స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
ఆ పరమాత్మ జీవుని కర్మానుగుణమైన ఫలస్వరూపంగా భోగాలను ప్రకృతి యందు జనింపచేసి ప్రదానం చేయకుంటే జీవుడికి భోగప్రాప్తి ఎక్కడ? కాబట్టి జీవుడికి లౌకిక భోగం ఎక్కడ లభిస్తున్నదో అక్కడ పరమాత్మ ప్రధాన కారణంగా ఉంటాడు. అందుకే వేదం ‘ద్వే విరూపే చరతః స్వర్థే- అన్యాన్యా వత్సముప ధాపయేతే’ ‘‘విరుద్ధమైన ప్రకృతి - పురుష శక్తులు పరస్పరం సహకరించుకొని వత్స అయిన జీవుడికి భోగ రూపమైన పాలను త్రాగిస్తున్నాయి’’అని సోదాహరంగా చెప్పింది.
జీవుని రెండవ లక్ష్యం మోక్షం. దీనిని పొందేందుకు జీవుడు ప్రకృతి- పురుషుల సహకారాన్ని తప్పక పొందాలి. మానవ దేహాన్ని మునిజనులు మోక్ష ద్వారమని అంటారు. అది ప్రకృతినుండి జనించినట్టిదే. ప్రకృతి సహజంగా ఆనంద స్వరూపిణి కాదు. దాని సంసర్గంలో జీవుడికి ఆనందం లభించడమన్నది ఇసుకలోనుండి తైలం లభించడం వంటిదే. సచ్చిదానంద స్వరూపుడైన భగవంతునితో స్నేహం స్థిరపడిన తరువాతనే ఆనందం లభిస్తుంది. ఏమాత్రమూ దుఃఖ స్పర్శలేని ఆ ఆనందానుభవమే మోక్షం. జీవుడు భోగమోక్షాలను రెండింటిని ఒకేసారి అనుభవించాలనుకోవడం సాధ్యంకాదు. ఒక సమయంలో భోగ-మోక్షాలలో ఏదో ఒకదాని అనుభవమే జీవుడికి సాధ్యమవుతుంది. ప్రకృతితో అత్యంత సాన్నిహిత్యమేర్పడితే ‘హరిరన్యాస్యాం భవతి స్వధావాన్’ ఈ స్వధావాన్=ప్రకృతి సాన్నిహిత్యం వలన హరి=విషయాలలో జీవుడు బంధింపబడతాడు అంటే- కళ్లు రూపం వైపు, చెవులు శబ్దంవైపు, ముక్కు గంధంవైపు, జిహ్వ రుచులవైపు ఆకర్షింపబడుతూ ఉంటాయి. ఈ విధంగా జీవుడు ప్రకృతికి వశుడై కేవలం ప్రకృతి ప్రదానాలైన భోగరూప క్షీరాన్ని త్రాగుతూ భోగాలలో బంధింపబడతాడు. అదృష్టవశాత్తు జీవుడు తన భోగలంపట దుఃస్థితిని గ్రహించి పరమాత్మవైపు మ్రొగ్గితే ‘శుక్రో అన్యస్యాం దదృశే సువర్చాః’ ‘‘పరమాత్మ సాన్నిధ్యంలో పరిశుద్ధుడై జీవుడు తేజస్వి అవుతాడు’’. భగవానుని తేజస్సుచేత జీవుని సమస్త పాపాలు ప్రక్షాళితమవుతాయి. నిష్కళంకుడైన జీవుడు పరమాత్మయందు లీనమవుతాడు. జీవుడుగా ఈ ముక్తి చేరుకోవడమే మానవ జీవిత పరమ లక్ష్యం. ఇదే వేద సందేశం.
***
సకల దేవతలు అగ్నిని (ఆత్మను) సేవిస్తారు
త్రీణి శతా త్రీ సహస్రాణ్యగ్నిం త్రింశచ్చ దేవా నవ చాసపర్యన్‌
ఔక్షన్ ఘృతైరస్తృణన్ బర్హిరస్మా- ఆదిద్ధోతారం న్యసాదయంత॥

భావం:- దేవతలు మూడువేల మూడువందల ముప్పది తొమ్మది మంది ఉన్నారు. వారందరు అగ్నిదేవుని సేవిస్తారు. వారు నేతిని ప్రోక్షణ చేయడం ద్వారా అగ్నితత్త్వాన్ని ప్రజ్వలింపచేస్తారు. ఆ అగ్నికొఱకే ఆసనాన్ని పరుస్తారు. ఆ పిమ్మట వానిపై హోతను ఆసీనుని చేస్తారు.
వివరణ:- తల్లి తన బిడ్డలను ప్రేమతో లాలించి ఎలా పెంచుతుందో అదే విధంగా జగన్మాత జీవులనే తన బిడ్డల్ని లాలించి సన్మార్గంలో ప్రవేశింప చేస్తున్నది. ఈ మంత్రంలో దేవతా సమూహం జీవుల శుభాలను ఎలా ప్రసాదిస్తున్నదో వివరింపబడింది. ఈ సృష్టిలో ప్రాకృతిక శక్తులెన్ని తమ విధ్యుక్త్ధర్మాలను నిర్వహిస్తున్నవో ఎవరు గణింపగలరు? దీని ఆంతర్యమేమంటే ‘అగ్నిం అసపర్యన్’ ‘‘అగ్నిని సేవించడమే’’అంటే అగ్నిహోత్రం కల్పించబడుతుంది. అగ్ని జ్వలింప చేయబడుతుంది. అగ్నిలో ఆజ్యం ఆహుతి చేయబడుతుంది. ఆసనం సిద్ధం చేయబడుతుంది. హోత వచ్చి దానిపై ఆసీనుడవుతాడు.
జనక మహారాజు ఆస్థానంలో శాస్తచ్రర్చ ఆరంభింపబడింది. ఒకప్రక్క యాజ్ఞవల్క్యుడు మరొకవైపు జ్ఞానులు ఆసీనులయ్యారు. అప్పుడు శాకలమహర్షి యాజ్ఞవల్క్యుని ‘‘దేవతలెందరు? అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా ‘యావంతో వైశ్వదేవస్య నివిద్యుచ్యంతే త్రయశ్చత్రీ చ శతా త్రయశ్చత్రీ చ సహస్రా’ (బృహదారణ్యకోపనిషత్తు 3-9-1) వైశ్వదేవ అధ్యాయంలో ఎందరు చెప్పబడ్డారో అందరు దేవతలు. అంటే మూడువేల మూడువందల ముప్పది తొమ్మిది మంది. శుక్లయజుర్వేదంలోని ముప్పది మూడవ అధ్యాయారంభంలో యాజ్ఞికుల మతానుసారం ’విశ్వదేవ’ దేవతల వివరణ ఉంది. జనక మహారాజు యాజ్ఞవల్క్యుని సమాధానాన్ని విని ఇలా ప్రశ్నించాడు.
‘కతమే తే త్రయశ్చ త్రీ చ శతా త్రయశ్చ త్రీ చ సహస్రా ఇతి’ ‘‘ఆ మూడువేల మూడువందల ముప్పది తొమ్మిది మంది దేవతలెటువంటివారు?

- ఇంకావుంది...