జాతీయ వార్తలు

తప్పుడు సమాచారమిచ్చిన స్మృతి ఇరానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 21: అత్యహత్య చేసుకున్న దళిత విద్యార్థి రోహిత్ విషయంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ తప్పుడు సమాచారం ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ స్మృతీ ఇరానీ మూడు అబద్దాలు చెప్పారని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒకవైపు బాబాసాహెబ్ అంబేద్కర్‌ను ప్రశంసిస్తుంటే మరోవైపు దళిత, బడుగు, బలహీన వర్గాలవారిపై దాడులు జరుగుతున్నాయి, ఎన్‌డిఏ ప్రభుత్వం ద్వంద్వనీతికి ఇది నిదర్శనం కాదా అని ఆయన నిలదీశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రోక్టీరియల్ బోర్డు నివేదిక విషయంలో స్మృతి ఇరానీ చెప్పిన విషయం నూటికి నూరుపాళ్లు అబద్దమని సుర్జేవాలా చెప్పారు. బోర్టు ఏబివిపి నాయకులతో మాట్లాడిన తరువాతనే ఐదుగురు విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ను తొలగించాలనే సిఫారసు చేసిందని ఆయన చెప్పారు. ఐదుగురు దళిత విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ను బలపరిచిన సబ్‌కమిటీకి ఒక దళిత ప్రొఫసర్ నాయకత్వం వహించారంటూ స్మృతీ ఇరానీ చేసిన ప్రకటన రెండో అబద్దమని ఆయన చెప్పారు. విశ్వవిద్యాలయం ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థుల ఫోరం గతరాత్రే స్మృతి ఇరానీ ప్రకటనను ఖండించిందని సుర్జేవాలా తెలిపారు. హాస్టల్ వార్డెన్ కూడా దళితుడేనంటూ స్మృతి ఇరానీ చేసిన ప్రకటన కూడా పచ్చి అబద్దమని ఆయన ప్రకటించారు. స్మృతీ ఇరానీ బుధవారం విలేఖరుల సమావేశంలో ప్రొఫెసర్ల కులాన్ని ప్రస్తావించటాన్ని సుర్జేవాలా తీవ్రంగా ఖండించారు.
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఇలా వ్యవహరించటాన్ని క్షమించలేమని ఆయన స్పష్టం చేశారు. రోహిత్ ఆత్మహత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ స్మృతీ ఇరానీ, విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ అప్పారావు నిన్న చేసిన ప్రకటనలను కాంగ్రెస్ ఖండించింది. స్మృతీ ఇరానీ తప్పుడు సమాచారం ఇవ్వటం ద్వారా దేశాన్ని తప్పుదోవ పట్టించారని, ఆమెను, బండారు దత్తాత్రేయను వెంటనే మంత్రివర్గం నుండి తొలగించాలని సుర్జేవాలా డిమాండ్ చేశారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ది దళిత వ్యతిరేక మనస్తత్వమని ఆయన విమర్శించారు.