స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం- 78

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతేకాదు ఆ భగవానుడు మనకు జీవించేందుకు ముల్లోకాలలో శ్రేష్ఠమైన సర్వ శుభాశ్రయాన్ని అనుగ్రహించుగాక!
వివరణ:- భగవంతుడు తనకు శుభప్రదుడు కావాలని భక్తుని కోరిక ఈ మంత్రంలో వర్ణింపబడింది. తనవద్ద ఏదేని ఉన్నవాడే దానం చేయగలడు గాని ఏమీ లేనివాడు దానమేమి చేయగలడు? మరి భగవంతుడో!! సర్వ ప్రదాత, ఆయన వద్ద లేనిదేముంది? ఈయలేని దేముంది? ఈ విషయానే్న ముందుగా ప్రతిపాదిస్తూ బృహత్సుమ్నః= మహాకల్యాణ నిలయుడు అని వేదం మంత్రారంభం చేసింది. కల్యాణ నిలయుడుగా తాను సృష్టించన చరస్వభావం (కదిలే) కల జీవులకే కాదు అచర(కదలని) జీవులకు సహితం భగవానుడు శుభప్రదాతగా ఎవరి యెడల రాగద్వేషాదులను వహించడు. వాటి వాటి కర్మానుగుణంగా వాటి వాటిని ఉచిత స్థానాలలో నిలిపి యుంచుతాడు. ‘నివేశనః’ అన్న పదం ద్వారా మంత్రం దీనినే సూచించింది. ఆ చరాచరాలు స్వేచ్ఛాప్రవృత్తి వహించి యథేచ్ఛగా ప్రవర్తించక సామరస్యంతో జీవించేందుకు వాటిని భగవానుడు తన అధీనంలోనే నిలుపుకొంటున్నాడని ‘జగతఃస్థాతురుభయస్య యో వశ’ అన్న పదం ద్వారా దైవనియామక శక్తిని కూడ మంత్రం కీర్తించింది. ఈ మంత్రమే కాదు ఋగ్వేదంలోని అఘమర్షణ సూక్తంలోని ‘విశ్వస్య మిషతో వశీ’ (ఋ.10-190-2) ‘‘సమస్త చరాచర జీవుల సర్వకార్యకలాపాలను వశపరచుకొనేవాడు’’ అన్న మంత్రం కూడ ఈ మంత్రార్థానే్న సమర్థిస్తూంది.
ఈ వశిత్వం కేవల మచరాలపైనే అయితే అదేమంత గొప్ప విషయం కాదు. చరాలపైన వశిత్వం కల్గియుండటమే ఘనత. వాటిని సృష్టించడం- సంరక్షించడం- అదేమంత సులభమైనదా? కాదని మరో వేదమంత్రం.
‘అదాభ్యో భువనాని ప్రచారకశద్ వ్రతాని దేవః సవితాభిరక్షతే’ (ఋ. 4-53-4)
ఎవరి చేతను నియంత్రితుడు కాని సవిత (పరమేశ్వరుడు) లోకాలను ప్రకాశింపచేస్తూ సృష్టి నియమాలను సంరక్షిస్తాడు అని ‘అదాభ్యః’ అన్న పదాన్ని ‘వశీ’ పదానికి పర్యాయంగా ప్రయోగించి ఈ మంత్రార్థానే్న విపులీకరించింది.
ఈ విధంగా భగవానుని వశిత్వ కల్యాణ గుణమేకాక ఈ మంత్రంలో చెప్పబడిన ‘నివేశనః’ చరాచరాలను సృష్టించి వాటిని యోగ్యస్థానాలలో నిలపడం అన్న మరో భగవత్కల్యాణ గుణాన్ని ఋగ్వేదం-
నివేశయన్ ప్రసువన్నక్త్భుర్జగత్‌॥ ఋ.4-5-3.
‘్భగవానుడు జగత్తును సుస్థిరపరచి నిరంతరం జాగృతపరచుచున్నాడు’ అన్న మరో మంత్రం ద్వారా సమర్థించింది. ఈ జాగృతి పగలే కాదు అక్తు= రాత్రి కూడ. మరి రాత్రి ఎట్లా? జీవులు రాత్రి నిద్రిస్తారు. అది వారికి తాత్కాలిక ప్రళయం. దాని ద్వారా వాటిలో శక్తి ఉద్దీపింపబడుతుంది. ఆ విధంగా జీవులలో భగవానుడు జీవనానికి అవసరమైన శక్తిని ఉద్దీపింపచేస్తూ వానిని కర్మానుగుణంగా నిలుపుతున్నాడు. ఈ విధంగా జీవులు జగత్కర్త, ధారణకర్త, హర్త అయిన పరమాత్మకు వశం కావడానికి సందేహమెందుకు? జీవుల కా పరంధాముడు నిజమైన శుభప్రదాయకుడు. ఆయన కల్యాణ కారకత్వ ఘనత ఇదే సూక్తంలో ఋగ్వేదం-
విచక్షణః ప్రథయన్నాపృణన్నుర్వజీజనత్ సవితాసుమ్నముక్థ్యమ్‌॥ ఋ.4-53-2॥
ఆ త్రిలోకేశ్వరుడు సృష్టికర్తగా సర్వద్రష్టయై జగత్తును విస్తరింపచేస్తూ సర్వజీవులకు ప్రీతిని చేకూర్చుతూ అందరకు ప్రశంసనీయమైన శుభాలను ప్రసాదిస్తూ ఉన్నాడు. విశ్వ విస్తరణ నిత్యమూ జరిపే ఆయన నిత్యకృత్య ప్రధాన ప్రయోజనం జీవులకు శుభాలను- సుఖాలను అనుగ్రహించడమే.
కాబట్టి ఓ సమస్త మానవులారా! ఆ భగవానుని కల్యాణ గుణాన్ని గ్రహించి ఆయనకు ప్రియతముల ఎడల గల సంప్రీతిని గ్రహించి పాదాశ్రీతులు కండి. ఇంకావుంది...
***

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు