స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-87

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దయాళువులైన ఆ ముక్త పురుషులకు సిద్ధించిన దివ్యశక్తి అంతా వారి బాహిర శరీరగతమైనది కాదు. వారిపై విశ్వాత్మకుడైన పరమాత్ముని దివ్యగుణ ప్రసార మహిమ చేతనే సిద్ధించింది. అయితే ఆ దివ్యమహిమ వారిపై నిష్కారణంగా వర్షించినది కాదు. నిత్యోపాసనా తత్పరులైనవారి యెడల ప్రసన్నుడైన పురుషోత్తముని కృపాకటాక్షంచేత వారి ఇంద్రియాలు సన్మార్గంలో దర్శన-శ్రవణాది కర్మలను సక్రమంగా నాచరించిన ఫలితంగా సిద్ధించినట్టిదే ‘తవ శ్రీయా దేవ సుదృశోదేవాః’అని ముక్తజనుల మోక్ష మార్మికతను వేదం విశదపరచింది.
రండి మనమూ ముక్తపురుషుల జీవన మార్గాన్ని అనుసరిద్దాం.
**
భగవానుడే అపూర్వదాత- మహాయాజ్ఞికుడు
న త్వద్ధోతా పూర్వో అగ్నే యజీయాన్న కావ్వైః పరో అస్తి స్వధావః
విశశ్చ యస్యా అతిథిర్భవాసి స యజ్ఞేన వనవద్దేవ మర్తాన్‌॥ ఋ.5-3-5॥
ప్రతిపదార్థం:- అగ్నే= ఓ జ్ఞాన స్వరూపా! యజ్ఞ సాధక! ఓ ప్రభూ!; త్వత్= నీ కంటె; పూర్వః= పూర్వుడైన; హోతా= దాత; న= లేడు; యజీయాన్= బహుయజ్ఞాలను చేసినవాడు; న= ఎవడూ లేడు; స్వధావః= స్వయంశక్తి సంపన్నుడవైన పరమాత్మా!; కావ్వైః=కావ్యాల ద్వారా లేదా జ్ఞానుల ద్వారా; పరః= తెలియదగు ముఖ్యుడు; న= లేడు; చ= మరియు; యస్యాః= ఏ; విశః= ప్రజలకు; అతిథిః= ఆత్మ; భవాసి= అయితివో; దేవ= ఓ దేవ దేవ; స= అట్టివాడవగు నీవు; యజ్ఞేన= యజ్ఞాల ద్వారా; మర్తాన్= మనుష్యులను; వనవత్= నిరంతర భక్తియుక్తులుగా చేయుదువు.
భావం:- ఓ అగ్నీ! నీకంటె ఘనుడైన దాత పూర్వమెన్నడు లేడు. బహుయజ్ఞాలను చేసినవాడు కూడ పూర్వమెన్నడూ లేడు. కావ్యశాస్త్రాది గ్రంథాల ద్వారా గాని- జ్ఞానుల పరంపరనుండి గాని తెలియదగు ప్రధానుడు నీకంటె మరొక్కడు లేడు. సమస్తజీవులకు ఆత్మస్వరూపుడవైన నీవు మనుష్యులను నిరంతర భక్తియుతులుగా చేస్తావు.
వివరణ:- భగవంతుని నమ్మిన ఆస్తికులు విశ్వసృష్టికంటె పూర్వమే భగవంతుడున్నాడని నమ్ముతారు.
హిరణ్యగర్భః సమవర్తతాగ్రే (ఋ.10-121-1)
‘‘సూర్యాది సర్వ స్వయంప్రకాశకాల కాధారభూతుడైన పరబ్రహ్మం సృష్టికి పూర్వమే ఉన్నాడు’’అని ఋగ్వేదమే ప్రకటించియుంది. అలాంటప్పుడు స్వప్రకాశుడైయున్న పరబ్రహ్మ మహత్వం గూర్చి సందేహమెందుకు? విశ్వాన్ని సృష్టించి సర్వస్వమూ జీవులకు దానం చేసినట్టి మహాదాత పరమేశ్వరుడే.
నిప్పు నీటిని ఆవిరిగా మారుస్తుంది. నీరు నిప్పును ఆర్పివేస్తుంది. ఇది పైకి సామాన్యంగా కనపడినా ఎంతో అద్భుతమైన రచన. పరస్పర విరుద్ధమైన ఈ రెండు పదార్థాల సమ్మేళనంతో ఎంత గొప్ప చిత్రమైన సృష్టి రచన చేసాడు దైవం? ఇంతటి అపూర్వ సమ్మేళనంతో సృష్టి చేసేవాడు, అలా సృష్టించిన దానిని జీవులకే దానంచేసేవాడు కరుణామయుడగు పరమేశ్వరుడుగాక మరెవడుంటాడు? ‘న త్వద్ధోతా పూర్వో అగ్నే యజీయాన్’అని పరమాత్మ వదాన్యతను వేదం కీర్తించింది.
లోకంలో మానవులు ఏవో కొన్ని సమాన గుణాలు కలవానిని సమ్మేళనపరచి ఏవేవో పదార్థాలు సృష్టిస్తారు. కాని పరబ్రహ్మ రచన వైచిత్రిని చూడండి. మిత్ర=ఆక్సిజను మరియు కరుణ= హైడ్రోజను ఈ రెండింటిని విద్యుత్తుద్వారా సంయోగపరచి జలాన్ని సృష్టించాడు. ఆక్సిజన్ (మిత్ర) మండిస్తుంది. హైడ్రోజన్ మండుతుంది. ఈ రెంటిని విద్యుత్తుద్వారా సమ్మేళనపరచి చల్లదనాన్నిచ్చే నీటిని సృజించాడు. విశే్వశ్వరుని ఈ మహాద్భుత లీలను చూచియే ‘అగ్నేషోమీయం జగత్’ ఈ జగత్తు నిప్పు- నీళ్ళ అద్భుత సమ్మేళనం. దీనిని అగ్నిజలాల క్రీడావిలాసమని బ్రాహ్మణ గ్రంథాలు భగవల్లీలలను బహుధా ప్రశంసించాయి. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు