స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-54

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుర్యోధనుడు దుష్టతతుష్టయంలోని వాడయినా ‘‘సూచ్యగ్రం నైన దాస్వామి వినా యుద్ధేన కేశవ!’’ యుద్ధం చేయకుండ వాడి సూది మొనమోపినంత నేలను కూడ పాండవుల కీయను’’అని చెప్పిన మాటకు సందర్భం వేరయినా జీవన యుద్ధం చేయకుండా ఎవరికి ఏమీ లభించదన్న సత్యాన్ని నిర్ద్వంద్వంగా చెప్పిందే.
ఎవడైనా తానేమీ పనిచేయకనే సోమరిగా ఉండి జీవితంలో సౌఖ్యాలను పొందాలని కాంక్షించేవాడు మాయలో పడ్డట్టే. ఈ జీవన రహస్యానే్న ఋగ్వేదం ‘‘న ఋతే శ్రాంతస్య సఖ్యాయ దేవాః’’ (ఋ.4-33-11) ‘‘కష్టించి పనిచేయని వానికి దైవీ శక్తులు సహితం సుఖాలననుగ్రహించవు’’అని స్పష్టంగా హెచ్చరించింది.
ఈ హెచ్చరికనే సమర్థిస్తూ ‘‘నైవశ్రమో న విశ్రమః’’ శ్రమలేదు కాబట్టి విశ్రామం కూడ లేదు అన్న సూక్తి పుట్టింది. అందుకే ఈ వేదర్షి ‘‘సమర్య ఆ విదథే వర్థమానః’’ జీవిత సంగ్రామంలో లక్ష్యసిద్ధిని సాధించేందుకు సర్వవిధాల ప్రయత్నించి అభివృద్ధి పొందుము’’అని జీవిత లక్ష్యాన్ని నిర్దేశించాడు.
ఈ లక్ష్యానికి ప్రయత్నించనవాడు జన్మనెత్తి మాత్రం ప్రయోజనమేముంది? జీవిత పురషార్థానికై ప్రయత్నమే చేయని వానికి జీవితమే సాగదు. అతడికి ఎప్పుడూ సుజీవనం మరియు సుదినం ఈ రెండూ దూరంగానే ఉంటాయి. ప్రయత్నంలోనే జీవిత సార్థక్యముంది. అభివృద్ధి యుంది. చురుకుగా లేని పిల్లల్ని చూడండి. వాళ్లెప్పుడూ తోడివారి కంటె వెనుకబడియే ఉంటారు. ఇక ఆరోగ్యంగా ఉండే పిల్లల్లో! వాళ్లెప్పుడూ పరుగిడుతూ, గెంతుతూ, కేరింతలు కొడుతూ ఉల్లాసంగా ఉంటారు. అదే వాళ్ళ ఎదుగుదలకు సంకేతం. ఇదే విధంగా జీవితంలో పెద్దలు కూడ ఉల్లాసంగా ఉంటూ పైపైకి ఎదిగిపోతుంటారు. వేదం ఈ విషయానే్న, ‘విదధే’ జీవిత ప్రధాన లక్ష్యాలను చేరుకొనేందుకు, ‘సమర్య’జీవితంలో ఎదురయ్యే సమరాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధపడి యుంటారు అని వివరించింది.
అభివృద్ధి చెందడమంటే ఏమిటి?- ఎదురయ్యే సమస్యలతో తలపడటం- పురుషుడుగా జీవితంలో సాధించవలసిన లక్ష్యాన్ని చేరుకోవడమే. జీవన సమరంలో పోరాడి పోరాడి చివరకు లక్ష్యాన్ని చేరుకోలేక జీవితమంతా సంగ్రామంలో గడిచిపోతే ఆ జీవితం వ్యర్థమైనట్లే. కాబట్టి జీవన పోరాటాన్ని గ్రుడ్డిగా చేయరాదు. పోరాటం కేవలం సాధనం మాత్రమే. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు