స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-85

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
ఏ విధంగా రాణి ఈగ (తేనెటీగ) బయటకు వెళ్ళినంతనే తక్కిన కూలి ఈగలు చెదరిపోతూ మరల అది ఒకచోట నిలిచినంతనే కూలి ఈగలు ఎలా నిలిచి ఉంటాయో అదే విధంగా కళ్ళు-ముక్కు- చెవి- నాలుక- చర్మం మొదలైన జ్ఞాన మరియు కర్మేంద్రియాలకు ఉచ్ఛస్థితి లేదా దీనస్థితి ఏర్పడింది.
ఇంతటి శక్తిశాలి, భగవంతునితో తుల్యమై నిష్కామప్రవృత్తిలేని కారణంగా ఆత్మ మలినమైపోతున్నది. సహజంగా అమలమైన ప్రకాశవంతమైన ఆత్మపై మాయపు తెర కప్పబడిపోయి శోభాహీనమై శక్తిహీనమవుతున్నది. అట్టి శక్తిహీనతనుండి ఆత్మను పునరుజ్జీవింప చేసేందుకు ప్రాణాయామం ద్వారా ప్రాణ సంశోధనచేసి ఆత్మను ప్రకాశింపచేస్తున్నాయి. ‘తవ శ్రీయే మరుతో మర్జయంత’ ఆత్మ తన దోషాలను-లోపాలను గ్రహించినంతనే శాస్ర్తియమైన సమస్త సాధనలను అనుష్ఠించగలుగుతుంది. వానిలో ప్రాణాయామమొక సరళమైన సాధన. ఈ వేదమంత్రార్థాన్ని దృష్టిలో పెట్టుకొనియే మనువు మొదలగు ఋషులు ఆత్మశుద్ధికై ‘ప్రాణాయామై ర్దహేద్ దోషాన్’(మనుధర్మ. 6-7-3) ప్రాణాయామం ద్వారా ఆత్మకంటిన దోషాలను దహించండి అని ప్రాణాయామ సాధనను విధించారు. ఆధునిక కాలంలో ఋషియైన దయానందులుకూడ ‘‘మానవుడు ప్రాణాయామాన్ని చేసిన ప్రతిక్షణమూ క్రమంగా ఉత్తరోత్తర కాలంలో ఆత్మకు సంక్రమించిన దోషాలు నశించి అతడిలో జ్ఞానప్రకాశం ప్రకాశిస్తుంది’’(సత్యార్థ ప్రకాశం- 3వ సముల్లాసం) అని సత్యార్థ ప్రకాశంలో సమర్థించారు.
ప్రాణాయామం ద్వారా కేవలం శరీర సంబంధమేకాక ఆత్మమాలిన్యం కూడా శుద్ధమై ప్రకాశిస్తుంది. కాబట్టి మానవులారా! ప్రాణాయామాన్ని సాధన చేయండి.
**
తత్త్వవేత్తకు అమృతత్వసినీ కృపామృతమే
తవ శ్రీయా సుదృశో దేవ దేవాః పురూ దధానా అమృతం సపంత
హోతార మగ్నిం మనుషో ని షేదుర్దశస్యంత ఉశిజశ్శంసమాయోః॥
ఋ.5-3-4॥
ప్రతి పదార్థం:- దేవా+ ఓ దేవ! దివ్యగుణ సహితుడవైన ఓ ఆత్మా!; సుదృశః= శుభదృష్టితో చూచేవారు, శ్రేయస్సునే కాంక్షించేవారు, తత్త్వదర్శులు అయిన; దేవాః=విద్వాంసులు; తవ= నీ; శ్రీయా= దివ్యవైభవాన్ని; పురూ= ఎక్కువగా; దధానాః= అనుసరించి; అమృతమ్= మోక్షాన్ని; సపంత= పొందుతున్నారు; మనుషః= దైవాన్ని చింతన చేసేవారు; ఉశిజః= ముముక్షువులు అయిన; ఆయోః= సత్పురుషుల; శంసమ్= సద్గుణాలను; దశస్యంతః= ఉపదేశిస్తూ; హోతారమ్= గొప్ప దానశీలుడైన; అగ్నిమ్= జగన్నాయకుడైన భగవానుని వద్ద; నిషేదుః= సదా ఆసీనులై ఉంటారు.
భావం:- ఓ దేవ! ఓ తత్త్వదర్శీ! విద్వాంసులు నీ దివ్య వైభవాన్ని బాగా అనుసరించి మోక్షాన్ని పొందుతున్నారు. దైవచింతనాపరులు- ముముక్షువులు అయిన మహాత్ముల సద్గుణాలను జనులకు ఉపదేశిస్తూ గొప్ప దానశీలుడైన భగవానుని వద్ద నిరంతరం ఆసీనులై యుంటారు.
వివరణ:- ఈ మంత్రంలో ముక్తిప్రాప్తికి మరియు తత్సాధనకు అవసరమైన సాధనలను గురించి వివరణ ఉంది. ముక్తి కోరుకొనేవాడు ముందుగా ముఖ్యమైన అంశాలను కొన్నింటిని తప్పక అభ్యాసం చేయవలసి యుందని ‘పురూ దధానా అమృతం సపంత’అని నిర్దేశించింది.
ముముక్షువులైనవారు ముందుగా వివేకం- వైరాగ్యం మరియు షట్క సంపత్తి సాధనచేయవలసి యుందని శాస్త్రం శాసించింది.
వివేకం:- సత్యం మరియు అసత్యాల భేదం, ఆత్మ మరియు అనాత్మల భేదం, కారణ- సూక్ష్మ- స్థూల శరీలాల కంటె, అన్నమయ, ప్రాణమయ మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల కంటె ఆత్మభిన్నమైన దను జ్ఞానం కలిగియుండటమే ‘వైరాగ్యం’.

ఇంకావుంది...