రాష్ట్రీయం

ట్రెజరీ వెబ్‌సైట్‌లో సిపిఎస్ వివరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: ఆంధ్రప్రదేశ్‌లో నూతన పెన్షన్ పథకం (సిపిఎస్) వర్తించు ఉద్యోగ, ఉపాధ్యాయుల ఖాతాలకు సంబంధించిన బ్యాలెన్స్ షీట్ వివరాలు త్వరలో ఖజానా శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టియు) తెలిపింది. ట్రెజరీ డైరక్టర్ కె.కనకవల్లిని కలిసి సిపిఎస్ ఖాతాలకు ఎప్పటికప్పుడు పైకాన్ని జమచేసే వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచడంతో పాటు హైస్కూల్ హెడ్‌మాస్టర్లు, ఎంఇఓలకే జమకాని పైకం ఆన్‌లైన్ ద్వారా పరిష్కరించే వెసులుబాటు కల్పించాలని కోరగా పది రోజుల్లోనే సౌలభ్యం కల్పించడానికి అంగీకరించారని ఎస్‌టియు అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి జోసెఫ్ సుధీర్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు.