స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం--91

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512

ధన నాశనమూ- శరీర నాశనమూ ఏది కోరుకొంటావు అని అడిగితే ధననాశనం గాక శరీర నాశనం కోరుకొనే మూర్ఖుడుంటాడా? కాని యముడో! ఋషి యజ్ఞంలో తన తనువునే త్యాగంచేసాడు. అంటె అది త్యాగానికి ఒక పరాకాష్ఠ. యమున త్యాగఘనతను పై మంత్రం ‘ప్రియాం యమస్తన్వం ప్రారిరేచీత్’అని బహుధా ప్రశంసించింది. శరీరమే త్యాగం చేసినవాడు అంతకుముందే ధనత్యాగం చేయకున్నాడా? చేయక లోభపడి యుండడుకదా. ఇక మనస్సు మాట. శరీరంతోబాటుగా అదికూడ ముందే పరిత్యాగమైపోయింది. మనస్సును త్యాగంచేసేందుకు సిద్ధపడక శరీర త్యాగం సాధ్యమా? ఈ విధంగా చనువు-్ధనము- మనస్సులు కలిపి ప్రవర్తింపచేసిన త్యాగశీలిని వేదర్షి ప్రారంభంలో నరాశంసః= సర్వజనుల చేత స్తుతింపతగినవాడు అని కీర్తించాడు.
ఆ విధంగా సర్వజనుల చేత త్యాగగుణ యశోగానం చేయబడే లోకోపకారకమైన కార్యమే యజ్ఞం. అట్టి యజ్ఞకర్త మాట మధురం. దానినుండి ప్రవహించేది మాధుర్యమే. అందుకే ‘నరాశంసః’అని స్తుతించిన వేదర్షి తృప్తిపడక ‘మధుహస్త్యః’ హస్తంలో తేనె గలవాడని కూడ ప్రశంసించాడు. అట్టివాడు చేసిన యజ్ఞం మరియు అందుకు సమర్పించబడింది కూడా మధువే అవుతుంది.
**
65. ఋతాన్ని (సత్యాన్ని) తెలుసుకోః
ఋతం చికిత్వ ఋతమిచ్చికిద్ధృతస్య ధారా అను తృంధి పూర్వీః
నాహం యాతుం సహసా న ద్వయేన ఋతం సపామ్యరుషస్య వృష్ణః
॥ ఋ.5-12-2॥
ప్రతిపదార్థం:- ఋతం చికిత్వః= ఓ సత్యజ్ఞానాభిలాషీ!; ఋతమ్+ ఇత్= సత్యాన్ని మాత్రమే; చికిద్ధి=మరల మరల తెలుసుకో; ఋతస్య= సత్యానికి సంబంధించిన; పూర్వీః = సనాతన కాలంనుండి వస్తున్న; ధారాః= భావనా పరంపరల; అనుతృంధి= రహస్యాలను తెలుసుకో; అహమ్= నేను; సహసా= బలగర్వంచేత దుస్సాహసంతో; ద్వయేన= చెప్పేదొకటి చేసేదొకటి అయిన ద్వంద్వప్రవర్తనతో; యాతుమ్= రాక్షసునిగా; న భవామి= కాను; అరుషస్య= క్రోధరహితుడు= వృష్ణిః= ఆనంద దాయకుడైన భగవానుని; ఋతమ్ = సృష్టినియమాలను; సపామి= శిరసావహించి ఆచరిస్తాను;
భావం:- ఓ సత్యాభిలాషీ! సత్యాన్ని మాత్రమే మరల మరల తెలుసుకో. సత్యానికి చెందిన ప్రాచీన సంప్రదాయాలను బాగా తెలుసుకొని విధేయుడవై ఆచరించు. క్రోధ రహితుడూ, ఆనందప్రదుడూ అయిన భగవానుడు నియమించిన సృష్టినియమాలను (ఋతం) శిరసావహించి ఆచరిస్తాను.
వివరణ:- భగవానుడు ఈ మంత్రంలో మానవుల నుద్దేశించి ‘ఋతం చికిత్వః’ సత్యాభిలాషియని సంబోధించాడు. ‘మానవజన్మనెత్తి సత్య- ధర్మాన్ని పాటించకుంటే అతడు మనిషి అని పిలువబడేందుకు కూడ అర్హుడు కాడు’అని ఆ సంబోధనలోని ఆంతర్యం.
సువిజ్ఞానం చికితుషే జనాయ సచ్చాసచ్చ వచసీ పస్పృధాతే

అని ఋగ్వేదం పేర్కొన్నట్లు మనిషి జీవితంలో సాధారణంగా సత్యాన్ని అసత్యమూ, అసత్యాన్ని సత్యమూ ఒకదానినొకటి బాధిస్తూ ఎదురవుతాయి. కాని బుద్ధిమంతుడైనవాడు వానిలో ఒక్క సత్యాన్ని మాత్రమే స్వీకరించాలి.
తయో ర్యత్సత్యం యతరదృజీయస్తదిత్సోమో- పతి హంత్యాసత్‌॥
ఋ.7-104-12॥
అని ఋగ్వేదమదే మంత్రంలో హెచ్చరించింది. నిజంగా శాంతి కోరుకోనేవాడు అసత్యాన్ని విడిచిపెడతాడు. అశాంతిమయమైన ఈ ప్రపంచంలో శాంతి యెడల కోరికకలవాడు మాత్రమే జ్ఞానసముపార్జన ఎడల అభిలాషకలవాడు. సత్యాభిలాష ఆతడి యందే పరిపూర్ణమై యుంటుంది. మరియు దానియందు ఎంతో ప్రీతి కూడ ఉంటుంది.