స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం- 61

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
స్థూల దృష్టితో భావించే వారికెప్పుడయినా ఈ సూర్యచంద్రాది దేవతల చేతనే ఆ పరదైవం ప్రకాశిస్తున్నదని కలిగే సందేహానికి తావులేకుండ మంత్రంలో పరబ్రహ్మ ‘స్వరోచిః’ స్వయంప్రకాశుడన్న పదంతో స్పష్టంగా చెప్పడం జరిగింది. అందువల్ల పరమాత్ముడు ఇతరులచేత ప్రకాశించడు. స్వయంప్రకాశుడు కావడంచేత సమస్త ప్రకాశాలకు తానే మూలకారణమై తానే వివిధ ప్రకాశమయ రూపాలుగా ప్రకాశిస్తున్నాడు. అంటె సృష్టిలో శోభ, కాంతి, తేజస్సు, వైభవం మొదలైనవి ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీకూడ తానైయున్నాడు. ఇలా సర్వమూ ఆ పరదైవమే అయినప్పుడు సుఖ-సంతోషాల ప్రదాత కూడ ఆయనే. అందుచే ఈ మంత్రం మరియు అనేక వేదమంత్రాలలో ఆ పరమేశ్వరుడు వృషా= సుఖాలను వర్షించేవాడు అని వ్యవహరింపబడ్డాడు. అంతేకాదు జీవుల జీవన సుఖ- సంతోషదాయకమైన సమస్త ద్రవ్యాలు- సామగ్రికి ప్రభువు ఆయనే కాబట్టి ఈ మంత్రం అసు+ర= ప్రాణదాత- జీవనదాత అని వ్యవహరించింది.
ప్రపంచంలో కనబడే ఎనె్నన్ని రూపాలున్నాయో అన్నీ. దేవాధిదేవుడేనని ఈ మంత్రం ‘విశ్వరూపః’అనే పదంతో నిర్దేశించింది. ఆ విధంగా జీవ-ప్రకృతులను సంయోగపరచి సృజించిన వివిధ రూపాలలో తానే ప్రవేశించి యున్న భగవత్తత్త్వాన్ని ‘అమృతాని తస్థౌ’అని ప్రస్తుత మంత్రం వివరించింది. సత్యమైన ఈ భగవత్తత్వానే్న శే్వతాశ్వరోపనిషత్తు క్రింది విధంగా పునరుద్ఘాటించింది.
సర్వాదిశా ఊర్ధ్వమధశ్చ తిర్యక్ ప్రకాశయన్ భ్రాజతే యద్వదనడ్వాన్
ఏవం స దేవో భగవాన్ వరేణ్యో యోని స్వభావా నధి తిష్ఠత్యేకః॥ 4॥
యచ్చ స్వభావం పచతి విశ్వయోనిః పాచ్యా శ్చ సర్వాన్ పరిణామయేద్యః
సర్వమేతద్విశ్వ మధితిష్ఠత్యేకో గుణా శ్చ సర్వాన్ వినియోజయేద్యః॥ 5॥
॥ శే్వతాశ్వతరోపనిషత్తు 5-4-5॥
భావం:- పైనా- క్రిందా- అడ్డంగా అన్నిదిక్కులనూ ప్రకాశింపజేస్తూ సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నట్లే సకల సద్గుణాలకు, మహత్వానికి ఆరాధ్యుడైన ఆ ఒక్క భగవంతుడు కారణరూపంగల ప్రతి దానియందు నియామకుడై యుండి పర్యవేక్షిస్తున్నాడు. విశ్వానికి ఉత్పత్తి స్థానమైన దాని స్వభావాన్ని పరిపూర్ణం చేసేవాడు: ఆ రీతిగా పరిపూర్ణత పొందదగిన సర్వపదార్థాల ధర్మాలను వానికి తగిన రీతిగా వినియోగపరచే ఆ ఒక్క భగవంతుడే అన్నింటికి అధిష్ఠానుడై ఉన్నాడు.
ఈ ఉపనిషత్తు మంత్రంలోని భావాన్ని స్పష్టంగా తెలిపేందుకై వేదర్షి సూర్యుణ్ణి ఉపమానంగా స్వీకరించి సూర్యుడు పృథివ్యాది గ్రహాలను, చంద్రాది ఉపగ్రహాలను ప్రకాశింపచేస్తూ స్వయంగా ప్రకాశిస్తున్నాడు. ఇట్లే దేవాధిదేవుడైన పరమేశ్వరుడు ‘శ్రీయోవసానశ్చరతి స్వరోచిః’ అన్నింటి ప్రకాశమాన ధర్మాలను తానే వహించి స్వయంగా ప్రకాశిస్తున్నాడు అని వర్ణించాడు.
సూర్యుడు ఒకే స్థానంలో స్థిరంగా ఉండి సర్వగ్రహమండలాలను, ఉపగ్రహాలను, నక్షత్రాదులను తన ఆకర్షణ- వికర్షణల ద్వారా సమర్థవంతంగా నియంత్రిస్తున్నాడు. అయితే ఆ సూర్యాదుల ప్రభావమెంతో విస్తృతమైనదైనా పరిమితమైనదే. ఋగ్వేదంలోని ‘సప్తదిశోనానాసూర్యాః’ (ఋ.9-14-3) ఈ ఏడు దిక్కులలో అనేక సూర్యులున్నారు అన్న వచనానుసారం ఈ బ్రహ్మాండంలో అనేక సూర్యులున్నారు. కాని ఆ అనంత సూర్యులను ప్రకాశవంతంగానే భగవానుని మహిమనేమని కొనియాడాలి? సూర్యుని కాంతి ప్రసారం మరియు ప్రభావం కేవలం జడములు, అనిత్యములూ అయిన పదార్థాల మీదనే కాని ఈ మంత్రంలోని ‘విశ్వరూపో అమృతాని తస్థౌ’ విశ్వరూపుడైన భగవంతుడు వానితోబాటు సకల జీవప్రపంచానికి అధిష్ఠానమైనవాడు.
ప్రతి వేదమంత్రంలో విధిరూపమైన లేదా నిషేధ రూపమైన భావం తప్పక ఉండాలని మీమాంసకుల అభిప్రాయం
ఇంకావుంది...