స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-101

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆపిః పితాప్రమతి? సోమ్యానామ్’’ శాంతికాములకు నీవే పొందదగిన ఆప్తబంధువు.’’ ఉత్సాహపరచే తండ్రివి. శాంతిని అనే్వషిస్తూ ఎన్నోచోట్ల తిరిగాం. తిరిగి తిరిగి చివరకు శాంతికి బదులుగా అశాంతికి గురయ్యాం అని దైవం ముందా జీవుడు మోకరిల్లాడు.
దీనుడైయున్న ఆ జీవుని మనోవేదనను గుర్తించి చెందనున్న పరమగురువు ‘‘జీవుతా! జగత్పితయైన దైవాన్ని శరణువేడు. ఎందుకంటె సంతానాన్ని రక్షించే దీక్షలో తండ్రిని నియమించిన వాడెవడుంటాడు? అందుకే నీవూ-నేనూ ఈ పరమాత్మను శరణుకోరి వచ్చాం’’అని పలికి ఇలా ప్రార్థించాడు గురువు. ఓ దేవా! ‘్భృమి రస్యృషికృన్మర్త్యానామ్’ ‘‘జనన మరణ రూప సంసార చక్రాన్ని త్రిప్పుతూ మనుష్యులను ఋషులుగా మార్చేవాడవు నీవే. ఎవరు నీ శరణుజొచ్చుతారో వారి అజ్ఞానాంధకారాన్ని తొలగించి వారిని ఋషిగా తీర్చిదిద్దుతావు’’. నీ శరణుజొచ్చిన మమ్ము ఋషులుగాచేసి నీవారిగా చేసికో. నీవే ఋగ్వేదంలో
అహమేవ స్వయమిదం వదామి జుష్టం దేవేభిరుత మానుషేనిః
యం కామయే తం తముగ్రం కృణోమి తం బ్రహ్మాణం తమృషిం తం సుమేధామ్

నేను ఉగ్రుణ్ణి చేయాలనుకొంటె ఉగ్రుణ్ణి; వేదవేత్తను చేయాలని తలంచితే వేదవేత్తగా, ఋషిగా తీర్చిదిద్దాలని భావించితే ఋషిగా, మేధావిగా చేయ నిర్ణయించితే మేధావిగా ఆయా వ్యక్తులను నేనే చేస్తాను అని చెప్పావు కదా. ఓ తండ్రీ! ఋషులుగా చేయాలని మమ్ములనుకూడ భావించి ఋషులుగా చేయుమయ్యా! నీవు మమ్మెలాచేయాలని తలంచినావో తెలిపి ఆ మార్గాన్ని మాకు చూపు. ఆ మార్గంలో మేము నడుస్తాం.
**
ఎగురుతూ వెళ్లి దైవాన్ని చేరుతా
ఉపేదహం ధనదామప్రతీతం జుష్టాం నశే్యనో వసతిం పతామి
ఇంద్రం సమస్యన్నుపమేభి రర్కైర్యః స్తోతృభ్యో హవ్యో అస్తి యామన్‌॥
ఋ.1-33-2॥
భావం:- డేగ తాను ప్రీతితో నివసించే గూడును వదలి ఎలా ఎగిరిపోతుందో అదే విధంగా నేను కూడ వేదమంత్రోచ్ఛారణ చేస్తూ ఇంద్రియాతీతుడు, అజాత శత్రువు- అజ్ఞానధ్వాంత భాస్కరుడు, ప్రతి దినమూ స్తోత్ర పాఠకులకు కీర్తనీయుడైన భగవానునివద్దకు నమస్కరిస్తూ ఎగిరి వెళ్లిపోతున్నాను.
వివరణ:- డేగ మొదలైన పక్షులు చెట్లపై కట్టుకొన్న గూళ్లలో సుఖంగా జీవిస్తూ ఆహారానికై ఎక్కడెక్కడికోపోయి తిరిగి సాయంకాలం తమ గూళ్లకు చేరుకొంటూ ఉంటాయి. అలాగే సృష్టిలోని జీవులన్నింటికి ఆశ్రయుడు పరమాత్మయే. ఋగ్వేదం దీనినే ‘వయా ఇదగ్నే’ ‘అగ్నయస్తే అనే్య’ (ఋ.1-59-1) ‘‘ఓ పరమాగ్నీ! రెండవ అగ్ని= జీవుడు నీకు వయః= ఆశ్రీతుడు’’అని స్పష్టంచేసింది. జీవులే కాదు సమస్త దేవతలు ఆ అగ్నినే ఆశ్రయించి ఉన్నారని ‘తస్మిన్ శ్రయంతే య ఉ కే చ దేవాః’ (అథర్వణం. 10-7-35) అథర్వణ వేదం విశేషించి చెప్పింది. మహత్స్వరూపుడైన భగవానుని యందు చరాచర జగత్తు అంతా ఆశ్రయించియున్నా జీవులు తమ అజ్ఞానంచేత ఆ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు.
ఈ జగత్తున జన్మించేందుకు ముందు జీవుడనైన నేను సకల పరమాశ్రయుడైన పరబ్రహ్మనే ఆశ్రయించి ఉన్నాను. ఎందుకంటె అప్పుడు ప్రకృతితో నాకెట్టి సంబంధమూ ఏర్పడియుండలేదు. అందుచేత బ్రహ్మానంద నిమగ్నుడనైయున్నాను. జీవుల ఈ స్థితిని గురించి దయానంద సరస్వతి తమ సత్యార్థప్రకాశంలో ఇలా వర్ణించారు. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు