రాష్ట్రీయం

స్వర్ణ బార్ లైసెన్స్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్యంలో ‘మిథనాల్’ కల్తీ అయినట్లు నిర్థారణ ఏ క్షణంలోనైనా విష్ణుసహా నిందితుల అరెస్టు

విజయవాడ, డిసెంబర్ 10: కల్తీ మద్యం కేసులో స్వర్ణ బార్, రెస్టారెంట్ లైసెన్స్‌ను రద్దుచేస్తూ ఎక్సైజ్‌శాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన నలుగురు లైసెన్స్‌దారులతోపాటు 9వ నిందితునిగా ఉన్న నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణును ఏ క్షణాన్నయినా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అసలు నగరపాలక సంస్థనుంచి ట్రేడ్ అండ్ ఓ లైసెన్స్ లేకుండానే బార్‌లో మద్యం వ్యాపారం సాగిస్తుండటంపై కూడా అధికారులు విచారిస్తున్నారు. ప్రమాదకరమైన మిథనాల్‌ను మద్యంలో కల్తీ చేసినట్టుగా అధికారులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. అలాగే బాధితులను పలు విధాలుగా పరీక్షించిన వైద్యులు సైతం వారి శరీరంలో మిథనాల్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇక గుంటూరులోని ప్రాంతీయ ల్యాబ్, హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి అధికారికంగా నివేదికలు అందాల్సి ఉన్నాయి.
మరోవైపు కృష్ణా జిల్లాలోని 14 ఫార్మా కంపెనీల్లో కూడా మిథనాల్ వినియోగం, నిల్వలపై తనిఖీలు జరిగాయి. సాధారణంగా మద్యంలో మొలాసిస్, మొక్కజొన్న ద్వారా ఇథైల్ స్పిరిట్‌ను తయారుచేసి తర్వాత అందులో స్పిరిట్ గాఢతను తగ్గిస్తారు. మద్యం తయారీలో 42శాతం మించకుండా చూస్తారు. పెట్రోలియం ఉత్పత్తి అయిన మిథనాల్‌ను సాధారణంగా మందుల తయారీ ఔషధాలలోను, రసాయనాలు కరిగించేందుకు, పారిశ్రామిక సంస్థల్లో వినియోగిస్తారు. దీన్ని నీటితోపాటు మద్యంలో కలిపితే వచ్చే మత్తువల్ల కల్తీ జరిగిందని సాధారణంగా ఎవరూ గుర్తించరు. గుజరాత్ నుంచి ప్రతినెలా రాష్ట్రానికి 40 లక్షల లీటర్ల మిథనాల్ దిగుమతి అవుతున్నట్లు తెలుస్తోంది. 1973లో హైదరాబాద్ అల్వాల్‌లో జరిగిన కల్తీ మద్యం కేసులో మిథనాల్‌ను మత్తు పదార్థంగా గుర్తించి అబ్కారీశాఖ చట్టం సెక్షన్ 21 క్లాజ్‌లో చేర్చారు. దీంతో దీని అవసరం కల్గిన పరిశ్రమల యజమానులు అబ్కారీ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంది. కొన్ని ఒత్తిళ్లపై 1991లో దీన్ని అబ్కారీ శాఖ నుంచి తొలగించారు. 1993లో మైదుకూరు కల్తీ మద్యం ఘటన తర్వాత దీన్ని మళ్లీ అబ్కారీశాఖ పరిధిలోకి చేర్చారు. వీటి వినియోగం తీరును అబ్కారీ శాఖ గుర్తించాల్సి ఉంది. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించాల్సి ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో పెద్దగా ఎవరూ పట్టించుకోకపోవటం వల్ల మద్యం వ్యాపారులకు అందుబాటులోకి వచ్చింది.
ఇదిలా ఉండగా ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తక్షణం రాజీనామా చేయాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక ఎక్సైజ్ డిసి కార్యాలయం ముట్టడి జరగ్గా పోలీసులు నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌తో పాటు 100 మందిని అరెస్ట్ చేశారు.