స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం--67

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
==============================

ఇట్టి ప్రస్తావనయే ఛాందోగ్యోపనిషత్తులోని ఐదవ ప్రపాఠంలో కనబడుతుంది. ప్రాచీన కాలంలో కులపతులు మరియు మహాశ్రోత్రియులు (వేద విద్వాంసులు) అందరు కలిసి ఆత్మ అనగా ఏమి? బ్రహ్మమంటె ఏమి? ఇత్యాది విషయాలను చర్చించుకొని స్వయం నిర్ణయం చేయజాలక ఉద్దాలక మరియు ఆరుణి అను బ్రహ్మవేత్తల నాశ్రయించారు. వారిలో ఉద్దాలక మహర్షిమేమీ ప్రశ్నలకు సమాధానం చెప్పజాలం. కేకయ దేశాధిపతి అగు అశ్వపతి ఈ బ్రహ్మవిద్యలో నిష్ణాతుడు.
కాబట్టి మనమంతా ఆయన నాశ్రయిద్దాం అని పలికి వారిని వెంటబెట్టుకొని రాజువద్దకు గొనిపోయాడు. రాజు ఆ బ్రహ్మవేత్తలకు అర్ఘ్యపాద్యాదులతో సత్కరించబోయాడు. కాని బ్రహ్మవేత్తలా సత్కారాలను మృదువుగా నిరాకరించారు. రాజు కలత చెందాడు. అప్పుడు వారు తమ మనసులో కల్గిన బ్రహ్మజిజ్ఞాసను తెలిపి తమ సందేహాలను నివృత్తిచేయవలెనని కోరారు. రాజు సమ్మతించి మరునాడు రమ్మని పలికాడు. అప్పుడా బ్రహ్మవేత్తలు
తే హ సమిత్పాణయః పూర్వాహ్ణే ప్రతిచక్రమిరే (ప్రశ్నోపనిషత్)
మరునాడుదయమే సమిత్‌పాణులై (సమిధలు చేతబూని)
రాజువద్దకు వెళ్లిరి.
ఇదే విధంగా ముండకోపనిషత్తులో కూడ బ్రహ్మజిజ్ఞాసువులు సమిత్పాణులై గురువునాశ్రయించే విధానం చెప్పబడింది. ఈ క్రింది మంత్రాన్ని చూడండి.
తద్విజ్ఞానార్థం గురుమేవాభి గచ్ఛేత్ సమిత్పాణిః
శ్రోత్రియం బ్రహ్మ నిష్ఠమ్‌॥ ముండక. ఉ.1-2-12॥
పరతత్త్వాన్ని తెలిసికొనేందుకు సమిత్పాణులై వేదవేత్త మరియు బ్రహ్మనిష్ఠుడు అయిన గురుసన్నిధికి వెళ్లాలి. సమిత్పాణిగా ఎందుకు వెళ్లాలి? సమిధ శ్రద్ధకు చిహ్నం. దానిని చేత ధరించడం ద్వారా బ్రహ్మవిద్యయందాతనికి గల శ్రద్ధ తెలియబడుతుంది. బ్రహ్మవిద్యయందు శ్రద్ధాహీనుడుకి దానిని బోధించరాదని శాస్త్ర వచనం. అందుకే మంత్రం ప్రథమార్ధంలో ‘ఋతం వో చే నమసాపృచ్ఛ్యమానః’ జిజ్ఞాసతో మరియు సత్యబుద్ధితో అర్థిస్తూ ఉన్నాను అని స్పష్టంగా నిర్దేశింపబడింది. ఉపేక్షతో- నిరాసక్తతతో ప్రశ్నించేవాడు జిజ్ఞాసువుకాడు. అతడు వితండ తర్కవాదం చేసే వాడవుతాడు. తద్వారా తాను వాదంలో విజయుడు కావాలని తలంచే వాడవుతాడు. ‘నమసేదుప సీదత’(ఋ.9-11-6) నమస్కారం చేత జిజ్ఞాసువుకమ్ము అని ఋగ్వేద వచనానుసారం. నిజంగా నీవు బ్రహ్మజ్ఞాన జిజ్ఞాసువయితే వినీతుడవై అర్థించు. అంతేకాదు. బ్రహ్మజ్ఞానార్థంగా ఎవరిని ఆశ్రయించదలచావో అతడిని పరీక్షించియే ఆశ్రయించు. ఎవరినంటె వారిని ఆశ్రయించవద్దు. ‘తవాశసా జాతవేదో యదీదమ్’ మీ ఉపదేశంతో దీనినంతను పొందుదునా? అని ఈ మంత్రమే జిజ్ఞాసువును హెచ్చరిస్తూంది. మరి వేద మీవిధంగా ఎందుకు హెచ్చరించిందో గ్రహించడం అంత కష్టమేమీకాదు. అజ్ఞాని బ్రహ్మవిద్యనేమి బోధించగలడు? అందుకే ముండకోపనిషత్తు బ్రహ్మజ్ఞాన బోధకుడు ‘శ్రోత్రియః’వేదవేత్త కావాలని నిర్దేశించింది.
ఒక మనిషికి ఏ పనినైనా చేయగల క్రియాత్మక జ్ఞానముండవచ్చు. అతడు ఇతరులకు బోధింపగల నైపుణ్యం కలిగియుండే అవకాశముండకపోవచ్చు. కాబట్టి అతడు ఆచార్యుడు కాలేడు. మరొకడికి ఎంతో పుస్తక జ్ఞానముండవచ్చు. కాని ఆ జ్ఞానాన్ని క్రియాత్మకంగా ప్రయోగించే ప్రయత్నమెన్నడూ ఆతడుచేసి యుండడు. కాబట్టి ఆతడు కూడ ఆచార్యుడు కాగల యోగ్యత కలిగి యుండడు.

--ఇంకావుంది..