స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-103

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యజుర్వేదంలోని 1-5 మంత్రాన్ని వ్యాఖ్యానిస్తూ శతపథ బ్రాహ్మణంలో మహర్షి యాజ్ఞవల్క్యుడు ‘సత్యం వై దేవా అనృతం మనుష్యాః’ దివ్యులు సత్యశీలురైయుంటారు. మానవులు అనృతులు (న+ఋత)గా ఉంటారు అని నిష్కర్షగా చెప్పాడు. అంటె మనుష్యులు మనుష్యత్వ స్థితిలో ఉన్నంతవరకు ‘ఋత్’= సత్యనియమాలను వ్యతిరేక పద్ధతిలో ఆచరిస్తూ ఉంటారని ఆ ఋషి ఆంతర్యం. కాని మనిషి జీవిత లక్ష్యం దివ్యత్వాన్ని పొందడమే. దానిని సాధించేందుకు తప్పక ప్రస్తుత మంత్రోపదేశానుసారం ప్రవర్తింప వలసియుంది.
మొదటగా దేవత్వాన్ని అభిలషించేవారి లక్షణాన్ని ‘ఆదిత్తే...జుషంత’ ఓ దేవ! దేవత్వాభిలాషులందరు నీవే చేసే కర్మలనే తప్పక ఆచరిస్తూ ఉంటారని పేర్కొంది. ఇంతకూ దేవత్వమంటె ఏమిటి? పరమదైవమందుండే గుణాలను గ్రహించి ఆ రీతిగా తన జీవితంలో ఆచరణలో పెట్టడమే. మరి ఆ విధంగా ఆచరణలో పెట్టాలంటె ఆ దివ్యగుణాలేవో గుర్తించి - బాగా అర్థం చేసికోవాలి. అప్పుడేకదా ఆచరణలో పెట్టడం సాధ్యం.
దైవగుణాలేవో తెలుసుకొని వానితో దైవాన్ని కీర్తించడంతో సరిపోదు. వానిని జీవిత పర్యంతమూ ఆచరణలోపెట్టాలి. చూడండి. దైవాన్ని దయాళువంటూ నిత్యం కీర్తిస్తూ తానుమాత్రం దీనుల ఎడల నిర్దయుడుగా ప్రవర్తించడమూ, అట్లే భగవంతుడు పరమ ధర్మాత్ముడంటూ శ్లాఘిస్తూ తానుమాత్రం ఇతరుల ఎడల అధర్మంగా వ్యవహరించడం దైవత్వ ప్రాప్తికి సాధనంకాదు. కాబట్టి దైవత్వ సిద్ధికోరేవారు ‘తే విశే్వ క్రతుం జుషంత’= నీ గుణ- కర్మలను ప్రేమతో ఆచరిస్తారని దైవత్వాభిలాషి వచనంగా ఈ మంత్రం సూచించింది.
దైవగుణాలను ఆచరించడం సులభమా? ఆచరిస్తే దివ్యత్వం సిద్ధిస్తుందా? అన్న హేతువాద ప్రశ్న ఈ సందర్భంలో ఎవరికయినా కలుగవచ్చు. ఇలాంటి సంశయ మనస్కులనుద్దేశించియే మనిషి దేనిని భావించి ఏ కర్మ చేస్తాడో ఆతడు అదే రీతిగా మారిపోతాడని బృహదారణ్యకోపనిషత్తు ఇలా స్పష్టపరచింది.
యథాకారీ యథాచారీ తథా భవతి సాధుకారీ సాధు ర్భవతి
పాపకారీ పాపో భవతి పుణ్యః పుణ్యేన కర్మణాభవతి పాపః పాపేన॥
అథో ఖల్వాహుః- ‘‘కామమయ ఏవాయం పురుషః ఇతి
స యథా కామో భవతి తత్క్రుతుర్భవతి యత్క్రతుర్భవతి తత్కర్మ కురుతే
యత్ కర్మ కురుతే తదేవ భవతి॥ బృ.ఆ.ఉ.4-4-5॥
భావం:- మనిషి ఏ పనిని చేస్తాడో- దేనిని ఆచరిస్తాడో అతడు అదే రీతిగా మారగలడు. పుణ్యంచేసేవాడు పుణ్యాత్ముడు, పాపం చేసేవాడు పాపాత్ముడూ. పుణ్యకర్మవలన పవిత్రుడు, పాపకర్మ వలన అపవిత్రుడూ అవుతాడు.
లోకంలో జీవులంతా కోరికలు కలవారే. ఎటువంటి కోరిక కలిగియుంటారో వారు అటువంటి బుద్ధికలవారే అవుతారు. ఎటువంటి బుద్ధి కలిగియుంటారో వారు అటువంటి పనినే చేస్తారు. ఎలాంటి పనిని చేస్తారో వారలాంటి స్వభావంకలవారే అవుతారు అని పెద్దలు చెబుతూ ఉంటారు. ‘క్రతుం జుషంత’ ఎలా కోరుకొంటె అలాగే అవుతావు అన్న ప్రస్తుత మంత్రవాక్యానికి ఈ పెద్దల మాట ఎంత అందమైన వ్యాఖ్యానం.
భగవంతుని కర్మలను అనుసరించండి అని మంత్రం పేర్కొంది. అసలెందుకు అనుసరించాలి? దీనికి సమాధానంగా ప్రస్తుత ఋగ్వేద మంత్రం ‘శుష్కాద్ యద్దేవ జీవో జనిష్ఠాః’ రసహీనమైన ఈ ప్రకృతినుండి సృష్టిలో జీవమయుడవైన నీవు ఉద్భవించావు అని చెప్పింది. మరి నీరసమైన ప్రకృతి నుండి రసమయమైన జీవం ఎలా పుట్టింది? పుట్టినా అదికూడ నిర్జీవమైనదే కావాలికదా అన్న సందేహం ఎవరికయినా రావచ్చు. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు