రాష్ట్రీయం

తెలుగు భాషకు గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పద్మభూషణ్ పురస్కారం’పై యార్లగడ్డ

విశాఖపట్నం, జనవరి 25: తనకు పద్మభూషణ్ పురస్కారం రావటం తెలుగు భాషకు దక్కిన గౌరవమని ప్రముఖ సాహితీవేత్త, మాజీ ఎంపీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ పురస్కారాన్ని యార్లగడ్డకు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ, ఇది తనకు వ్యక్తిగతంగా ఇస్తున్న పురస్కారం కాదని, తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు చేస్తున్న కృషిలో తనకు సహకరించిన, సహకరిస్తున్న వారందరికీ దక్కిన గౌరవమని ఆన్నారు. ఐక్కరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా గుర్తించేలా కృషి చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషకు మరింత ప్రాధాన్యత ఇచ్చేలా చూస్తానని లక్ష్మీప్రసాద్ తెలిపారు.