స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం- 82

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్యం మృజంతి వాజినం ఘృతేన
భావం:- వారు నిత్యమూ ఘృతం ద్వారా జ్ఞాన ప్రకాశం ద్వారా ఆత్మను పరిశుద్ధం చేసుకుంటున్నారు.
జ్ఞానమొక్కదాని చేత గాక మరేయితర భౌతిక పదార్థాలచేత ఆత్మపరిశుద్ధంకాదు. ఈ విషయంలో మనువు కూడ ‘విద్యాతపోభ్యాం భూతాత్మా’ (మను.్ధర్మ 5-109) విద్య మరియు తపస్సుల ద్వారా ఆత్మశుద్ధవౌతుంది అని వచించాడు. విద్య అన్నా జ్ఞానమన్నా రెండూ ఒకటే. పరమేశ్వరోపాసన వలన సిద్ధించే ఈ ఫలం చాల సహజమైనది. పరమేశ్వరోపాసనా సిద్ధులైన దయానంద సరస్వతి తమ ఉపాసనా స్వానుభవాన్ని గూర్చి వర్ణిస్తూ ఇలా చెప్పారు.
చలి చేత పీడింపబడే మనిషి అతురుడై అగ్నివద్దకు చేరుకోగానే చలి తొలగి సుఖాన్ని ఎలా పొందుతాడో అదే విధంగా పరమేశ్వర సన్నిధానానికి చేరుకొన్న ఉపాసకుడి సమస్త దుఃఖాలూ- దోషాలు తత్‌క్షణమే నివారింపబడతాయి. అట్లే జీవిత్మా గుణ- కర్మ- స్వభావాలు పరమాత్మ గుణ-కర్మ- స్వభావాలవలె పవిత్రమైపోతాయి.
అయితే జీవులకు ఆత్మశుద్ధి చతుర్విధ పురుషార్థ సిద్ధి సిద్ధింపక సిద్ధింపదు అని ముందుగా అందరూ తెలుసుకోవాలి. ఈ విషయానే్న ఋగ్వేదం మరొకచోట.
మార్జాల్వో మృత్యతే స్వే దమూనాః...॥ (ఋ.5-1-8)
పరిశుద్ధ యోగ్యతగల ఆత్మ ఆత్మసంయమనం కలిగి స్వే= స్వీయ పురుషార్థాన్ని సిద్ఫింపచేసుకొన్న పిమ్మటనే పరిశుద్ధవౌతుంది అని దృఢ పరచింది. కాబట్టి ఆత్మశుద్ధికి నిత్యమూ మానవుడు దేవయజ్ఞాన్ని ఆచరించాలి.
***
ప్రకృతిమాత కొడుకును తండ్రి పంచకు చేర్చదు
కుమారం మాతా యువతిః సముబ్ధం గుహా బిభర్తి న దదాతి పిత్రే
అనీకమస్య న మినజ్జనాసః పురః పశ్యంతి నిహిత మరతౌ
॥ ఋ.5-2-1॥
ప్రతిపదార్థం:- యువతిః= నిత్యవనం వరియూ జీవులకు సంయోగ వియోగాలను కల్పించే స్వభావం కల; మాతా= ప్రకృతి మాత; సముబ్ధమ్= బుద్ధిహీనుడయిన మూర్ఖుని; కుమారన్= బాలుణ్ణి లేదా క్షుద్రమైన కామ ప్రవృత్తిగల జీవుణ్ణి; గుహా= తన ఒడిలో; బిభర్తి= తీసుకొని పోషిస్తుంది; పిత్రే= జ్ఞానమనే తండ్రికి; న దదాతి= అప్పగించదు; అస్య= ఈ ప్రకృతిమాత; అనీకమ్= శక్తి; న మనత్= నష్టపడదు; జనాసః= జనులు; అరతౌ= భౌతిక విషయాలపై ఆసక్తి లేక జ్ఞానమార్గాన; నిహితమ్= యున్నవారిని;పురః= ఎదురుగా; పశ్యంతి= చూస్తున్నారు.
భావం:- నిత్యవనం గల ప్రకృతి వాత క్షుద్రమైన కామ ప్రవృత్తి కలిగియున్న బాలుణ్ణి, బుద్ధిహీనుడైన మూర్ఖుని తన ఒడిలోనికి తీసుకొని పోషిస్తుంది. కాని జ్ఞానియైన తండ్రికి అప్పగించదు. ఈ ప్రకృతిమాత తన శక్తినెన్నడు కోల్పోదు. కాని లోకంలో భౌతిక విషయాలపై ఆసక్తి లేక జ్ఞానవర్తనులైయున్నవారి నెందరినో జనులు ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు.
వివరణ:- లోకంలో ప్రత్యక్షంగా కనబడుతున్నా దానిని ప్రజలు గుర్తించని ఒక మార్మిక విషయాన్ని ఈ మంత్రమిక్కడ వివరిస్తూంది. లోకంలోని ఈ పరిస్థితిని చూచే కాబోలు ఒక జ్ఞాని ‘పశ్యన్నపి న పశ్యతి, శృణ్వన్నపి న శృణోతి, జానన్నపి న జానాతి’ మూర్ఖుడు కంటికి కనిపిస్తున్నా చూడడు, చెవులతో వింటున్నా వినడు, బుద్ధికి తెలిసినా తెలిసికోడు అని అన్నాడు. ప్రతిదినం అందరూ మరణిస్తున్నవారిని చూస్తూనే ఉన్నారు. వారు శ్మశానానికి గొనిపోబడటం అక్కడ వారు దహింపబడటం అందరూ చూస్తున్నారు. ఒక్కొక్కసారి మృతులైన తమ వారినే స్వయంగా స్వహస్తాలతో దహనం చేయడం ఎవరికి అనుభవంలో లేదు? కాని ఏదో ఒకనాడు తమకూ ఇదే పరిస్థితి ఎదురవుతుంది. అప్పుడు మనమూ లోకం నుండి నిష్క్రమించవలసి ఉంటుంది. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు