాయి
ద్వే విరూపే చరతః అన్యాన్యా వత్సముప ధాపయేతే
హరిరన్యస్యాం భవతి స్వధావాన్ శుక్రో-అన్యస్యాం దదృశే సువర్చా.॥ ॥
భావం:- ప్రకృతి- పురుషుడు ఈ రెండు పరస్పర విరుద్ధతత్త్వాలు. కాని ఈ రెండు జీవుని పరిపోషించడంలో సమానంగా ప్రయోజనకారులై భోగ- మోక్షాలనే పాలను త్రాగిస్తున్నాయి. జీవుడు ప్రకృతినుండి జీవనశక్తిని పొంది భౌతిక విషయ భోగాలననుభవిస్తున్నాడు. పరమ పురుషుని ఆశ్రయించి జీవుడు తేజోవంతుడై పరిశుద్ధంగా వ్యక్తమవుతున్నాడు.
వివరణ:-ప్రకృతి- పురుషుడు పరస్పర విరుద్ధమైన తత్త్వాలు. పురుషుడంటే పరిణామ రహితుడు. సర్వవ్యాపి మరియు సర్వజ్ఞుడయిన పరమేశ్వరుడే. ప్రకృతి పరిణామ సహితమైనది అల్పజ్ఞ. వీనిమధ్య ఇంత విభేదమున్నా జీవుడనే వత్సాన్ని(బిడ్డను) పోషించే విషయంలో సమాన పాత్ర వహిస్తున్నాయి. జీవుని భోగాధిష్ఠానమైన శరీరం, భోగ సాధనాలైన ఇంద్రియాలు మరియు భోగ సామగ్రి అయిన ఇంద్రియాలచే అనుభవించబడే విషయాలు ఇవన్ని ప్రకృతి ప్రదానాలే. నిస్సందేహంగా భోగలాలస ఆత్మలోనే ఉంది. ఆ లాలసను ప్రకృతి పరిపూర్ణం చేస్తుంది. ప్రకృతి సహకారంలేనిదే జీవుడు లోకంలో ఏ కార్యాన్ని నిర్వహించలేడు. జీవునిముందు ప్రధానంగా రెండు లక్ష్యాలుంటాయి. ఒకటి భోగం రెండు మోక్షం. భోగం కేవలం ప్రకృతినుండియే జీవుడికి లభ్యమవుతుంది. భోగాన్ని ప్రదానంచేయడమే ప్రకృతి పాలను త్రాగించడం. జీవుని భోగాధిష్ఠానమైన శరీరం, జీవుని భోగసాధనాలైన ఇంద్రియాలు, భోగసామగ్రి అయిన విషయాలు నిస్సందేహం జీవుడికి ప్రకృతినుండియే జనిస్తాయి. కాని వానిని ప్రకృతియందు జనింపచేసే వాడెవరు? పరమాత్మయే.
- ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512