స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-59

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
సత్తా= సుస్థిరమైయుండువాడై యుండెనో; చ= మరియు; శంభుః= పరులకు శుభాలనుకోరి చేయువాడైయుండెనో; ద్వితాః= రెండు రీతులుగా కూడ ఉండువాడై యుండెనో; చికిత్వః= సర్వమూ గ్రహింపగల బుద్ధిమంతుడా!; తస్య= వానిని; అను= అనుసరించుము; ధర్మ= ధర్మాన్ని; ప్ర యజ= నిష్ఠగా ఆచరించుము; నః= మా; అధ్వరమ్= యజ్ఞాలను మరియు అహింసాయుత కర్మలను; దేవవీతౌ= దివ్యకామన నిమిత్తంగా; ధా= వహించి చేయుము.
భావం:- ఓ పరమజ్ఞానీ! ఎవడు నీకు పూర్వుడై అనేక యజ్ఞాలుచేసి పరోపకార పరాయణుడై స్వస్వభావాన సుస్థిరుడై యున్నాడో ఆయనను నీవు అనుసరించు. ధర్మాన్ని నిష్ఠగా ఆచరించదగిన యజ్ఞాలను- అహింసాయుత కర్మలను దివ్యకామనాభావంతో ఆచరించు.
వివరణ:- లోకంలో నేడు బుద్ధివాద సంరంభమెక్కువగా ఉంది. అందరూ మా బుద్ధిననుసరించి నడుస్తున్నామని అంటూ ఉంటారు. అలా అనడం సబబే. కాని దానిని కొంచెం విచారణ చేయవలసి యుంది. బుద్ధి బాలుడికి కూడ ఉంది. వాడు తన తల్లిదండ్రులను, సోదరీ- సోదరులను, అత్తమామలను నిత్యమూ అనుసరించవలసి యుంటుంది. వారందరూ ఎలా నడుస్తారో- ఎలా మాటలాడతారో ఆ బాలుడు కూడ అలానే అనుకరిస్తూ నడుస్తాడు, మాటలాడతాడు. బాలుడికి ఆ అనుకరణ బుద్ధిలేక జరుగదు కదా. లోకంలో ‘నకల్ కే లియో భీ అకల్ చాహియే’ నకిలీ(Duplicate)కైనా అసలు (Original) కావాలి అన్న హింధీ సామెత ఒకటి యుంది. ఆ ప్రకారంగా పిల్లవాడే కాదు జ్ఞాని, ఆధ్యాత్మికవేత్త, విజ్ఞాన శాస్తజ్ఞ్రుడు, గణిత శాస్తజ్ఞ్రుడు ఇలా ఎంతటి మహాపండితుడయినా ఆతడు జీవితంలో ఎవరినీ అనుకరించకుండా అంతటి వాడయ్యాడా? నిజానికి ఆ మహావిద్వాంసుని వద్ద ఉన్న విజ్ఞానంలో స్వంతంగా ఉన్నది స్వల్పం. ఇతరులనుండి నేర్చుకొన్నది అనల్పం. అందుచేత మానవ జీవితంలో అనుకరణ చాల ప్రధానమైంది. ఈ మాట వేదం కొన్ని వేల, కోట్ల సంవత్సరాలనాడే-
‘యస్త్వద్ధోతా పూర్వో యజీయాన్’ ‘నీ కంటె పూర్వమే ఎన్నో యజ్ఞయాగాది క్రతువులను చేసియున్న హోతను అనుసరించు’మని హితవు పలికింది.
మనమనుసరించే వ్యక్తి సమకాలీనుడైనా ఎవడు మనకంటె పెద్దవాడో మరియు గుణాఢ్యుడో ఆతనినే మన మనుసరిస్తాం. కాని కేవలం తనతో సమానమైన గుణశీలాలు కలవానిని ఎవడూ అనసరించడు. ఆ విధంగా మన మనుసరించే వ్యక్తిపై వేదోపదేశం ప్రకారం అధిక యజ్ఞకర్త అయి యుండాలి. ఇక్కడ యజ్ఞమంటె పరోపకారకమైన కర్మయే. అట్టి పరోపకార పరాయణశీలియై కర్మచేసేవాడే యజ్ఞకర్త. అట్టివానినే మంత్రం ‘శంభుః’లోక శ్రేయోభిలాషిగా అభివర్ణించింది. ఇట్టివాడే అందరికి అనుసరనీయుడని వేదం వచించింది. ఇదే విషయం స్నాతకోత్సవ సమయంలో శిష్యుడికి చేసే గురూపదేశంలో ఇలా బోధింపబడుతుంది.
అథ యది తే కర్మ విచికిత్సా వా వృత్త విచికిత్సా వా స్యాత్‌
యే తత్ర బ్రాహ్మణాః సమ్మర్శినః, యుక్తా ఆయుక్తాః,
అలుక్షా ధర్మ కామాః స్యుః,
యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్త్థాః॥ తైత్తిరీయోపనిషత్- 1-11 ॥
భావం:- కార్యాచరణ సందర్భంలో ఏది యుక్తం. ఏది అయుక్తం అనే సందేహం నీకు కలిగినపుడు గాని లేదా ఏది సదాచారం ఏది కాదు అన్న సందేహం కలిగినపుడు సమవర్తనులు, ధర్మతత్పరులు, పాపరహితులు, సరళ స్వభావులు, ధర్మప్రబోధకులు, బ్రహ్మనిష్ఠులు అయిన మహాపురుషులు అయినవారు ఎలా ప్రవర్తిస్తారో చూచి తెలిసికొని నీవు కూడ అలా ప్రవర్తించు.
ఈ తైత్తిరీయోపనిదుపదేశంలో ఎటువంటి వారిని అనుసరించరాదో స్పష్టంగా వ్యక్తీకరింపబడింది. దానిననుసరించి లోభులు, కఠిన స్వభావులు, అధార్మికులు, భేద బుద్ధికలవారు, అనుసరణీయులు కారు.
ఇంకావుంది...