స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం--21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
భగవత్ పూజాఫలం

స ఇజ్జనేన స విశా స జన్మనా స పుతైర్వాజం భరతే ధనా నృభిః
దేవానాం యః పితరమావివాసతి శ్రద్ధామనా హవిషా బ్రహ్మణస్పతిమ్

భావం:శ్రద్ధాశీలంగల మనిషి ఆత్మసమర్పణ భావంచేత సమస్త దేవతలకు విద్వాంసులకు, నిష్కామ కర్మశీలురకు తండ్రియై, ప్రభువై, సంరక్షకుడైన భగవానుని పరిపూర్ణంగా పూజిస్తాడో అతడు తన సేవాతత్పరత ద్వారా సర్వ సంపదలను పొందగలడు. అట్లే అతడు స్వతఃసిద్ధమైన జన్మ విశేషం చేత- సంతానం చేత, పరిజనులు లేదా రాజపురుషుల ద్వారా అన్నాన్ని, బలాన్ని, ధనాన్ని పొందగలడు.
వివరణ:ఈ మంత్రంలో భగవత్ పూజాఫలం విశేషం వివరింపబడుతూంది. ఇక్కడ భగవంతుడన్న మాటకు పర్యాయపదంగా బ్రహ్మణస్పతి అనే పదం ప్రయోగింపబడింది. ఋగ్వేదమంత్రంలో మరోచోట బ్రహ్మన్ అనే శబ్దం పర్యాయంగా చెప్పబడింది.
‘విశే్వషా మిజ్జనితా బ్రహ్మణామసి’- భగవానుడే విశ్వకర్త మరియు జ్ఞానకర్త. వాని సంరక్షకుడు కూడా ఆయనే. ఎవడు ఉత్పాదకుడో అతడే వానికి ప్రభువు కూడా. అందుచేతనే ఆ ప్రభువు పూజార్హుడు.
మనమంతా మర్త్యులం. నేడు జీవించి యుంటాం. రేపు మరణిస్తాం. తర్వాత మనమెవరమో ఎవరికీ తెలియదు. దేవతలు అమర్త్యులు. మానవ శరీరాలవలె వారి యశఃశరీరాలు నశించవు. ఆ విధంగా దేవతోత్పత్తి జరుగుతుంది. భగవానుడా దేవతలకు కూడా జనకుడే. జనకుడే గురువు. ఆయనను విధిగా పూజించాలి.
అరే! గురుపూజకు వట్టిచేతులతో వెళతావా? లేక ఏదో ఒకదానిని చేతబట్టుకొని వెళతావా? వాస్తవానికి గురువు వద్దకు పూజార్థంగా వెళ్లే సమయంలో సమిధలను చేత పట్టుకొని వెళ్లాలి. అలా ఏదేని చేత పట్టుకొని పోకుంటె గురుపూజ నేవిధంగా చేయగలవు?
పరమాత్మ పూజాద్రవ్యాలకు మొగం వాచినవాడు కాడు. సృష్టిలో ఉండే సర్వమూ ఆయనకు చెందినదే. అట్టి మహామహుడికి నీవేమి ఈయగలవు. నిన్ను నీవే అర్పించుకోవాలి.
ఆయనకు యజ్ఞంలో హవిస్సును సమర్పించుకోవాలి. కాని ఏదో సమర్పింపక తప్పదు కదా అన్న భావంతో కాదు. అట్లే లోకంలోని తనదన్న ప్రతి వస్తువు ఏదో ఒకనాడు నశించిపోతుంది. అప్పుడైనా విడిచిపోయే ప్రమాదముంది కదా అన్న ఉద్దేశ్యంతో కూడా పరమేశ్వరుడికి సమర్పింపరాదు. దేనినర్పించినా మనస్సున శ్రద్ధ కలిగి మాత్రమే సమర్పించుకోవాలి. ‘శ్రద్ధామనాః’ శ్రద్ధా సమర్పణంలో అపారమైన శక్తి ఉందని వేదం చాలా చోట్ల ఉద్ఘాటించింది.
లౌకికమైన ధనమైనా పారలౌకికమైన ముక్త్ధినమైనా ‘శ్రద్ధయా విందతే వసు’ - శ్రద్ధ చేతనే ధనం లభిస్తుంది అని ఋగ్వేదం నిస్సందేహంగా చెబుతూంది.
భగవద్వాచ్యమైన బ్రహ్మణస్పతి శబ్దానికి ధనపతి అని కూడా అర్థం. ధనం కోరుకొనేవాడు అది లౌకికమైనా పారలౌకికమైనా ధనపతి అయిన భగవాన్ బ్రహ్మణస్పతిని విధిగా అర్థించాలి.
ఇంకావుంది...