స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
భగవంతుని ఎడల భక్తినెందుకు కలిగియుండాలి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పనంతవరకు ఇతరులలో భగవద్భక్తిని ఎవరూ కలిగింపలేరు. లోకంలో మనుష్యుల ఆలోచనలన్ని పొట్టనింపుకొనే పని చుట్టూనే తిరుగుతూ వుంటాయి. అంతమాత్రమే కాదు, సుఖజీవనం కోసం అనేక ద్రవ్యాలను, వస్తువులను కూడబెట్టాలనే వాంఛ కూడా మనుషుల్లో అధికం. కాని అట్టి వస్తుజాలాన్ని ఎవరో ఒకరిద్దరు తప్ప అందరు సంపూర్ణంగా సమకూర్చుకోలేరు. దానికి మనుషులలో చింత ప్రారంభమవుతుంది! ఆ చింత ఏల? ఓ మానవుడా! సృష్టిలోని సర్వ పదార్థాలకు ప్రభువు ఒకడున్నాడు. ఆయన ఎవరికెంత ఈయదలచాడో అంతా ఎక్కువ తక్కువలు లేకుండా సమబుద్ధితో సమకూరుస్తూ ఉంటాడు. అట్టి సమదర్శి భగవంతునే హవ్య వాహనుడని వేదం పై మంత్రంలో వ్యవహరించింది.
లోకంలో చాలామంది ‘మేము కర్మలను చేసాం. దానికి ఆయన ఫలమిచ్చాడు. ఇందులో ఆయనుపకారమేముంది? ఇది దేవుడికి మాకు మధ్యగల వట్టి వ్యాపారమే కదా?’ అని కుతర్కం చేస్తారు. ఇట్టి అజ్ఞానులు భగవంతుని మార్మికత్వమెట్టితో గ్రహించనివారు. అట్టివారు నీకెదురుపడినపుడు ‘ఆ పరమాత్మ కర్మఫలానే్న ఈయకుంటే ఏమి చేయగలవు? అసలు కర్మఫలాన్ని ఈయడం ఆయన కరుణ మరియు మహోపకారమే’. ఓరీ అమాయకుడా! నీవాయనకు ఇస్తున్నది లేదు. నీ వద్దనుండి ఆయన తీసుకొంటున్నది లేదు. నీవిచ్చినదానికి ఆయనేదేని ఇస్తే అది వ్యాపారమవుతుంది. కాని ఆయనకిచ్చేందుకు అసలు నీ దగ్గరేముంది? ఒకవేళ ఏదేని నీ వద్ద ఉంటే అది నీకాయన ఇచ్చిందే అని ప్రశ్నించి చూడు.
లోకంలో భోగాలనుభవించాలనుకొంటే దానికి తగిన ప్రయత్నం చేయాలి. దానికి తగిన శారీరక, మానసిక బలం కావాలి. ఆ బలాన్ని వృద్ధి చేసేవాడు కూడా ఆ పరమాత్ముడే. అందుకే పై మంత్రంలో ఆయనను సహోవృధమ్ బలాన్ని వృద్ధిచేసేవాడని శ్లాఘించింది. ఇదేవిధంగా యజుర్వేం కూడా ‘య - ఆత్మదా బలదా’ ఆత్మానుభూతిని మరియు శరీర బలాన్ని ఇచ్చేవాడు ఆయనయే అని ఆ భగవంతుని ప్రశంసించింది. ఈ భావాన్ని విపులంగా వివరిస్తూ ఒక ప్రార్థనా మంత్రం అథర్వణ వేదంలో ఇలా కనబడుతూంది.
ఓజో - స్యోజోమే దాః స్వాహా సహో - సి సహో మే దాః స్వాహా
బలమసి బలం మే దాః స్వాహా
భావం:ఓ ప్రభూ! నీవు ఓజోవంతుడవు. నాకు ఓజస్సు నిమ్ము. సర్వబలాలకు మూలము నీవే. నాకు బలమిమ్ము. నేను హృదయపూర్వకంగా సత్యమే చెబుతున్నాను. నా దృఢత్వానికి, బలానికి నీవే ఆధారం. నాకు బలమిమ్ము.
భోగాలు - భోగసాధనాలు మరియు బలానికి నిలయమైన భగవంతుని జాగృతి పరచకుంటే మనమేమి పొందగలం? లోకమెప్పుడు నిద్రిస్తూ వుంటుంది. నిద్రించేవాడు ఎవరినైనా ఎప్పుడైనా జాగృతపరచగలడా? జ్యోతి స్వరూపుడైన పరమాత్మ జాగరూకుడు మాత్రమే మేల్కొల్పగలడు. ‘జాగృవాంసః సమింధతే’ అని రుూ మంత్రం చెప్పింది ఇదే. దీనినే ఋగ్వేదం మరియు కఠోపనిషత్తు.
‘దివేదివ ఈడ్యో జాగృవద్భిః’ జాగరూకులే ప్రతిదినం పరబ్రహ్మను ఆరాధిస్తారు.
ఉత్తిష్ఠత! జాగృత- తెమ్ము జాగరూకుడవు కమ్ము అని ప్రబోధించాయి. భగవద్గీత కూడా-
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః
‘‘ప్రాణులన్ని నిద్రించే సమయంలో సంయమీంద్రులు మేల్కొని యుంటారు. సంయమివరులు నిద్రించే సమయంలో ప్రాణులు నిద్రిస్తాయి’’ అని ఇదే విషయాన్ని సమర్థించింది. సామాన్య జనులు భోగానుభవంనుండి బయటపడలేరు. వారి జీవితమంతా ఆహార పానీయాది సామగ్రిని సమకూర్చుటయందే గడిచిపోతుంది. కాని ఎవరీ శరీరాన్ని ఇచ్చాడో అతడే దీనిని రక్షణ చేసే సామగ్రిని కూడా తప్పక ఇస్తాడని జ్ఞానికి మాత్రమే తెలిసియుంటుంది. అతనిని ఈ జన్మలోనే తప్ప మరో జన్మలో పొందడం మాత్రమే సాధ్యపడదు. ఈ సందర్భంలో యమ - నచికేతుల మధ్య జరిగిన సంభాషణ గుర్తింపవలసియుంటుంది. యముడు నచికేతునికి అనేక భోగవస్తువులను ప్రస్తావించి వాని నన్నింటినీ నీవు తీసుకో. కాని ఆత్మ తత్త్వాన్ని మాత్రమడగవద్దు అన్నాడు. అప్పుడు నచికేతుడు మార్మికంగా సమాధాన మీ విధంగా ఇచ్చాడు.
శ్వోభావా మర్త్యస్య యదంతకైతత్ సర్వేంద్రియాణాం జరయంతి తేజః
అపి సర్వం జీవితమల్పమేవ తవైవ వాహాస్తవ నృత్యగీతే
న విత్తేన తర్పణీయో మనుష్యో లప్స్యామహే విత్తమద్రాక్ష్మ చేత్వా
జీవిష్యామో యావదీశిష్యసి త్వం వరస్తు మే వరణీయః స ఏవ
ఓ యమధర్మరాజా! నీవు నాకిప్పుడీయదలచినవి నేడుంటాయి. రేపు మాత్రముండవు. అంతేకాక అవి నా ఇంద్రియ శక్తులన్నింటిని హరించి వేస్తాయి.
*
ఇంకావుంది...