స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-99

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మంత్రంలో దైవోపాసన మరియు దైవ పూజ వలన కలిగే ఫలం వివరింపబడింది. చీమ నుండి బుద్ధిమంతుడైన మనిషి వరకు అందరూ సంపాదనలో నిమగ్నులైయుంటారు. అందరకు ధనం మీద ఆశే. ధనమే లేకుంటే అందరకు మృత్యువే కనబడుతుంది. అన్నం, వస్త్రం, పశువులు, గృహాలు, ఇలా అన్నీ ధన స్వరూపాలే. బయట తిరుగుతూ ఆహారాన్ని సంపాదించుకోలేని కాలంలో సుఖంగా జీవించేందుకు చీమలు రాత్రింబవళ్ళు ఆహార సంపాదనకై తిరుగుతూ ఉంటాయి. అలాగే మనుష్యులకు కూడ వృద్ధాప్యం గురించి, పరిజనులు మరియు స్వజనుల సంరక్షణ గురించి, భవిష్యత్తులో సంభవించబోయే ఆపదల భయం గురించి తీవ్రమైన చింత ఉండటం చేత వారు ఆహారం మరియు ధన సంపాదన విషయంలో వ్యగ్రులై యుంటారు. స్థూలంగా చూస్తే జంతువుల విషయంతో పోలిస్తే మానవులకే అధికమైన అవసరాలుంటాయి. అందుకే వారి ధన సంచయ విధానం విలక్షణంగా- విపరీతంగా ఉంటుంది. అందుచేత అతడు మృత్యుముఖానికి సన్నిహితుడవుతూ ఉంటాడు. అలా కాకుండేందుకు మంచి సాధనం తృప్తి. అది లేనితనం చేత కోరుకొన్నది సిద్ధించినా మరొకదాని మీద లాలస భావాన్ని పెంచుకొంటాడు. అప్పుడు మనిషి కోసం ధనం కాక ధనం కోసం మనిషిగా ఆ మనిషి మారిపోతాడు. చూడండి ధనమెంత భయంకర స్థితికి కారణమో. కాబట్టి ఈ ధన దోషాన్ని గ్రహించిన జ్ఞాని దానిని నాశనహేతువుగా చూచి దానికి చాల దూరంగా ఉంటాడు. ఎందుకంటె జ్ఞాని దృష్టిలో-
యా హ్యేవ పుత్రైషాణా సా వితె్తైషణా యా వితె్తైషణా సా లోకైషణా
ఉభే హ్యేతే ఏషణే ఏవ భవతః ॥ బృహదారణ్యకోపనిషత్తు 4-4-22॥
పుత్రైషణా= పుత్రుడు కావాలనే కోరిక; వితె్తైషణా= ధనం కావాలనే కోరిక; వితె్తైషణయే లోకైషణ అంటే భార్యా- పుత్ర- బంధు సహిత సంసారాభివృద్ధి కాంక్షయే. పుత్రైషణ- లోకైషణ- ఈ రెండూ ఈషణ= కోరికలే; పుత్రకళత్రాదులు కూడ మనిషి తృప్తికోసమే. నిత్యమూ వారిలో తన ఎడల కలిగే అనురాగ తారతమ్యాన్ని చూచి అసంతృప్తితో విచారగ్రస్తుడైన వారి సంతృప్తి కొఱకు ధనకాంక్ష వసిస్తాడు. ఈ విషయాన్ని బృహదారణ్యకోపనిషత్తు ఇలా వర్ణిస్తూంది.
ఏష నిత్యో మసిమా బ్రాహ్మణస్య న వర్థతే కర్మణా నో కనీయాన్‌
తస్యైవ స్యాత్పదవిత్తం విదిత్వాన లిప్యతే కర్మణా పాపకేన॥
॥ 4-4-23॥
భావం:- బ్రాహ్మణునకు ధనం కర్మచేత సమకూరదు. పెరుగదు. ధనాన్ని సంపాదించే సందర్భంలో గాని-ఇతరుల నుండి పొందే సమయంలో గాని అది పాపకర్మచేత అపవిత్రమైనదా? అని ముందుగా తెలుసుకొని మాత్రమే దానిని పొందాలి. ఆ విధంగా పొంది సమకూర్చుకొని ధన సమృద్ధియే ధన సమృద్ధి. ఆ ధనమే స్పార్హమ్= అర్థించదగిన రేక్ణః= ఉత్తమ ధనం. అట్టి ధనాన్ని గుర్తించే విధానమేమిటి? దానిని బృహదారణ్యకోపనిషత్తు ఇలా వివరించింది.
తమేతం వేదానువచనేన బ్రాహ్మణా వివిదిషంతి యజ్ఞేన
దానేన తపసా-నాశకే నైతమేవ విదిత్వా మునిర్భవతి
॥ బృహదారణ్యకోపనిషత్తు 4-4-22॥
భావం:- ఈ వేద వచనానుసారంగా బ్రాహ్మణులు యజ్ఞ, దాన, తపో రీతులలోఉత్తమ ధనాన్ని గూర్చి తెలుసుకొంటారు. ఎవడు ఆ విధంగా తెలుసుకొంటాడో, అతడు మహావౌనాన్ని వహించి మునిగా మారిపోతాడు. అంటె లౌకిక ధనాపేక్ష లేని వాడవుతాడు. కాని జ్ఞాన ధనాపేక్ష విషయంలో మాత్రం కాదు. అట్టి ఉత్తమ శీలుడికి తప్పక సర్వోన్నతమైన జ్ఞాన ధనం లభిస్తుంది. ‘ఉరు శంసాయవాఘతే’ అని వేదం వాగ్దానం చేస్తూంది. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512