స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-109

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాని భగవంతుడో! సర్వశక్తిమంతుడు. సర్వశక్తి ప్రదాత. సర్వక్రియా ప్రేరకుడు. భగవంతునిలోని ఈ సర్వశక్తిమత్వానే్న ‘స్వాభావికీ జ్ఞాన బలక్రియా చ’ పరమాత్ముని జ్ఞానం- బలం- క్రియా సామర్థ్యం సహజసిద్ధమైనవని ఉపనిషత్తులు వచిస్తే ప్రస్తుత మంత్ర మా జ్ఞాన- బల- క్రియాశక్తులతో ఆయన చేసిన సృష్టికార్యాన్ని ‘వి యో మమే రజసీ సుక్రతూయయా’ ‘సూక్ష్మబుద్ధివిశేషంతో ఊర్ధ్వ- అథో లోకాలను రెండింటిని విభిన్న లక్షణ సమన్వితంగా సృజించా’’డని ప్రశంసించింది.
పరమాత్మ సమస్త సృష్టిని ప్రకృతి సహాయంతోనో సృజించాడు. అయితేనేం? ఎంత వైలక్షణ్యం!! వైలక్షణ్యం!! ఎంత విశేషం!! సూర్యుడు ఎంతో కాంతివంతుడే. కాని ఎంత ఉగ్రతాపకరుడు!! భూమో!! ప్రకాశహీనం. ఈ పృథివి మీద ఎనె్నన్ని నదీ నదాలు!! ఎనె్నన్ని సముద్రాలు!! ఎనె్నన్ని ఎడారులు! ఇట్టి వైవిధ్యంలో పరమాత్ముని ‘సుక్రతూయయా’ జ్ఞాన- క్రియాశక్తులు రెండుద్యోతకమవుతున్నాయి.ఆవశ్యకమని దేనిని సంకల్పిస్తే దైవం దానినలా సృష్టిస్తూంది. జగన్నిర్మాణంలో దైవానికంటూ ఏదీ ప్రత్యేకమైన స్వప్రయోజనం లేదు. ఏదో క్రీడార్థంగా కూడ సృజించిన వాడు కాదు. అలా అని చెపితే భగవానుణ్ణి అజ్ఞాని అని చెప్పవలసి యుంటుంది.
ఎందుకంటె క్రీడ అజ్ఞానులకు- బాలురకు ప్రియమైనది కాబట్టి. వేదమలా చెప్పలేదు. ‘యో జజాన రోదసీ విశ్వశంభువా’ - ఊర్థ్వ అధో లోకాల శాంతి మరియు కల్యాణానికే సృష్టికార్యం చేసాడని ఖండితంగా చెప్పింది. లోకాలంటే ఏమి? అందలి జీవులే కదా. వారి కల్యాణానికే ఈ సృష్టి రచనోద్దేశ్యమని గ్రహించాలి. ఇలా ఈ సృష్టి విశ్వ సర్వ జీవ కల్యాణకారిగా ‘విశ్వశంభువా’ సర్వ జీవ కల్యాణప్రదుడయిన పరమాత్మ సృష్టి వినిర్మాణం చేసాడు. కాకపోతే మనమే ఆ సృష్టిని దుఃఖమయంగా మార్చుకొంటున్నాం.
భగవంతుని సృష్టి విలాసాన్ని చూడండి. సృష్టిలోని సమస్త శక్తిక్షేత్రాలను అజరేభిః స్కంభనేభిః సమానృచో- అక్షీణనమైన నిరంతర శక్తి ప్రసార స్థానాలుగా రచించాడు. చూచారా! సృష్ట్యాది నుండి సూర్యుడు ఒకే విధమైన ఉష్ణమూ మరియు కాంతులతో న్యూనాధిక్యం లేక ప్రకాశిస్తూ ఉన్నాడు. అట్లే సముద్రం, సూర్యుడు సదా సమద్ర జలాలను బాష్పరూపంగా మార్చిన సముద్రమింకదు. ప్రమాణం తరగదు. ఇక భూమి. అది సృష్ట్యాది నుండి భూమిపై పెరుగుతూ ఉన్న జీవరాశికి ఎడతెగక ఆహారాన్ని అందిస్తూనే ఉంది. ఒక్కనాడు కూడా తన పనిలో భూమి విఫలత చెందలేదు. ఎవడేని ఆకలితో మరణిస్తే అది నేల తల్లి పండక కాదు. అది అతని స్వయంకృతాపరాధమే. వాయువో!! జీవులన్నింటికి ప్రాణవాయువును సరిపడగ ప్రసరింపజేస్తూనే ఉంది. ఇలా ఎన్నియని గణించగలం? ఎంతటివారైనా గణించలేక ప్రకృతిలోని శక్తి స్థానాలన్ని కూడా నిర్నిరోధకమైన శక్త్ధిరకాలేనని విధిగా అంగీకరించక తప్పదు. అవి అజరాలూ అమరాలూ. ఆ విధంగా సృష్టి నిర్మాణం చేసిన దైవాన్ని వేదం ‘దేవానా మపసామపస్తమః’ అని ప్రశంసించింది. దేవతలందరిలో మహాకర్మనిష్ఠుడైన ఆ దైవం అకర్మణ్యతను ఇష్టపడతాడా? కాబట్టి మానవులారా! మీరూ మీ మీ కర్మలను చేయడంలో నిష్ఠ వహించండి. భగవత్కృపకు పాత్రులు కండి అని వేదోపదేశం.
భక్తులు - జ్ఞానులు
ఉభయాసో జాతవేదః స్యామ తే స్తోతారో అగ్నే సూరయశ్చ శర్మణి
వస్వో రాయః పురుశ్చంద్రస్య భూయసః ప్రజావతః స్వపత్యస్య శగ్ధి నః
భావం: ఓ జాతవేద! ఓ అగ్నీ! నిన్ను సన్నుతి చేసే భక్తులమూ మరియు జ్ఞానులమూ అయిన మేము నినే్న శరణు పొందుతున్నాం. మా ఉభయులకు నీవు ఆశ్రయమిచ్చేవాడవు. బ్రహ్మానందాన్ని అనుగ్రహించే వాడవు, మంచి సంతానమిచ్చేవాడవు మరియు మహాధనాధిపతులుగా చేయువాడవవుచున్నావు. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు