రాష్ట్రీయం

లొంగిపోయన మావో సానుభూతిపరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాజీ సర్పంచ్‌ను హతమార్చిన నక్సల్స్ * సుక్మా ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి
చింతూరు / సీలేరు / భద్రాచలం, మార్చి 13: ఒడిశాలో ఆదివారం 57 మంది మావోయిస్టు పార్టీ సానుభూతిపరులు పోలీసులకు లొంగిపోయారు. మల్కన్‌గిరి జిల్లా కలిమెల పోలీస్ స్టేషన్ పరిధిలోని పోటేరు అవుట్ పోస్టులో తంగగూడ గ్రామానికి చెందిన వీరంతా లొంగిపోయారు. వీరిలో 11 మంది మిలీషియా సభ్యులు, ఇద్దరు గ్రామ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. మరోవైపు ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు మళ్లీ హింసకు పాల్పడ్డారు. పోలీస్ ఇన్‌ఫార్మర్ అన్న నెపంతో మాజీ సర్పంచ్ భూమియాను ఆదివారం హతమార్చారు. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా పొయితర్‌గూడ మాజీ సర్పంచ్ సబర్దాన్ భూమియా(38) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా బైపర్‌గూడ, మంత్రాదింబియా రహదారి మధ్యలో మావోలు అడ్డుకుని హత్య చేశారు. పోలీసు ఇన్‌ఫార్మర్‌గా వ్యహరిస్తున్న భూమియా పద్దతి మార్చుకోవాలని పలుమాల్లు హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో చంపినట్లు మావోయిస్టులు ప్రకటించారు. భూమియా హత్యతో కోరాపుట్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఇదిలావుండగా చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా జేగురుగొండ అటవీ ప్రాంతంలో ఆదివారం మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బస్తర్ ఐజీ కల్లూరి, సుక్మా ఏఎస్పీ సంతోష్ సింగ్ అందించిన వివరాల ప్రకారం.. డిఎస్పీ విద్యారాజు ఆధ్వర్యంలో సిఆర్‌పిఎఫ్ కోబ్రా బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. వీరి రాకను గమనించిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఎదురుకాల్పులు జరపడంతో మావోయిస్టులు పారిపోయారు. నక్సల్ మృతదేహంతో పాటు విప్లవ సాహిత్యం, ఆయుధాలు లభ్యమయ్యాయని వారు వివరించారు.