స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరీరం ఆత్మకు నివాస స్థానం. అదే ఆత్మ అనే సరస్వతీనది ఐదు విధాలుగా ప్రవహిస్తూంది. అయితే బయటనుండి విషయ వాసనలు ప్రవహింపచేసే ఇంద్రియ ప్రవాహాలను నిరోధిస్తే ఆత్మ అనే సరస్వతీనది ఏకైక రూపమై ప్రవహిస్తుంది. ఈ విషయాన్ని కఠోపనిషత్తు ఇలా వివరించింది.
యదా పంచావతిష్ఠంతే జ్ఞానాని మనసా సహ బుద్ధిశ్చ న విచేష్టతే తమాహుః పరమాంగతిమ్‌॥ (కఠోపనిషత్తు. 1-6-10)
‘‘మనస్సుతో సహా ఐదు జ్ఞానేంద్రియాల కార్యకలాపం నిలిచిపోతే బుద్ధి కూడ ఏ కార్యంలోను ప్రవర్తించదు. అదే పరమగతి మోక్షమని చెప్పబడుతూంది’’ కాబట్టి పంచజ్ఞానేంద్రియాల విషయప్రవాహాలు ఆత్మకు చేరినంతకాలం అది అయిదుగా ప్రవహించే సరస్వతిగానే పలు శరీరాలలో ప్రవహిస్తూ జన్మ-మరణ దుఃఖాలను అనుభవిస్తుంది.
***
జీవితమే అశాశ్వతం- దైవాన్ని ఆరాధించు
అశ్వత్థే వో నిషదనం పర్ణే వో వసతిష్కృతా
గోభాజ- ఇత్కిలాసథ యత్ సనవథపూరుషమ్‌॥ శు.య.వే.35-4॥
భావం:- ఓ మానవుడా! నీ ఆసనం అశ్వత్థవృక్షం (రావి) మీద ఉంది. అశ్వత్థపత్రం (రావి ఆకు)మీద నీ నివాసముంది. నీవు పురుషోత్తముడైన సర్వేశ్వరుని ఆరాధిస్తే నీవు సదసద్వివేక రూపమైన జ్ఞాన ప్రకాశాని కర్హుడవవుతావు.
వివరణ:- జన్మించిన ప్రతి మనిషి తానీ లోకంలో శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకొంటాడు. మనిషిలోని ఈ కోరికను గురించి మహాభారతంలో యక్షుడడిగిన ప్రశ్నకు సమాధానంగా యుధిష్టిరుడు చెప్పిన సమాధానం గమనించదగింది.
అహన్యహని భూతాని గచ్ఛంతీహ యమాలయమ్‌
శేషాః స్థావరమిచ్ఛంతి కిమాశ్చర్యమతః పరమ్‌॥
ప్రతి దినమూ ఎందరో మృత్యువాత పడుతున్నారు. దానిని చూచినవారు మాత్రం తాము స్థిరంగా ఉంటామని అనుకొంటారు. ఇంతకంటె ఆశ్చర్యకరమైన విషయమేముంటుంది?
లోకంలో ఏ పదార్థమూ- ఏ ద్రవ్యమూ స్థిరంగా ఉండదు. మరి ఈ లోకంలో స్థిరంగా ఉండాలనే కోరిక ఎలా ఉచితం? ఓ మానవుడా! ఇంతకూ నీ ఉనికి ఎక్కడో తెలుసా?
‘అశ్వత్థే వో నిషదనమ్’ అశ్వత్థవృక్షం (రావి)మీదనే నీ ఉనికి అని వేదం హెచ్చరిస్తూంది. అంటే అర్థమేమిటి? ‘యః శ్వః న స్థాస్యతి సః’ రేపు ఉండనిది అని. అలా ఉండనిది శరీరమే.
లోకంలో చాలామంది ఫలానా పని రేపు చేద్దామని వాయిదావేస్తారు. కాని ఆ వ్యక్తి రేపటిదాకా జీవించియుంటాడని నమ్మకమేమిటి? అందుకే వేదం మానవుడా! నీ ఉనికి అశ్వత్థవృక్షం మీదనే అని హెచ్చరించింది. మానవ జీవితాన్ని అశ్వత్థవృక్షంతో పోల్చడంతో మరో సారూప్యముంది. అశ్వత్థవృక్షానికి లౌకిక సంస్కృతంలో ‘చలదళ’మని కూడ పేరుంది. అంటే నిరంతరం కదిలే ఆకులు గల వృక్షమని అర్థం. ఆకులలా నిత్యం కదులుతూ ఉండటంలోని పరమార్థం అస్థిరత్వాన్ని తెలపడంకోసమే. వేదమీ అశ్వత్థ పత్రానే్న ఉదాహరణగా చూపుతూ ‘పర్ణే వో వసతిష్కృతా’ ‘‘రావి ఆకులమీదే నీ నివాస’’మని జీవితంలోని అస్థిరత్వాన్ని మరోసారి స్పష్టంచేసింది. మరో విశేషమేమంటే వృక్షానికున్నంత ఆయుర్దాయం దాని పత్రానికుండదు. ఏమాత్రం గాలి గట్టిగా వీచినా ఎండుటాకులే కాదు పచ్చి ఆకులు సహితం రాలిపోతాయి. కాబట్టి మానవుడా! నీ ఆయువు రావి ఆకువలె చాలా అల్పమైనదని, క్షణ భంగురమయినదని చెప్పడమే వేదం జీవితాన్ని రావి ఆకుతో పోల్చడంలోని రహస్యం.
ఇలా వేదం జీవితాన్ని అసారమూ అస్థిరమైనదిగా చెబుతూనే ఎప్పుడు సారవంతమూ, సార్థకమూ, సుస్థిరమూ అవుతుందో కూడ తెలుపుతూ ‘గోభాజ- ఇత్కిలాసథ యత్సనవథ పూరుషమ్’ ‘‘పూర్ణపురుషుడైన భగవంతుని ఆరాధిస్తే గోభాగీ= ప్రకాశాధికారి అంటే సదసద్వివేక ప్రకాశం చేత ప్రకాశమానుడవుతావు’’అని దారిచూపింది.
ఈ సదసద్వివేకమే జ్ఞానోపలబ్ధికి మూలం. అది జీవుని సాయుజ్యప్రాప్తికి ప్రధానోపాయం. అదే జీవిత పరమార్థం. ఆ పరమార్థసిద్ధికే ‘ఓ మానవుడా! భగవంతుని సేవించు’మని యజుర్వేదోపదేశం.
***
ప్రభూ! నా దోషాలను తొలగించు
యనే్మ ఛిద్రం చక్షుషో హృదయస్య మనసో
వాతితృణ్ణం బృహస్పతిర్మే తద్ద్ధాతు
శం నో భవతు భువనస్య యస్పతిః॥ శు.య.వే.36-2॥
- ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512