స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-95

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అధూర్షత స్వయమేతే... బ్రువంతఃఅని. ఆ విధంగా వారు పాప పతనమవుతున్నారు. మిత్రులుగా ఉన్న సమయంలో ప్రియంగానే సంభాషిస్తారు. మిత్రుడైనవానికి శ్రమ కలిగితే తమ ప్రాణాలను సహితం సమర్పించేందుకు మిత్రులు సిద్ధపడతారు. మరి వారే మిత్రుడి ప్రాణాలను సహితం తీసివేసి పతితుణ్ణిచేసేందుకు ముందుకువస్తారు. ఈ రీతిగా పరిస్థితి తారుమారు ఎందుకేర్పడింది? పాపవశంవలన వారు ఏ దుర్భాషలు పలకరాదో అవి పలకడం చేతనే. అంటే వారు తమనుతామే బాధించుకొన్నట్టు. ఫలితంగా పాపభూయిష్టమై పోయారన్నమాట. ముందొకటి పలికి తరువాత మరొకటి పలికిన మనిషి తన విశ్వాస పాత్రతను కోల్పోవడం లోకసహజమేకదా. అట్టివాడికి సమాజంలో గౌరవముండదు. గౌరవ హీనుడికి మృత్యువే మేలు. మేలుకాదు మృత్యువుకంటె చాలాబాధాకరం ‘సంభావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే’ (్భ.గీ.2-34) అని భగవద్గీత పేర్కొంటూంది. కాబట్టి ముందు విశ్వాసపాత్రుడైయుండి తదుపరి విశ్వాసహీనుడైన శత్రువుకావడం తన చేతితో తానే స్వయంగా వినాశనాన్ని కొనితెచ్చుకోవడమే. దీనికంతటికి మూలకారణం మనిషి అత్యధికంగా విషవాంఛలలో లంపటుడై చిక్కుకొనిపోతే అతడికి సత్యశీలుర ఎడల విముఖత కలిగి ఒక్క దుర్భాషలచేతనే వారిని నిందించి తననుతానే హింసించుకొంటాడు అంటే పాప పతితుడవుతున్నాడు.
**
సత్యం త్రికాలాబాధితం
స హి సత్యో యం పూర్వే చిద్దేవాసశ్చిద్యమీధిరే
హోతారం మంద్రజిహ్వ మిత్సుదీతిభిర్విభావసుమ్‌॥ ఋ.5-25-2॥
భావం:- సమస్త జీవులకు సర్వప్రదాత, ప్రియవచనుడు, మహోత్తమ అష్టైశ్వర్య సంపన్నుడు అయిన వానిని విద్వాంసులు తమ జ్ఞాన ప్రకాశంచేత ప్రకాశింపచేస్తున్నారో, ప్రాచీనులైన నిష్కామకర్మ యోగులైన విద్వాంసులు ఎవనిని ప్రకాశింపచేస్తున్నారో అతడే సత్యస్వరూపుడైన భగవానుడు.
వివరణ:- ఈ మంత్రం భగవానుడు సత్యః= త్రికాలాబాధితుడు అనగా భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు వశపడని అతీత స్వభావుడు, స హి సత్యః= నిజంగానే అతడే సత్యస్వరూపుడని వర్ణిస్తూంది. ప్రకృతి సత్యమైనది. అది ఎల్లప్పుడూ ఉంటుంది. అది ఎనె్నన్నో రూపాలుగా మారుతూనే బహురూపి ఏమోనన్న భ్రాంతిని కలిగిస్తుంది. ఈ క్షణంలో ఉన్న ఒక రూపం మరుక్షణంలో మరొక రూపాన్ని పొందుతుంది. దానిని చూచి సామాన్య జనులు మోసపోతూ వెనుక కనబడినది ఒకటి ఇప్పుడు కనబడేది మరొకటి అని అనుకొంటూ ఉంటారు. ఔను ఆ ప్రకృతి నిజంగా భూత- భవిష్యత్ వర్తమాన కాలాలలో ఒకటిగా మాత్రముండదు. ఆధ్యాత్మికవేత్తలు ప్రకృతి తన ధర్మాన్ని- లక్షణాన్ని- అవస్థను మార్చుకొంటుందని నిర్ణయించారు. ఉదాహరణకు మట్టినే చూడండి. మట్టి బాగా మర్దించి కాల్చి కుండను తయారుచేసామనుకోండి. అప్పుడు మట్టికి దానికుండే మట్టి రూపం పోతుంది. కుండ రూపమైన ధర్మం క్రొత్తగా వస్తుంది. నిజానికి మట్టికి కుండకు భేదం లేదు. అయినా వానిని చూచిన బాలుడు ఆ రెండూ ఒకటిగా భావించడు. కాని జ్ఞాని మాత్రం కుండకు మట్టికి మధ్య భేదం లేదని గ్రహిస్తాడు.
జీవుడెప్పుడూ ఆనంద రూపుడే. పుత్ర-మిత్ర-కళత్రాదులతో కూడి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అతడే మరొకసారి వివిధ కష్ట-నష్టాలచేత, శోక దుఃఖాలచేత రోదిస్తూ ఉంటాడు. ఆ విధంగా విభిన్న దశలలో సుఖ-దుఃఖాలు, హర్ష-శోకాలు మొదలైన ద్వంద్వ దశలలో పడి జీవుడు శ్లోక- హర్షాలను పొందుతూనే వేరువేరుగా కనబడుతున్నా సహజ లక్షణంచేత కేవలం అతడు ఏకైక జీవుడే. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు