స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
హింసాపరులకు మోక్షధనం లభించదు
న దుష్టుతి ర్ద్రవిణోదేషు శస్యతే న స్త్ధ్రేన్తం రయిర్నశత్
సుశక్తిరిన్మఘవం తుభ్యం మావతే దేష్ణం యత్పార్యే దివి
భావం: ఓ మోక్షప్రదాతా! పరమాత్మా! దుర్మార్గంగా ప్రవరించేవాడు, దుష్కర్తిగలవాడు ధనదాతలలో శ్రేష్ఠునిగా గౌరవింపబడడు. అట్లే పరులను హింసించేవానికి మోక్షధనం లభింపదు. పరలోక సౌఖ్యాన్ని పొందాలనే ఇచ్ఛగల నా వంటివానికి వెలుగుదారి అయిన మోక్షమార్గాన్ని చూపగలవాడు సర్వజన శ్రేయస్కారి అయిన మహాపురుషుడు నీకు మాత్రమే ఆనందాన్ని అనుగ్రహించగలడు.
వివరణ: ఈ మంత్రంలో ప్రస్తావించబడిన ధనం సాధారణంగా జనులందరు భావించే డబ్బు, ధాన్యం, ఇండ్లు, వాకిండ్లు, పశుసమృద్ధి మొదలయినవానికి సంబంధించినది కాదు. కేవలం శాంతి ధనమే లక్ష్యంగా వ్యాఖ్యానింపబడింది. కారణం శాంతిధనమే పరమోత్కృష్టమైనది కాబట్టి. సామవేద మీ శాంతి ధన ప్రాముఖ్యాన్ని..
శం పదం మఘం రరుూషిణే- ధనం కోరుకొనేవాడు సాధారణ ధనం కాక శాంతి ధనానే్న కోరుకోవాలి అని హితవు చెప్పింది. లౌకికమైన ధనధాన్యాలు దొంగలు, బందిపోట్ల వద్ద కూడా ఉంటాయి. అవి సాధారణంగా అన్యాయం, అత్యాచారం, అనాచారం మొదలయిన పద్ధతులతో ఆర్జింపబడినవి. కాని అట్టి ధనం బుద్ధిమంతులకు తృప్తినీయదు. దీనిని నిరూపించే బృహదారణ్యకంలోని యాజ్ఞవల్క్య మైత్రేరుూ సంవాదాన్ని పరిశీలించండి.
యాజ్ఞవల్క్యుడు గృహాన్ని విడిచి తపస్సునకై వనాలకు పోదలచి భార్య మైత్రేయితో నీకు సంరక్షణకై ఏర్పాటు చేయదలచానని అన్నాడు. దానికి మైత్రేరుూ ఇలా ప్రశ్నించింది.
పూజ్యుడా! ధన ధాన్యాలతో పరిపూర్ణమైన ఈ భూమండలమంతా నాదే అయినా నేను అమృతత్త్వాన్ని (మోక్షాన్ని) పొందగలనా?
సత్య జ్ఞాన దర్శకుడైన యాజ్ఞవల్క్యుడు ఇలా సమాధానమిచ్చాడు.
నేతి నేతి.. యథైవోపకరణవతాం జీవితంతథైవ
తే జీవితం స్యాద్, అమృతత్వస్య నాశాస్తి విత్తేన
లేదు లేదు. ధనధాన్యాది సంపత్తిగలవారికే జీవనం గడుస్తుంది. అట్టి జీవనం నీకు కూడా సుఖవంతమవుతుంది. కాని అమృతత్త్వం = ముక్తి కావాలనేకోరిక ఆ సామాన్య ధనం చేత మాత్రం సిద్ధించదు.
ఆ సమాధానాన్ని విని మైత్రేయి మరలా యిలా అంది.
యేనాహం నామృతా స్యాం కిమహం తేన కుర్యాం యదేవ భగవాన్
వేద తదేవ మే బ్రూహి
ముక్త్ధినం లభించని ఆ ధనంతో నాకేమి ప్రయోజనం? ప్రభూ! మోక్షసాధనమేదో తెలిసినచో దానిని నాకూ తెలపండి.
ధనంవలన ఎన్నో కష్టాలు సంభవిస్తాయి. ఎంతో దుఃఖం కలుగుతుంది. నిజమైన ముముక్షువు- శాంతి కాముకుడు చంచలమైన ఆ ధనాన్ని ఎందుకు కోరుకొంటాడు? ఈ సందర్భంలో ఋగ్వేదమిలా ప్రశ్నించింది.
అరే! ధనం స్థిరంగా ఒకని వద్ద ఉండదు. ఒకరి వద్ద నుండి మరొకరి వద్దకు వెళ్లిపోతూ ఉంటుంది. రథ చక్రాలు క్రిందికి పైకి పోయే రీతిగా ధనం ఒకడిని ఉన్నతుడిని, మరొకడిని అధముడిగా తారుమారుచేస్తుంది. అట్టి నశ్వరమైన ధనంపై శాశ్వతమైన మోక్ష సుఖాన్ని కోరుకొనేవాడికి ఆశ ఎందుకుంటుంది? ఈ దృష్టితోనే ప్రస్తుత మంత్రం-