రాష్ట్రీయం

వైభవంగా స్వర్ణ రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, డిసెంబర్ 21: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం తిరుమలలో స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ స్వామి వారిని బంగారు రథంపై అర్చకస్వాములు ఉదయం 8 గంటలకు వేంచేపు చేసి పూజాదికాలు నిర్వహించారు. అనంతరం 9 గంటలకు భక్తులు గోవింద నామస్మరణల మధ్య మాడ వీధుల్లో శ్రీవారి రథం ముందుకు కదిలింది. స్వర్ణ రథంపై భానుని కిరణాలు ప్రసరిస్తుండగా బంగారు రథం దేదీప్యమానంగా ముందుకు కదిలింది. స్వర్ణరథాన్ని తిలకించాలనే ఉత్సాహంతో తూర్పు మాడ వీధుల్లో కొంతమంది భక్తులు అక్కడ ఉన్న ఇనుప నిచ్చెన ఎక్కారు. అదే సమయంలో నిచ్చెన పక్కకు వాలడంతో క్రిష్ణగిరి గంగసంద్రంకు చెందిన వెంకట స్వామి (55), పెద్దచిగురుపల్లికి చెందిన లక్ష్మయ్య (55), కాకినాడకు చెందిన తులసి (21) గాయపడ్డారు. వీరిని టిటిడి సిబ్బంది అశ్వని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.