స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-80

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అథ యదిద మస్మిన్ బ్రహ్మపురే దహనం పుండరీకం వేశ్మ
దహరో- స్మిన్నంతరాకాశ స్తస్మిన్
యదంత స్తదనే్వష్టవ్యం, తద్వావ విజిజ్ఞాసితవ్య మితి ॥

తం చేద్ బ్రూయుర్యదిదమస్మిన్ బ్రహ్మపురే దహరం
పుండరీకం వేశ్మ దహరో- స్మిన్నంతరాకాశః
కిం త దత్ర విద్యతే యదనే్వష్టవ్యం యద్వావ విజిజ్ఞాసితన్యమితి॥

స బ్రూయాత్ యావాన్ వా అయమాకాశస్తావానే షోం త
హృదయే ఆకాశ ఉభే అస్మిన్ ద్యావాపృథివీ అంతరేవ సమాహితే
ఉభావగ్నిశ్చ వాయుశ్చ సూర్యా చంద్రమసావుభౌ విద్యున్నక్షాణి
యచ్చాస్యేహాస్తి యచ్చ నాస్తి సర్వం తదస్మిన్ సమాహిత మితి ॥
॥ 8 ప్రపా.1 ఖండం॥
భావం:- ఈ బ్రహ్మపురం అంటె శరీరం (శరీరాన్ని బ్రహ్మపురం అని ఎందుకంటారో బ్రహ్మోపనిషత్తులో వివరణ కనబడుతుంది) ఒక ప్రకాశమానమైన కమలంతో సమానమైన గృహం. అందులో కాంతివంతమైన ఆకాశముంది. దానిని శ్రద్ధతో అనే్వషించాలి. అలా అనే్వషించి దర్శించిన దార్శనికులు ఆ గృహంలో వికసించిన కమలాకారమైన గృహముందని, అందులో ఒక ఆకాశముందని, దాని పేరు దహరమని చెబుతున్నారు. దానిని సాధకులు తెలిసికొని పరిశీలించాలని కూడ వారు చెబుతున్నారు. ఆ విధంగా పరిశీలించిన దార్శనికులు చెప్పేదేమంటే బయట ఆకాశమెంత విశాలమైనదుందో లోపల ఉన్న ఆకాశం దహరం కూడ అంత విశాలంగా ఉంది. బయటనున్న ద్యావాపృథువులు, అగ్నివాయువులు, సూర్యచంద్రులు, విద్యుత్, నక్షత్రాలు అన్నీ ఆ దహరాకాశంలో ఉన్నాయి. విశేషమేమంటె దహరాకాశంలో లేనివి కూడా ఎన్నో ఈ బహిరాకాశంలో ఉన్నాయి.
భగవానుడు ఈ సమస్త విశ్వాన్ని గ్రహించి ఈ బ్రహ్మపురమైన శరీరగత దహరాకాశంలో నెరవై యున్నాడు. అంటె అది ఎంత విశాలమైనది! దార్శనికులు సృష్టిలో రిషడ్రసాలున్నాయని చెబుతారు. వానిలో మధుర రసం సహజసిద్ధంగా జలంలో ఉంది. దానిని భగవానుడే జలంలో నింపి యున్నాడని ఆ మధుర రసలహరిని మమ్ము త్రాగనిమ్మని భక్తులు చేసే ప్రార్థనా రూపంగా-
‘అపామనీకే... ఊర్మిమ్’ అన్న మంత్ర ద్వితీయార్థం భగవద్వైభవాన్ని వివరించింది. మరియా జలంలోని మధురస పానంవల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ముక్తియే అని
సముద్రా దూర్మిర్మధుమా ఉదారదు పాంశునా సమమృతత్వమానట్‌॥
ఋ.4-58-1॥
‘‘హృదయ సముద్రం నుండి తీయని మధువు నిండిని కెరటం పైకి లేచింది. లేచి నిశ్శబ్దంగా అమృతత్వ= మోక్ష జీవనాన్ని పరిపూర్ణంగా జీవులకు ప్రాప్తింప చేసింది’’ అని స్పష్టపరచింది. అందుచేత ఓ జీవులారా! నిశ్శబ్దంగా మోక్ష రస పానం చేయించే మధుర రస లహరిలో స్నానమాడండి. సంసార బంధనాలలో చిక్కుకున్న మానవుడు గిలగిల కొట్టుకొంటున్నాడు. జన్మ సంసార బంధనాలు అనేక రూపాలుగా వచ్చి జీవులను చుట్టుకొని బంధిస్తున్నాయి. లేచిన మోక్షరసలహరి నీ జన్మ సంసార బంధనాలను త్రెంపి వేయగలదు. భగవంతుడే స్వయంగా-
‘కాష్ఠ్భాందన్నూర్మిభిః పిన్వమానః’ (ఋ.4-58-7) ఊర్ములు= కెరటాలతో పరిపుష్టమైన నది లేదా సముద్రం ఇరుప్రక్కల ఉన్న తీరాలను కోసివేస్తుంది అని పేర్కొన్నాడు. ఉవ్వెత్తున లేచిన కెరటాలు హృదయాన్ని నిజంగా సముద్రంగా మార్చివేస్తాయి. పూర్ణచంద్రోదయ వేళ లేచిన కెరటాలు సముద్ర తీరాలను కోసివేస్తాయి. అదే విధంగా దహరాకాశమనే హృదయ సముద్రానికి సమక్షంగా ప్రియతమ పూర్ణచంద్రుడు భగవంతుని దర్శనమయినంతనే సర్వతీరాలు బంధాలు తెగిపోతాయి. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు