స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-88

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక పదార్థాన్ని సృజించేందుకు దాని కవసరమైన వౌలిక పదార్థాల విజ్ఞానం వానినుపయోగించే పద్ధతి మరియు నైపుణ్యం కూడ ఎంతో అవసరం. ఈ విషయంలో కూడ పరదైవ ప్రాధాన్యమెంతో ఉంది. ఈ విషయాన్ని వివరిస్తూ ‘న కావ్యైః పరో అస్తి స్వధావః’ ‘‘ఓ సర్వశక్తిశాలీ! కావ్యాలు గాని జ్ఞానులుగాని మరేవైన గానీ ఈ అంశంలో ముఖ్యంకాదు’’అని వేదం స్పష్టపరచింది. ఏపాటి చిన్న వస్తువును తయారుచేయాలన్నా మనిషికి మరొకరి సహాయం లేకుండా నిర్మించలేడు. మరి పరమాత్ముడో! ‘స్వధావః’ స్వశక్తితో సర్వమూ సృష్టించగలడు. రఘువంశంలో మహాకవి కాళిదాసు ‘స్వ వీర్య గుప్తా హి మనోఃప్రసూతిః’ (రఘువంశం-2-4) ‘‘మనువు సంతానం తన సామర్థ్యం చేత సురక్షితులైయున్నారు’’అని భంగ్యంతరంగా (పరోక్షంగా) ఈ విషయానే్న ప్రతిపాదించాడు. భగవంతుని శక్తినెవరు వర్ణించగలరు? ఆయన శక్తి అనంతమూ అపారము. ఆయన సర్వవ్యాపి. కాని ఎవరికి చర్మచక్షువులకు కానరాడు. మానవుల హృదయాలలో విరాజమానుడైయున్నాడు. కాని మానవుడే ఆయన ఎడల విముఖుడు. ఎవడో సాధనాసంపన్నత చేత భాగ్యశాలియైనవాని హృదయంలో ఆ దైవం హఠాత్తుగా స్వప్రకాశమానమై సాక్షాత్కరిస్తుంది. ఈ మాటనే వేదం ‘విశశ్చ యస్యా అతిథిర్భవాసి.’ ‘‘ఏ వ్యక్తి హృదయంలోనో నీవు అతిథిగా సాక్షాత్కరిస్తావు’’అని అలంకారిక పరిభాషలో రమణీయంగా చెప్పింది.
అతిథి ఇంటికి రావడానికి తిథి అంటూ నియమంగా ఉండదు. కాని మానవుడు అతిథి సత్కారానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అలాకాకుంటె వచ్చిన అతిథి సత్కారం పొందకనే వెనుతిరిగిపోతాడు. లౌకిక సంబంధియైన అతిథి విషయంలో యమధర్మరాజు ఇలా వివరించాడు.
ఆశా ప్రతీక్షే సంగతం సూనృతాం చేష్టాపూర్తే పుత్రపశూ శ్చ సర్వాన్‌
ఏతద్ వృజ్తే పురుషస్యాల్పమేధసో యస్యానశ్నన్ వసతి బ్రహ్మణో గృహే॥
కఠోపనిషత్తు 1-2॥
భావం:- ఎవని గృహంలో అతిథి ఆకలితో బాధపడతాడో ఆ మందభాగ్యుని ఆశలు - యజ్ఞయాగాది పుణ్యకర్మలు- సంతానం- పశుసంపద- సత్సంగఫలం ఇలా అన్నీ సర్వనాశనమైపోతాయి. ఔరా! లౌకిక అతిథి సత్కార తిరస్కారానికే ఇంత దుష్ఫలితముంటే బ్రాహ్మణ్యులకే బ్రాహ్మణ్యుడైన అతిథి సత్కార తిరస్కారానికెంత దుష్ఫలితం సంభవిస్తుంది? అద్భుతమైన- అసమానమైన ఆ మహాఅతిథిని ఎవడో భాగ్యశాలి మాత్రమే గుర్తించి సత్కారం చేస్తాడు. ఆ విధంగా చేసిన పుణ్యశాలిని ఆయన అతిథి సత్కార పుణ్యఫలంగా ‘స యజ్ఞేన వనవద్దేవ మర్తాన్’అన్న వేద వచనానుసారం భగవంతుడు భగవద్భక్తి తత్పరుణ్ణి చేస్తాడు. ఇదే అతిథి పూజకు అద్భుత ఫలం.
**
63. మనసా నీ ధ్యానం భజనయే
యస్త్వా హృదా కీరిణా మన్యమానో- మర్త్వం మర్త్యో జోహవీమి
జాతవేదో యశో అస్మాసు ధేహి ప్రజాభిరగ్నే అమృతత్వమస్యామ్‌॥
ఋ.5-4-10॥
ప్రతి పదార్థం:- యః= ఎవడు; మర్త్యః= మరణమే సహజధర్మంగా గలిగియున్నాడో; సః= అట్టివాడగు (అధ్యాహార్యం); అహమ్= నేను (అధ్యాహార్యం); త్వా= నిన్ను; అమర్త్యమ్= శాశ్వతునిగా; మన్యమానః= భావిస్తూ; కీరిణా= నీ స్తుతి చేత; హృదా= స్వచ్ఛమైన హృదయంతో; జోహవీమి= మరల మరల ధ్యానిస్తూ ఉన్నాను లేదా పిలుచుచున్నాను; జాతవేద= ఓ సర్వజ్ఞుడా; ప్రజాభిః= జనులతో లేదా జనుల ద్వారా; అస్మాసు= మాకు; యశః= యశస్సును; ధేహి= ఇమ్ము; అగ్నే!= అందరను సర్వోన్నతులను చేసే ఓ అగ్నిదేవా!; వయమ్= మేము (అధ్యాహార్యం); అమృతత్వమ్= మోక్షాన్ని; అశ్యామ్= పొందెదము గాక! ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు