మెయన్ ఫీచర్

స్వేచ్ఛకు నిర్వచనం ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘స్వేచ్ఛ’, ‘అసమ్మతి హక్కు’, ‘నేరం చేసే హక్కు, ‘దేనికీ కట్టుబడని భావ ప్రకటన స్వేచ్ఛ’, ‘జాతీయత వర్సెస్ జాతి వ్యతిరేకత’ వంటి పదాలు లేదా పద బంధనాలు అందరినోట వినిపిస్తున్నాయి. ఇవి గణనీయ స్థాయిలో వామపక్ష లేదా అతివాద వామపక్ష శక్తులకు రాజకీయ ఊతాన్నిచ్చాయి. అలాగే విద్యా సంస్థల్లో తరిగిపోతున్న వామపక్ష భావజాలానికి ప్రాణవాయువును అందించాయి. ఆవిధంగా ఇవి తిరిగి సంఘటితం కావడానికి రాజకీయ చర్చాదిశను మార్చడానికి దోహదం చేశాయి. ము ఖ్యంగా దేశ రాజకీయాల్లో ప్రభావం చూపలేని దుస్థితిలో ఉన్న వీరికి పునఃసమీకరణకు దారి ఏర్పడింది. ఈ పరిణామం వల్ల, ఇప్పుడు ఎవరైనా ‘దేశభక్తి’ అనే పదాన్ని ఉపయోగిస్తే అవహేళన చేసే పరిస్థితి దాపురించింది.
ఆసక్తి కలిగించే అంశమేమంటే ‘స్వేచ్ఛ’ అంటూ నినాదాలు చేసింది బయటి శక్తులే కావచ్చు, కానీ ఇప్పటి వరకు వీటిని ఎవరు చేశారన్నది గుర్తించకపోవడం విచిత్రం. ఈ శక్తులకు భారత్ నుంచి ‘స్వేచ్ఛ’కావాలి, అది భారత్‌ను ముక్కలు చేసైనా సరే! అటువంటి నినాదాలు ప్రస్తుతం బహిరంగంగా ఎక్కడా వినిపించడం లేదు! ఇందుకు మీడియాకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలోని ‘అజాదీ’ స్థానాన్ని ఇప్పుడు ‘కుల వ్యవస్థ నుంచి స్వేచ్ఛ’ కావాలి అనే నినాదం ఆక్రమించడంలో వీరి పాత్ర కీలకం మరి! ఇక ‘పేదరికం నుంచి స్వేచ్ఛ’, ‘మనువాది బ్రాహ్మణిజం నుంచి స్వేచ్ఛ’ వంటి సరికొత్త నినాదాలు ప్రచారమవుతున్నాయి. అంటే రాజకీయంగా చూసినప్పుడు ఇది గత నినాదాలను సరిదిద్ది, సక్రమ రూపాన్ని కల్పించినట్టు మనం భావించాలి. ‘అసమ్మతి హక్కు’, ‘దేశానికి వ్యతిరేకంగా నినాదాలివ్వడం లేదా ప్రసంగించే హక్కు’ తమకు ఉన్నదనే స్థాయికి ఈ ఉదారవాదులు, లెఫ్ట్ మేధావుల పైత్యం చేరుకుంది. మరి ‘రాజ్యాంగ దేశభక్తి’ అంటూ ఎలుగెత్తి చాటుతున్న వారు, అదే రాజ్యాంగ చట్టంలోని 19(2) అధికరణను మరచిపోతున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛపై ఈ అధికరణం కొన్ని పరిమితులు విధించింది. ప్రస్తుతం ‘జాతీయత’ను ఒక ‘చెత్త’విషయంగా పరిగణిస్తున్న వామపక్షాలు, గత యుపిఎ ప్రభుత్వం పెంచి పోషించిన కొందరు జర్నలిస్టులు..తమను తాము ‘జాతి వ్యతిరేకులుగా’ పేర్కొంటూ ప్రభుత్వంపై లేఖాస్త్రాలను సంధిస్తున్నారు. రాజద్రోహ ఆరోపణలపై అరెస్టయిన జెఎన్‌యుఎస్‌యు నాయకుడు కన్హయ్య కుమార్‌ను బెయిల్‌పై విడుదల చేశారు. ప్రస్తుతం అతగాడు జెఎన్‌యులో ఒక హీరో అయిపోయాడు. మార్చి 3న బెయిల్‌పై విడుదలైన కన్హయ్యకుమార్, అదే రోజు అర్థరాత్రి జెఎన్‌యులో చేసిన ప్రసంగాన్ని ఏకంగా, దేశ స్వాతంత్య్రం వచ్చిన అర్థరాత్రి తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన ప్రసంగంతో పోలుస్తూ ఒక జర్నలిస్టు ట్వీట్ చేసే స్థాయికి ‘ఉదార పైత్యం’ ముదిరిపోయింది. కన్హయ్య కుమార్‌కు ‘్భరత్ నుంచి స్వేచ్ఛ కాదట’, ‘్భరత్‌లోమరింత స్వేచ్ఛ’ కావాట! అతని ప్రసంగంలో గుర్తించాల్సిన రెండు ముఖ్య అంశాలున్నాయి. మొదటిది మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 69 ఏళ్లయిందన్న సంగతి అతను మరచిపోయాడు. ఇక రెండవది, ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే స్వేచ్ఛ ఎట్లాగూ ఉన్నదన్న సంగతీ అతనికి గుర్తులేదు. తాను ఏ పార్టీ సిద్ధాంతం పట్ల భక్తిప్రపత్తులతో ఉన్నాడో, ఆ పార్టీ.. స్వాతంత్య్ర సమరయోధులకంటే, వలసపాలకుల వైపే మొగ్గు చూపిందన్న సత్యాన్ని అతను గు ర్తించాలి. అటువంటి పార్టీ పట్ల ఇంకా అతను భ్రమల్లోనే మునిగి తేలుతున్నాడు.
ఈ పరిస్థితుల్లో, ముఖ్యంగా ఒక ప్రత్యేక రాజకీయ కథనం ప్రజల మనసుల్లో ప్రగాఢంగా నాటుకుపోయి ఉన్న తరుణంలో, కన్హయ్యకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు బహుశా మన ఉదారవాదులకు, మీడియాకు పెద్ద షాక్ ఇచ్చి ఉండవచ్చు. హైకోర్టు వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి.
* నీకు (కన్హయ్యకుమార్) ఒక రాజకీయ పార్టీతో లేదా సిద్ధాంతంతో అనుబంధం ఉండి ఉండవచ్చు. ఆవిధంగా అనుసరించే హక్కు నీకు ఉంది. కానీ అది రాజ్యాంగ చట్రానికి లోబడి మాత్రమే కొనసాగాలి. భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ ఒక సజీవ సాక్ష్యం.
* అనుబంధ సాయుధ దళాలు మన సరిహద్దులను పరిరక్షిస్తున్నాయి కాబట్టే నువ్వు స్వాతంత్య్రం అనుభవిస్తున్నావన్న సత్యాన్ని మరవొద్దు.
* భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రతి పౌరుడికి ఉంది. కానీ అది రాజ్యాంగంలోని 19(2) అధికరణ నిర్దేశించిన పరిమితులకు లోబడి మాత్రమే ఉండాలి.
* నిరసన సందర్భంగా తాము చేసిన నినాదాల విషయంలో విద్యార్థులు ఆత్మావలోకనం చేసుకోవాలి. ముఖ్యంగా అఫ్జల్ గురు, మక్బూల్ భట్‌ల ఫోటోలను చేతబట్టి నినాదాలు చేసిన విద్యార్థుల ఫోటోలు రికార్డుల్లో నమోదై ఉన్నాయి.
* అఫ్జల్ గురు, మక్బూల్ భట్ చిత్రాలను తమ హృదయాలకు దగ్గరగా ఉంచుకొని బలిదానం చేసినవారిగా కీర్తిస్తూ నినాదాలు చేసిన వారు, సియాచిన్ వాతావరణాన్ని గంట సేపు కూడా తట్టుకోలేరు.
కన్హయ్య కుమార్‌కు మధ్యంతర బెయిల్‌ను ఢిల్లీ హైకోర్టు మంజూరు చేసినప్పటికీ..అఫ్జల్ గురు, మక్బూల్ భట్‌లు ‘బలిదానం’ ఇచ్చారంటున్న వర్తమాన రాజకీయ పార్టీల వ్యవహార శైలి పట్ల న్యాయవ్యవస్థలో నెలకొని ఉన్న తీవ్రమైన క్షోభ, బాధ హైకోర్టు వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపించింది. వక్రించిన మానసిక స్థితిలో ఫిబ్రవరి 9న చేసిన దేశ వ్యతిరేక, అఫ్జల్ గురు, మక్బూల్ భట్‌లకు అనుకూల నినాదాలు చట్టం దృష్టిలో నేరంగా నిరూపితమయ్యే పరిస్థితి నుండి తప్పించడానికి వీరు కేవలం ఫిబ్రవరి 11వ తేదీన కన్హయ్య ‘స్వేచ్చ’ కావాలంటూ చేస్తున్న నినాదాలను మాత్రమే బయటకు తెస్తున్నారు. సంఘటనకు సంబంధించి వెలువడిన మొత్తం ఏడు వీడియోల్లో కేవలం రెండు మాత్రమే కావాలని మార్పు చేసినవిగా తేలింది. కానీ మీడియా మాత్రం అన్ని వీడియోలూ కావాలనే మార్పు చేశారని, నిజానికి కన్హయ్య ఉత్తమ దేశభక్తుడంటూ కితాబివ్వడం మొదలుపెట్టింది. దేశ వ్యతిరేక నినాదాలు చేస్తున్నప్పుడు జెఎన్‌యుఎస్‌యు అధ్యక్షుడిగా కన్నయ్య వౌన ప్రేక్షకుడిగా మాత్రమే ఉండిపోయాడని మీడియా కథనం. మరి దేశ వ్యతిరేక శక్తులను నివారించడానికి కన్హయ్య కనీసం ‘చిటికెన వేలునైనా’ అట్డుపెట్టాడా?
ఇక సంప్రదాయ శక్తులకు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలీవిధంగా ఉన్నాయి. ‘వీరు తమ అభిప్రాయాలను పౌరుల నెత్తిన రుద్దుతున్నారు. వారి దృష్టిలో ఒకే అభిప్రాయం ఉండాలి. అదికూడా వారి అభిప్రాయం మాత్రమే!’ ఇక హైకోర్టు వ్యాఖ్యలపై లిబరల్ మీడియా ఏవిధంగా స్పందించిందో చూద్దాం. తమ ప్రవర్తనలో దేశద్రోహం ఇమిడి ఉన్నప్పటికీ కోర్టు తమ నిరసన హక్కును హైకోర్టు సమర్థిస్తుందని లిబరల్స్ అంచనా వేశారు. కానీ కోర్టు అభిప్రాయం తమ అంచనాలకు భిన్నంగా వెలువడటంతో, హైకోర్టుపై దుష్ప్రచారం మొదలుపెట్టారు. చెన్నై నుంచి వెలువడే వామపక్ష భావాలు కలిగిన ఆంగ్ల దినపత్రిక తన సంపాదకీయంలో, హైకోర్టు వ్యాఖ్యలు ‘‘సరికొత్తగా’’ ఉన్నట్లు పేర్కొంది. ఇదే సంపాదకీయంలో ఇంకా..‘‘దేశ వ్యతిరేక కార్యకలపాల్లో పాల్గొనబోనన్న హామీ పత్రాన్ని సమర్పించాలన్న కోర్టు నిబంధన, చాలా అస్పష్టంగా ఉంది. ప్రజాస్వామ్యం లో కోర్టు కార్యనిర్వాహక అధికారాల్లో కలుగజేసుకోకుండా సంయమనం పాటించాలి. సంకుచిత జాతీయ భావనకు వ్యతిరేకంగా, క్యాంపస్‌లో చోటు చేసుకునే రాడికల్ రాజకీయాలు విభజనకు దారితీస్తాయన్న ఉద్దేశంతో కోర్టు చూడరాదు.’’ అంటే ఒక సమస్యపై కొందరు వ్యక్తులు చేస్తున్న ప్రచారానికి, భిన్నమైన దృక్కోణంతో కోర్టులు స్పందిస్తే అది ‘పక్షపాతంతో కూడిన తీర్పు’ అన్నమాట! సంప్రదాయ వాదులను వీరు విమర్శిస్తున్నారనడానికి ఇది ఏ రకంగా భిన్నం?
ఈ సంపాదకీయంలో ఇంకా ఇలా పేర్కొన్నారు: ‘‘నిజంగా బెయిల్ ఆదేశం విచిత్రంగా ఉంది. కోర్టు చాలా అంశాల్లో ప్రాసిక్యూషన్ వాదనను ఆమోదించింది. జెఎన్‌యులో నిర్వహించిన కార్యక్రమం దేశ వ్యతిరేకమంటూ ముగించింది. కానీ దేశద్రోహ ఆరోపణలను నిరూపించడానికి అవసరమైన సాక్ష్యాలు ఉన్నాయా? లేవా? అన్న అంశాన్ని మాత్రం స్పష్టం చేయలేదు.’’ అంటే వీరి వాదన ప్రకారం కోర్టు ఎప్పుడూ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే నిలబడాలి. ప్రాసిక్యూషన్ వాదనను నిర్ద్వంద్వంగా ఖండించాలి! అనుకున్నట్టుగానే కన్హయ్య లెఫ్ట్ పార్టీల చేతిలో రాజకీయ పావుగా మారిపోయాడు. రాబోయే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో వామపక్షాల తరపున ప్రచారం చేస్తాడని ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. అంతేకాదు దేశంలో అత్యున్నత పదవికి గట్టి పోటీదారుగా కూడా కన్హయ్యను చూపే రాజకీయ వాతావరణం సృష్టించే అవకాశాలు కూడా లేకపోలేదు మరి! అయతే తాను ఆవిధంగా ప్రచారం చేయబో నని కన్హయ్య ప్రకటించడం లెఫ్ట్ అంచనాలపై నీళ్లు చల్లినట్లయంది.
29 ఏళ్ల వయసున్న కన్హయ్యకు, జెఎన్‌యు విద్యార్థిగా క్యాంపస్‌లో అసమ్మతిని వ్యక్తం చేయడం, చర్చలు జరపడం, సదస్సులు నిర్వహించడం వంటి పలు ప్రయోజనాలను అనుభవించే హక్కు కచ్చితంగా ఉన్నది. కానీ వాక్‌స్వాతంత్య్రమంటే ఒక విద్యార్థి ఎన్నికల రాజకీయాల్లో పాల్గొని, ప్రచారం చేయడం వంటి కార్యకలాపాలు నిర్వహించడమనా అర్థం? ఇంకా జ్యూరీ అసలు కేసుకు ఆవలనే ఉన్నదని చెప్పాలి. న్యాయవాద వృత్తిని మరింత స్వచ్ఛతరం చేసే అంశంలో, గతంలో సుప్రీకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలను మనం వినాలి. ముఖ్యంగా సంఘ వ్యతిరేక శక్తులు న్యాయవాద వృత్తిలోకి రాకుండా నిరోధించాలని సుప్రీంకోర్టు కోరింది. కోర్టులో తమ వాదనలు వినపించడానికి బదులు,‘‘రాళ్లు రువ్వ డం, దూషించడం, కొట్లాకు దిగడం, ఆందోళన చేసే వారిని’’ ముఖ్యంగా ఈ వృత్తిలోకి రాకుండా నిరోధించాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. దీనిపై ప్రస్తుత తర్కాన్ని మరికొంత ముందుకు తీసుకెళితే..విద్యా సంస్థల్లో స్వేచ్ఛ, అసమ్మతి వ్యక్తం చేసే హక్కు వంటి వాటిని కూడా సుప్రీంకోర్టు వ్యతిరేకిస్తున్నదనేగా అర్థం! మరి ఇది జెఎన్‌యులో, విద్యాభ్యాసం/పరిశోధనలు వంటి కార్యకలాపాల్లో తలమునకలుగా ఉండటానికి బదులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడం, విభజన రాజకీయాల్లో పాల్గొంటున్న కొన్ని విద్యార్థి మూకలకు ఇది వర్తించదా?

-ఎస్‌ఆర్ రామానుజన్