స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం--102

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512

‘‘జీవులు సాంసారిక సుఖాలను శరీరంలోనే ఉండి అనుభవిస్తూ ఉంటారో అలాగే మోక్షానందాన్ని జీవుడు పరమేశ్వరునిలో లీనమై ఉండి అనుభవిస్తూ ఉంటాడు.’’ (సత్యార్థ ప్రకాశం-9వ సముల్లాసం)
* ముక్తజీవులు స్థూల శరీరాన్ని విడిచి సంకల్పమయ శరీరంతో ఆకాశంలో పరమేశ్వనిలో ఐక్యమై సంచరిస్తూ ఉంటారు. (సత్యార్థ ప్రకాశం-9వ సముల్లాసం)
* దేహరహితుడై ముక్త జీవాత్మ బ్రహ్మంలో ఉంటున్నది. (సత్యార్థ ప్రకాశం- 9వ సముల్లాసం)
* సర్వవ్యాపకమైన పరిపూర్ణ బ్రహ్మమందు ముక్తజీవుడు నిరాటంకంగా ఆనందంతో స్వేచ్ఛగా విహరిస్తాడు. (సత్యార్థప్రకాశం- 9వ సముల్లాసం)
లోకంలో జీవుల జీవన విధానం చాల విచిత్రం. ఎక్కడ భోగముంటుందో అక్కడ రోగ ముంటుందని, ‘్భగే రోగభయమ్’ భోగంలో రోగానికో లేదా శోకానికో చెందిన భయముంటుందని దయానంద సరస్వతి మరియు భర్తృహరి వచనాల ప్రకారం నేను (జీవుడు) లౌకిక భోగాలలో తగులుకొని రోగ-శోకాల జంజాటంలో మునిగిపోయి నా స్వస్థానమైన దివ్యదేశాన్ని మరచిపోయాను. కాని ఏదో పూర్వసుకృతంవలన మరచిన ఆ దివ్యదేశం జ్ఞప్తికివచ్చింది. వెంటనే ‘ఉపదేహం ధనదామ్...... పతామి.’ డేగ లాగ ఎగిరి చర్మచక్షువులకు కానరాని ముక్తిప్రదాత పరబ్రహ్మ దివ్యసన్నిధికి ఎగిరిపోయాను.
ఇప్పుడు అక్కడకెంత త్వరగా వెళ్లగలనా అన్న ఆరాటమధికమయింది. దానివలన మెల్లమెల్లగా ప్రయాణిస్తే లక్ష్యాన్ని చేరుకోలేనని ఎగిరిపోతున్నాను. అదే నా ‘జుష్టాం’ప్రియమైన ఆవాసం. ఎన్నోమార్లు నే దివ్య ఆవాసంలోనే ఉన్నాను. ఇప్పుడు కూడ అక్కడకే పోతాను.
సరే. మరి అక్కడకు పోయే ఉపాయమేమిటి? ఉంది. అదే ‘ఇన్దం నమస్యన్ ... అర్కైః.’ స్తోత్రార్హమైన వేదమంత్రోచ్ఛారణలతో నమస్కరిస్తూ ఎగిరిపోవడం. అదే నేను చేస్తున్నాను.
భగవంతుని విస్మరిస్తే జీవుడనైన నాకు జనన మరణ రూపమైన సంసార బాధ తప్పదు. కాబట్టి ఆయన స్మరణ, ధ్యానం, చింతనలు భవబంధనాలను త్రెంపివేస్తాయి. అందుకే పరమాత్మ ‘స్తోతృభ్యో.....యామన్.’ భవబంధన విచ్ఛేద మార్గంలో ప్రీతిగా స్తోత్ర పాఠాలతో బిగ్గరగా స్తుతింప దగినవాడా పరమాత్మయే. అన్యుడు కాడు అని వేదర్షి స్పష్టంగా పేర్కొన్నాడు. ఈ వేదోపదేశానే్న ‘అన్యా వాచో విముంచథ’ (ముండక ఉ.2-2-5) రెండవ మాట విడిచిపెట్టు అని ముండకోపనిషత్తు ధ్రువీకరించింది. మరి మీరూ రండి. అన్యమైన దానిని విడిచి ఎగిరి దైవాన్ని చేరుదాం.
**
దైవత్వ సాధకుడు
ఆదిత్తే విశే్వ క్రతుం జుషంత శుష్కాద్యద్దేవ జీవో జనిష్ఠాః
భజంత విశే్వ దేవత్వం నామ ఋతం సపంతో అమృతమేవైః
॥ ఋ.1-68-2॥
భావం:- ఓ దేవా! లోకంలో అందరూ నీవుచేసే సత్కర్మలనే ఆచరిస్తున్నారు. ఎందుకంటె- నీవు శుష్కించిన ప్రకృతినుండి జీవనాన్ని సృష్టించావు. లేదా శుష్కించిన ప్రకృతి నుండియే జీవమయుడవైన నీవు పుట్టావు. సమస్త దేవతలు సదాచారాలను- సృష్టి నియమాలను ఆచరిస్తూ మోక్షాన్నిపొంది చివరకు దైవత్వానే్న పొందుతున్నారు.
వివరణ:- ఈ మంత్రంలో జీవుడు దైవత్వాన్ని పొందే అమోఘమైన సాధన వివరింపబడింది. దీనిని మనసా చింతించి ఆచరిస్తే మానవుడు తప్పక దివ్యుడవుతాడు.

ఇంకావుంది...