క్రీడాభూమి

తొలి శతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ: భారత ఆటగాడు మనీష్ పాండే, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ మిచెల్ మార్ష్ శనివారం తమతమ కెరీర్‌లలో మొట్టమొదటి వనే్డ ఇంటర్నేషనల్ శతకాలను నమోదు చేశారు. ఇందులో వింత లేకపోయినప్పటికీ, వారి మధ్య వైదుధ్యమే ఆసక్తిని కలిగిస్తున్నది. మిచెల్ మార్ష్‌కు కెరీర్‌లో ఇది 27వ వనే్డ. అతను సెంచరీ సాధించడానికి ఇన్ని మ్యాచ్‌లు తీసుకుంటే, మనీష్ పాండే తాను ఆడిన నాలుగో వనే్డ (మూడో ఇన్నింగ్స్)లోనే శతకాన్ని అందుకోవడం విశేషం. మిడిల్ ఆర్డర్‌లో స్థిరమైన స్థానాన్ని సంపాదించడానికి విశేషంగా శ్రమిస్తున్న మనీష్ పాండే ఈ శతకంతో సెలక్టర్లకు సవాళ్లు విసిరాడు. టీమిండియాకు తన అవసరం ఉందని నిరూపించాడు.

స్కోరుబోర్డు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఆరోన్ ఫించ్ ఎల్‌బి ఇశాంత్ శర్మ 6, డేవిడ్ వార్నర్ సి రవీంద్ర జడేజా బి ఇశాంత్ శర్మ 122, స్టీవెన్ స్మిత్ సి రోహిత్ శర్మ బి జస్‌ప్రీత్ బుమ్రా 28, జార్జి బెయిలీ సి ఇశాంత్ శర్మ బి రిషీ ధావన్ 6, షాన్ మార్ష్ రనౌట్ 7, మిచెల్ మార్ష్ 102 నాటౌట్, మాథ్యూ వేడ్ సి మహేంద్ర సింగ్ ధోనీ బి ఉమేష్ యాదవ్ 36, జేమ్స్ ఫాల్క్‌నెర్ బి జస్‌ప్రీత్ బుమ్రా 1, జాన్ హాస్టింగ్స్ 2 నాటౌట్, మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 330.
వికెట్ల పతనం: 1-6, 2-64, 3-78, 4-117, 5-235, 6-320, 7-323.
బౌలింగ్: ఇశాంత్ శర్మ 10-0-60-2, ఉమేష్ యాదవ్ 8-0-82-1, జస్‌ప్రీత్ బుమ్రా 10-0-40-2, రిషీ ధావన్ 10-0-74-1, రవీందర్ జడేజా 10-0-46-0, గుర్‌కీరత్ సింగ్ మాన్ 2-0-17-0.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ సి మాథ్యూ వేడ్ బి జాన్ హాస్టింగ్స్ 99, శిఖర్ ధావన్ సి షాన్ మార్ష్ బి జాన్ హాస్టింగ్స్ 78, విరాట్ కోహ్లీ సి మాథ్యూ వేడ్ బి జాన్ హాస్టింగ్స్ 8, మనీష్ పాండే 104 నాటౌట్, మహేంద్ర సింగ్ ధోనీ సి డేవిడ్ వార్నర్ బి మిచెల్ మార్ష్ 34, గుర్‌కీరత్ సింగ్ మాన్ 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 8, మొత్తం (49.4 ఓవర్లలో 4 వికెట్లకు) 331.
వికెట్ల పతనం: 1-123, 2-134, 3-231, 4-325.
బౌలింగ్: జాన్ హాస్టింగ్స్ 10-1-61-3, స్కాట్ బోలాండ్ 10-0-58-0, మిచెల్ మార్ష్ 9.4-0-77-1, జేమ్స్ ఫాల్క్‌నెర్ 10-0-54-0, నాథన్ లియాన్ 8-0-58-0, స్టీవెన్ స్మిత్ 2-0-20-0.