స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం--71

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు

పరమాత్మ కంటె ఆత్మ అంటే జీవుడు అత్యల్పుడు. అతడు కేవలం శరీరంతో మాత్రమే ఉండగలడు. పరమేశ్వరుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. జీవుడు ఎనె్నన్నో వస్తువులను తయారుచేయగలడు. కాని సృష్టికర్త సృజించి వహించే ఈ బ్రహ్మాండం ముందు అవన్నీ ఎంత? అట్లే మనిషి అంటే జీవాత్మ బుద్ధి ప్రపంచపు సరిహద్దులు దాటిపోగలదా? అది మహాకష్టం. ఎందుకంటె కనబడే ఈ పరిమిత ప్రపంచమే మనిషి దృష్టిలో అనంతమూ అపారమూ. కాని భగవంతుడు అలా పరిమితుడై జీవాత్మ (మనిషి) వంటివాడా? కాదు కాదు. వవక్ష ఇంద్రో అమితమ్ జగత్పిత అపరిమిత మహిమచే అపరిమితమైన విశ్వాన్ని వహించి యున్నాడు అని వేదం ఉద్ఘాటించింది.
అంతటితో వేదం తృప్తిపడలేదు. సర్వధారియైన విశ్వవిభుడు ‘ఋజీషీ ఉభే ఆ పఫ్రౌ రోదసీ మహిత్వా’ ‘‘సకల జీవులకు సన్నిహితమై యుండేందుకు ప్రీతికల పరమాత్మ ఊర్ధ్వ- అధోలోకాలన్నింటిలో పరిపూర్ణంగా వ్యాపించి యున్నాడు’’అని మరొక దైవమహిమను వివరించింది. అట్టి సర్వవ్యాపకుడైన భగవంతుని ముందు ఏకదేశమాత్రుడు- శరీర బంధితుడయిన జీవుడెంతటివాడు? అథర్వవేదం ‘బాలాదేకమణీయస్కమ్’ (10-8-25) ‘వెంట్రుక కంటె జీవుడు’ అల్పుడు అని ఎప్పుడో జీవుని అల్పత్వాన్ని నిర్ధారించింది. మరి పరమాత్మయో!! ‘ఉభే ఆ పప్రౌ రోదసీ’. ‘రోదసిలోని ఊర్ధ్వ= అధోలోకాలను సృష్టించి అందులో తానే స్వయంగా వ్యాపించియున్నవాడు. ఎలా?? అంటే ‘మహిత్వా’ తన అనంత మహిమచేత. అంటె జీవాత్మ ఏకదేశస్థితుడు- అత్యంత అల్పుడు, మరి పరమాత్మ!! సర్వవ్యాప్తి. మరియు విరాట్స్వరూపుడు.
ఆయన మహిమ కేవలం ఈ ప్రపంచంలో మాత్రమే వ్యాపించియున్నదని భావించరాదు. అనంతమైన ఆయన మహిమ మనం కానరాని విశ్వమంతటా ఎక్కడెక్కడో వ్యాపించి యుందని ఈ మంత్రంలోని ద్వితీయార్థం వివరిస్తూంది. అంటే అపారమైన దైవమహిమ విశ్వాంతరాళాలలో మరియు వాని బయట కూడ వ్యాపించియుందని వేదాభిప్రాయం. యజుర్వేదం విశ్వాత్ముని ఈ తత్త్వాన్ని మరింత విపులీకరిస్తూ-
తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః యజుర్వేదం 40-5.
ఆ విశ్వాత్మ అన్నింటి లోపల మరియు బయట కూడ వ్యాపించియున్నాడు అని చెప్పింది. కాని జీవులు మరియు ప్రకృతి విశ్వానికి అంతర్భాగంలో అందునా ఏక దేశంగా మాత్రమే నిలిచి యున్నాయి. కాబట్టి ప్రకృతి మరియు జీవాత్మల కంటె పరమాత్మ సర్వవిధాలుగా ఉత్కృష్టుడు. అట్లే మహత్వంలో కూడ విశిష్టుడు. అందుకు సందేహంలేదు. లోకంలో ఎక్కడైనా ఎప్పుడేనా ముగ్గురు వ్యక్తులొకేసారి జన్మిస్తే వారి శక్తులు మరియు సంపదలు ఒకే విధంగా ఉండవు కదా. మరి అలాంటప్పుడు ప్రకృతి- జీవాత్మ మరియు పరమాత్మ మూడూ సమానంగా అనాదులే అయినా వాటి శక్తులు, మహత్వాలు ఒకే విధంగా ఎలా ఉంటాయి? కాబట్టి పరమాత్ముడు జీవాత్మ-ప్రకృతుల కంటె సర్వవిశిష్టుడు.
***
క్షియంతం త్వమక్షియంతం కృణోతీయర్తి రేణుం మఘవా సమోహమ్‌
విభంజనురశనిమా ఇవ ద్యౌరుత స్తోతారం మఘువా వసౌ ధాత్‌॥
ఋ.4-17-13.
ప్రతిపదార్థం:- మఘవా= సర్వసమర్థుడవైన మరియు అష్టైశ్వర్య వైభవుడవైన ఓ పరమాత్మ!; త్వమ్= నీవే; క్షియంతమ్= నశించిపోతున్న వానిని; అక్షియంతమ్= అభివృద్ధిచెందువానిగ; కృణోతి= చేయుచున్నావు; లేదా క్షియంతమ్= సర్వసమృద్ధంగా ఉన్నవానిని; అక్షియంతమ్= బికారి వానిగ; కృణోతి= చేయుచున్నావు; లేదా అక్షియంతమ్= బికారిని; క్షియంతమ్= సర్వసమృద్ధవంతునిగా; కృణోతి= చేయుచున్నావు; తథా= అదే విధంగా(అధ్యాహారం); రేణుమ్=్ధళికణం వంటి అల్పుణ్ణి; సమోహమ్= ధూళి దుమారంవలె బలవంతునిగ; ఇయర్తి= నడిపించుచున్నావు; తథా= అదే విధంగా (అధ్యాహార్యం); సమోహమ్= ధూళి దుమారం వంటి బలవంతుని;

--ఇంకావుంది...