స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం--83

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుత్ర- మిత్ర- కళత్ర బంధుజనులెవరూ మనవెంట రారు అన్న ఆలోచన నిజంగా ఎందరికి వస్తుంది? అందరు అన్నీ చూస్తూ కూడ మనం మాత్రం శాశ్వతంగా ఉండిపోతామన్నట్లు గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు. లోకంలోని ఈ జీవులందరి దురవస్థ మంత్రం ప్రథమార్ధంలో వర్ణింపబడింది.
ప్రకృతి జీవులందరిని తల్లిలా ఆదరిస్తుంది. చేరి అందరిని తన ఒడిలోనికి ప్రియంగా తీసుకొంటుంది. కాని సకల జీవసంరక్షకుడైన తండ్రి వద్దకు మాత్రం వెళ్ళనీయదు. ఆ విధంగా జీవుడు ప్రాకృతిక విషయాలలో చిక్కుకొనిపోయి చివరకు జగత్పితయైన పరమాత్మనే మరచిపోతాడు. ఈ సత్యాన్ని దృష్టిలో పెట్టుకొనియే ఒక మహాత్ముడు ‘అనృతేన ప్రత్యూధాః’ లోకమంతా అసత్యం చేతనే ప్రభావితమవుతూంది అని వచించాడు. మరి అసత్యమంటె ఏమిటి? పరమాత్మకు దూరంకావడం లేదా పూర్తిగా మరచిపోవడం. విచారణ చేస్తే ప్రకృతి మాయ చాలా పెద్ద మోసగత్తె. ఈ మాయలకు మోసపోయిన ఒక సాధుపుంగవుడు సత్యాన్ని గ్రహించి విచారిస్తూ ‘ప్రకృతి మాయా స్వరూపాలను ఎందరు తెలుసుకోగలరు?’ అని బాధపడ్డాడు. అయితే దీని నుండి విముక్తి పొందే ఉపాయమే లేదా? లేకేమి? ప్రకృతి మాయా పరిష్వంగం (కౌగిలి)లో చిక్కుకొన్నా ‘అనీకమస్య న మినత్’ ప్రకృతి మాయాశక్తికి నాశనంలేదు అన్న జ్ఞానం హృదయంలో నిలుపుకొంటె చాలునని ఈ ఋగ్వేద మంత్రం తరుణోపాయాన్ని చెబుతూంది. ఇది ఎలా? అంటె మునుముందుగ జీవుడికి ప్రకృతి శక్తి బలవత్తరమైనదన్న జ్ఞానం కలిగితే చాలు. మూఢుడైనా వానిలో జ్ఞానం క్రమంగా అంకురించేందుకు ప్రప్రథమ బీజం పడినట్టే. అది ఎప్పుడో ఒకప్పుడు దైవవశాత్తు సాధు- సంతు జనులతో సంభవించే సత్సంగంతో జ్ఞానాన్ని తప్పక మూఢుని హృదయంలో కూడ అంకురింపచేస్తుంది.
ఈ విధంగా లౌకిక విషయాలపై అరతి= అనాసక్తిలో పడిన జీవులు జ్ఞానుల దృష్టిలో పడతారు. అజ్ఞానం కారణంగా ప్రకృతి మాయకు వశులై సుఖలాలసతో లౌకిక విషయలంపటులైన వారి యెడల జ్ఞానుల కరుణ ప్రసరిస్తూంది. పాపం వీరు అమాయకులైన బాలలే కాదు. బేలలు కూడ. అధమమైన కామవాసనలలో చిక్కుకొన్న కుమారులు అని వారు జాలిపడతారు. కుమారులు వృద్ధులైనా- యువకులైనా ఆ ప్రకృతి మాయ ఎవరినైనా పట్టుకొంటుంది. కుమారుడన్న మాట లోకంలో బాలుడని ప్రసిద్ధార్థకం. వేదాంత పరిభాషలో బాలుడన్నమాట అజ్ఞానికి పర్యాయ వాచకంగా ఉపయోగిస్తారు. బ్రహ్మజ్ఞాని కాని అజ్ఞానిని బాలుడని కాక మరేమంటారు? కుమారుడు లేదా బాలుని చిత్తం ఆటపాటల మీదే ఆసక్తమై ఉంటుంది. అలా ఏమీ తెలియని జ్ఞానంలో ఉండే బాల్యావస్థలో కుమారుడు లేదా బాలుడు ఎక్కువగా తల్లి ఒడికే చేరుకోవడానికి ఇష్టపడతారు. కాని పెద్దవాడయి క్రమంగా విద్యార్జన చేసిన పిమ్మట వారే తల్లి ఒడికి దూరంగా ఉంటాడు. తల్లి కొంగు పట్టుకొని తిరగరు. జీవుడి స్థితి కూడ ఇదే. అజ్ఞానిగా జీవుడు ఎంత కాలముంటాడో అంతకాలమూ ప్రకృతిని తల్లిగానే భావిస్తాడు. జ్ఞానోదయమయినంతనే తల్లి ఒడి వీడి జగత్పిత సన్నిధికి చేరుకొంటాడు.
***
60. ప్రాణాలు ఆత్మను ప్రకాశింపచేస్తాయి
తవ శ్రీయే మరుతో మర్జయంత రుద్ర యత్తే
జనిమ చారు చిత్రమ్‌ పదం యద్విష్ణోరుపమం నిధాయి
తేన పాసి గృహ్యం నామ గోనామ్‌॥ ఋ.5-3-3॥
ప్రతిపదార్థం:- రుద్ర! = ఓ ఆత్మా; మరుతః= ప్రాణాలు; తవ= నీ; శ్రీయే= వైభవం కొఱకు; త్వాం= నిన్ను (అధ్యాసార్యం); మర్జయంత= ప్రకాశింపచేస్తున్నాయి; తే= నీ; చారు= సుందరమైన; చిత్రమ్= అద్భుతమైన; జనిమ= జన్మ; తదేవ= అదే (అధ్యాహార్యం); యత్= ఏ; విష్ణోః= విష్ణువుతో; ఉపమమ్= సమానమైన; పదమ్= స్థానాన్ని; నిధాయి= వహించియున్నావో; తేన= దాని ద్వారా; గోనామ్= ఇంద్రియ సంబంధమైన; గుహ్యమ్= కానరాక రహస్యంగా ఉన్న; నామ= సామర్థ్యాన్ని; పాసి= రక్షిస్తున్నావు. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512