స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-90

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యజ్ఞాన్ని ఎవడు చేయగలడు?
నరాశంసః సుషూదతీమం యజ్ఞమదాభ్యః కవి ర్హి మధుహస్త్యః॥
ఋ.5-5-2॥
ప్రతిపదార్థం:- నరాశంసః= సమస్త జనులచేత స్తుతింపబడేవాడు; అతః అదాభ్యః = ఇతరుల అధికారానికి వశపడనివాడు; మధుహస్త్యః= శుభకరమైన చేతులుకలవాడు; కవిః= వస్తువులయందలి సత్యతత్త్వం తెలిసినవాడు; హి= మాత్రమే; ఇదమ్= ఈ; యజ్ఞమ్= యజ్ఞాన్ని; సు+ షూదతి= శాస్ర్తియంగా నిర్వహించగలడు.
భావం:- జనులందరిచేత స్తుతింపబడేవాడు; ఇతరుల బలదర్పానికి అధికారానికి వశపడని వాడు; శుభకరమైన హస్తాలు కలవాడు; సత్యసత్త్వాన్ని దర్శించగలవాడు మాత్రమే ఈ యజ్ఞాన్ని శాస్ర్తియంగా నిర్వహించగలడు.
వివరణ:- యజ్ఞమనే మాట లోకంలో సాధారణంగా వినబడుతూ ఉంటుంది. అసలు యజ్ఞమంటే ఏమిటి? ఈ మాటకు ఎన్నో వివరణలున్నాయి. వానిలో దేవపూజ, సంగతీకరణం, దానం అనేవి. యజ్ఞమన్నదొకటి. దేవతలను, దివ్యగుణ సంపన్నులను, దానంచేసేవారిని, వీరులను, ఇలాంటి వారిని పూజించడమే దేవపూజ. సంగతీకరణమన్నది మరొకటి. చెడు నడత గలవాని; సం= మంచి; గతి= నడత గలవానిగా చేయడం. సంగతీకరణం అంటె జీవితంలో సాంఘిక మర్యాదలకు వ్యతిరేకంగా నడిచేవారిని; శాస్త్రాలు చెప్పిన నిషిద్ధ కర్మలుచేసేవారిని; అజ్ఞానం చేత లక్ష్యం లేక నిర్లక్ష్యంగా వివిధ రీతులుగా ప్రవర్తించే వారిని సక్రమమార్గంలో పెట్టి ఉద్ధరించుట సంగతీకరణమని భావం. ఇక దానం. తనకు సంపూర్ణ్ధాకారం గల వస్తువులను ఆ అధికారాన్ని విడిచి వానిపై సంపూర్ణ్ధాకారంతో ఇతరులకు ఇచ్చివేయడం దానం. ఈ అన్ని కలసి యజ్ఞమనబడుతుంది.
పూజించేందుకు పూజార్హులెవరో గ్రహించే జ్ఞానముండాలి. సంగతి కల్పించాలంటె యోగ్యత కలవారెవరు? వారి గుణగణాలేమిటి? వారికేమేమవసరం? అనే విషయాలు తెలియాలి. అలాగే దానికి పాత్రుడెవరు? ఆతడికేది దానయోగ్యమైనది కూడ ముందుగా తెలుసుకొని ఉండాలి. యజ్ఞరూపమైన ఈ పనులను చేయాలంటె ఆ వ్యక్తికి ముఖ్యంగా అత్యంత సూక్ష్మమైన దృష్టి(జ్ఞానం) ఉండాలి. అందుచేతనే అట్టి యజ్ఞకర్త ‘కవిః’ క్రాంతదర్శి కావాలని వేదం స్పష్టంగా పేర్కొంది.
సంక్షిప్తమైన ఈ యజ్ఞార్థాన్ని గురించి కొంచెంగా మనస్సులో విచారించండి. అది ఎంత గంభీర విషయమో మీకే బోధపడుతుంది. యజ్ఞకర్మలో అవసరమయితే శరీరాన్ని కూడ పరిత్యాగంచేయాలని ఋగ్వేదమే ఈ విధంగా శాసించింది.
బృహస్పతిం యజ్ఞమకృణ్వత ఋషిం ప్రియామ్‌
యమస్తన్వం ప్రారిరేచీత్‌॥ ఋ.10.13.4॥
భావం:- యమధర్మరాజు ప్రియమైన శరీరాన్ని అర్పించి గొప్ప ఋషి యజ్ఞాన్ని చేసాడు.
దీనినిబట్టి యజ్ఞకర్మ అంత స్వల్పమైన కార్యం కాదు. ఆరంభంలో అది చిన్నగానే ఉంటుంది. కాని కార్యాచరణలో చాల ఘనతరమైనది. ఎన్నో ఘనకార్యాలను సాధించి పెట్టగలది అని ఈ మంత్రం ద్వారా ఋషి మార్గాన్ని చూపించాడు.
మరి యజ్ఞాన్ని ఎవరు చేయాలి? ఎవరు చేయగలరు? ఈ విషయాన్ని కూడ మంత్రం సూచిస్తూంది.
ఇక్కడ యజ్ఞాన్ని చేసిన ఆ గొప్ప ఋషి ఎవరు? యముడు. అతడు స్వయంగా ఇంద్రియ నిగ్రహంగల సంయమి. ఇతరులను సహితం నిగ్రహించగల సమర్థుడు. స్వయంగా జీవులకు మృత్యుస్వరూపుడు. లోభాది గుణాలకతీతుడై కార్యనిర్వహణ చేస్తున్న సర్వసమర్థుడు. తానే ఇతరులను అదుపుచేయగల శక్తిశాలి. అట్టి సర్వసమర్థుణ్ణి వేదం ‘అదాభ్యః’=అదాభ్యుడు. ఎవరికి వశపడనివాడు అని చెబుతూంది. అట్టి యముడు తన శరీరాన్ని ఋషియజ్ఞంలో త్యాగంచేసాడు. అది అంత సాధ్యమా? ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు