స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం--67

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
===============================

నేను అసంపూర్ణుణ్ణి. కనుక అపవిత్రుణ్ణి. నన్ను పునీతుణ్ణి చేసేందుకే ఈ జీవన సౌభాగ్యాన్ని అనుగ్రహించాడు. అట్టి పరమపురుషుణ్ణి నిందచేయనా? జ్ఞాన బోధకుడు- గురువు అయిన మహాదేవుని నింద వినజాలను. చేయజాలను. మరి అట్టి గురునింద ఎప్పుడైనా ఎక్కడైనా చెవులబడితే ఏమిచేయాలి? ‘కర్ణౌ తదా పిధాతవ్యౌ గురునిందా భవేద్యదా’అన్న పెద్దల వచనానుసారం చెవులను మూసుకోవాలి? కాబట్టి సర్వజ్ఞుడు. సర్వజనహితకారి- జగద్గురువైన భగవానుని నిందించకు. నిందిస్తే నీ మాట వినను అని కూడ హెచ్చరించు. ఎందుకంటె భగవన్నింద వినవద్దని ఋగ్వేదమే ‘‘వస్త్రా ఇంద్రాసి మీ పితు రుత భ్రాతు రభుంజతః’’ (ఋ.8-1-6)
‘‘ఆ మహాదేవుడు నా తల్లి తండ్రి, సోదరుడు కంటె పూజనీయుడు, సత్కారార్హుడు’అని స్పష్టం చేసింది. అట్టి జగద్గురు నింద చేయనా? విననా? కాబట్టి సర్వజీవులు తమ జీవన సౌభాగ్యానికి సమస్తమూ దానంచేసే ఆ మహావితరణ గుణశాలియైన దైవాన్ని-
భూరిదా భూరి దేహినో మా దభ్రం భూర్యా భర
భూరి ఘేదింద్ర దిత్ససి॥ ఋ.4-32-20॥
భూరిదా హ్యసి శ్రుతః॥ ఋ.4-32-21॥
ఓ మహాదానీ మాకు భూరిదానం చేయి.
స్వల్పంగా వద్దు. ఓ ఇంద్ర! మహాదానశీలుడవుగా ఖ్యాతి పొందిన నీవే ఎంతో దానంచేయాలని ఉత్సాహంతో ఉన్నావు అని ప్రార్థించమని ఋగ్వేదం శాసిస్తూంది.
అలా ప్రార్థించేవారికి భగవానుడుచేసే దానం కూడ ‘్భద్రా భద్రస్య రాతయః’ (ఋ.1-132-2) చాలా శుభదాయకమై ఉంటుందని ఋగ్వేదం ఉద్ఘాటిస్తూ ఉంది. అట్టి భగవంతుడు ప్రసాదించే జీవన దానాన్ని నింద చేయదగునా??
శిష్యుడు వినీతుడై బ్రహ్మజ్ఞానాన్ని అర్థించాలి
ఋతం వోచే నమసా పృచ్ఛ్యమానస్తవాశసా జాతవేదో య దీదమ్‌
త్వమస్య క్షయసి యుద్ధ విశ్వం దివి యదు ద్రువిణం యత్ పృథివ్యామ్‌॥ ఋ.4-5-11॥
ప్రతిపదార్థం:- జాతవేద= ఓ సర్వజ్ఞుడా!; దివి= దివ్య లోకాలలో; చ= మరియు (ఆధ్యాహార్యం); పృథివ్యామ్= భూలోకంలో; చ= మరియు (అధ్యాహార్యం); యత్= మరెక్కడెక్కడ; విశ్వమ్=పరిపూర్ణంగా; యత్+ఉ= ఏఏ; ద్రవిణమ్= జ్ఞానధనం; అస్తి= ఉన్నదో (అధ్యాహార్యం); త్వమ్= మీరు; అస్య=ఆ సమస్త జ్ఞాన ధనానికి; క్షయసి= నిధానమై; యత్+హ= ఉన్న మీనుండి; నమసా= భక్తితోకూడిన వందన పూర్వకంగా; ఋతమ్= సత్యబుద్ధితో; పృచ్ఛ్యమానః= ప్రార్థనను; వోచే=చేస్తూ; తవ= మీ యొక్క; ఇదమ్ ఆశసా= జ్ఞానోపదేశం వలన పొందుదును.
భావం:- ఓ జాతవేద! దివ్యలోకాలలో, భూమండలంలో, మరెక్కడెక్కడ సంపూర్ణ విజ్ఞాన ధనముందో దానికి నీవు నిధానమవు. సత్యబుద్ధితో నీకు వందనం చేస్తూ ఆ జ్ఞానోపదేశాన్ని మీనుండి పొందుదును.
వివరణ:- జిజ్ఞాసువులు తప్పక వినయశీలురు కావాలని వేదశాస్త్రాదేశముంది. ప్రశ్నోపనిషదారంభాన్ని పరిశీలిస్తే దీనికాధారం కనబడుతుంది. సుకేశుడు, సత్యకాముడు, సౌర్యాయణి (సూర్యుని మనుమడు), కౌసల్యుడు, భార్గవుడు, కబంధి అను ఆరుగురు బ్రహ్మజిజ్ఞాసువులు పరబ్రహ్మననే్వషిస్తూ పిప్పలాద మహర్షివద్దకు ‘సమిత్ పాణయో భగవంతం పిప్పలాదముపసన్నాః’ సమిధలను చేత ధరించి పిప్పలాద మహర్షి సన్నిధికి చేరుకొన్నారు అని అచట చెప్పబడింది.

--ఇంకావుంది...