స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-60

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ విధంగా మహాత్ములగు పెద్దలననుసరించి యజ్ఞాదులు చేసినా లేదా యజ్ఞమంటె పరోపకార కర్మయే అన్న అర్థాన్ని గ్రహించి పరోపకార కర్మచేసినా మనస్సున ఎట్టి సంకల్పంతో చేయాలో కూడ ఈ మంత్రం ‘అథా నో ధా అధ్వరం దేవవీతౌ’ మేము అధ్వరాలను (యజ్ఞాలను) సత్కామనాభవంతో (సత్సంకల్పాలు) ఆచరించెదముగాక అని నిర్దేశించింది.
ఎప్పుడూ ఏ కోరికా లేకుండ ఉండడము అసంభవము. మనుమహారాజు చెప్పినదేమిటంటే-
కామాత్మతా న ప్రశస్తా న చైవేహాస్త్యకామతా;
కామ్యోహి వేదధిగమో కర్మయోగశ్చ వైదికః॥ మను.2-2॥
సత్కామన అంటే ఏమి? స్వార్థచింతనతోకాక పరార్థకామనతోగాని భగవత్ప్రీత్యర్థంగా చేసే కామన గాని సత్కామన అనబడుతుంది. దీనివలన చేసే కర్మలలో సహజంగా సంభవించే సంసారబంధనమనే దోషం తొలగిపోయి భగవత్‌ప్రాప్తి వైభోగం సంప్రాప్తిస్తుంది. ఈ దివ్యస్థితి సత్యం- సత్యం- సత్యం అని చెప్పే మాండూక్యోపనిషత్ ఋషివచనాన్ని వినండి.
ఉపాసతే పురుషం యే హ్యకామాస్తే శుక్రమేతదతి వర్తంతి ధీరాః
కామన్ యః కామయతే మన్యమానః స కామభిర్జాయతే తత్ర తత్ర
పర్యాప్త కామస్య కృతాత్మనస్తు ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాః॥
మాండూక. ఉ.3-2-1,2॥
భావం:- భౌతిక వాంఛలను విడిచి రిభగవదుపాసన చేసే ధ్యానయోగులు సంసార చక్రంనుండి విముక్తులవుతారు. కాని లౌకిక కామవాంఛలతో కర్మలను చేసేవారు మాత్రం వానివలన పలుమార్లు జన్మించి దుఃఖసాగరంలో మునిగిపోతారు. ఎవరి కామనలు భగవత్ప్రీత్యర్థంగా పరిపూర్ణమవుతాయో వారి కర్మబంధనాలీజన్మలోనే విచ్ఛేదమవుతాయి.
కాబట్టి ఓ మానవుడా! స్వార్థకామన వీడు. జన్మబంధంనుండి పరాఙ్మఖడవు కమ్ము. భగవత్సంబంధం పెంచుకో. సంసార బంధం త్రుంచుకో.

39. అన్నింటి యందున్నవాడు పరమేశ్వరుడే
ఆతిష్ఠంతం పరి విశే్వఅభూషన్ శ్రీయో వసానశ్చరతి స్వరోచిః
మహత్తద్ వృష్ణో అనురస్య నామా విశ్వరూపో అమృతాని తస్థౌ॥ ఋ.3-38-4.
ప్రతిపదార్థం:- ఆతిష్ఠంతమ్= అంతట వ్యాపించియున్న భగవానుని; విశే్వ= అన్నియూ; పరి =సర్వవిధాలుగా; అభూషన్= స్పష్టంగా ప్రకటిస్తున్నాయి; సః= ఆ భగవానుడు (అధ్యాహార్యం); స్వరోచిః = స్వయంప్రకాశుడు; శ్రీయః= సమస్త శోభావిశేషాలను; వసానః= తానే ధరించి; చరతి= విశ్వాన్ని నడిపిస్తున్నాడు; వృష్ణః= సుఖ సంతోషాలను వర్షించే; అసురస్య= ప్రాణాధారుడైన భగవానుని; తత్= ఆ; మహత్= గొప్ప; నామ= కీర్తి; కిమితి= ఏమంటె (అధ్యాహార్యం); విశ్వరూపః= సమస్త సృష్టికర్త; అమృతాని= అమృత జీవులయందు మరియు ప్రకృతియందు; తస్థౌ= తానే ప్రవేశించి యున్నాడు.
భావం:- సృష్టిలోని సర్వపదార్థాలూ అంతట వ్యాపించిన భగవానునే సమస్త విధాలా ప్రకాశింప చేస్తున్నాయి. ఆయన స్వయం ప్రకాశవంతుడు. సృష్టిలోని సర్వలక్ష్మీ స్వరూపాలను తానే వహించియున్నాడు. తానే సృష్టిని నిర్వహిస్తున్నాడు. సర్వజీవులకు సుఖసంతోషాలను వర్షిస్తూ ప్రాణాధారుడై యుండిన ఆ పరమాత్మ గొప్ప ప్రతిష్ఠ ఏమంటె తానే సర్వసృష్టికర్తయై సమస్త జీవులయందు ప్రకృతియందు స్వయంగా ప్రవేశించి ప్రకాశిస్తున్నాడు.
వివరణ:- పరమాత్మ స్థిరుడు. అయినా ఒకచోటనే నిలిచి యుండడు. అంతటా ఉంటాడు. నిత్యమూ మనం చూడగలుగుతున్న రుూ సూర్యచంద్రాదులు ఆ పరమాత్మ దివ్య తేజస్సునే ప్రకటిస్తున్నాయి. ఆయన మహిమనే గానం చేస్తున్నాయి. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు