జాతీయ వార్తలు

త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి మొదటి వారంలో మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించే అవకాశాలున్నాయి. అమిత్ షాను బిజెపి పూర్తి స్థాయి అధ్యక్షుడుగా ఎన్నుకున్న తరువాత మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలని మోదీ ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నరేంద్ర మోదీ శనివారం రాత్రి బిజెపి ప్రస్తుత కార్యవర్గ సభ్యులకు విందు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అలాగే మంత్రివర్గ సహచరులకు ఈనెల 27న తన నివాసంలో మోదీ విందు ఇస్తున్నారు. కేబినెట్‌ను పునర్‌వ్యవస్థీకరించే ముందు ప్రస్తుత మంత్రులందరితో ఒకసారి మాట్లాడాలనే ఆలోచనతోనే ఆయన రిపబ్లిక్ డే మరునాడు తన నివాసంలో వారందరితో విందు సమావేశం ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. ఈ విందు సమావేశంలో మంత్రుల రాజీనామాలను తీసుకున్నా ఆశ్చర్యపోకూడదని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. కాగా అమిత్ షా ఆదివారం బిజెపి పూర్తి స్థాయి అధ్యక్షుడుగా నియమితుడవుతారని అంటున్నారు. అమిత్ షా పూర్తి స్థాయి అధ్యక్షుడుగా ఎన్నికైన వెంటనే పార్టీ జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తారు. కాగా మంత్రి పదవులు కోల్పోయే వారికి పార్టీ పదవుల్లో నియమించే అవకాశాలున్నాయని తెలిసింది. అయితే ఎంత మంది మంత్రులకు మోదీ ఉద్వాసన కల్పించాలనుకుంటున్నారనేది బయటకు రావటం లేదు. పలువురు మంత్రులు సమర్థవంతంగా పనిచేయటం లేదని మోదీ చాలా కాలం నుండి భావిస్తున్నారు. సమర్థవంతంగా పనిచేయని మంత్రులతో పాటు పలుమార్లు వివాదాల్లో ఇరుక్కున్న మంత్రులకు కూడా ఉద్వాసన తప్పదని బిజెపి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కొందరు సీనియర్ మంత్రుల పనితీరు విషయంలో కూడా మోదీ అసంతృప్తితో ఉన్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి ఒకరిద్దరు మంత్రుల శాఖలను మార్చవచ్చునని చెబుతున్నారు. అయితే ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ శాఖల మంత్రులు యథాతథంగా కొనసాగుతారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వివాదాల్లో ఇరుక్కున్న న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడను మంత్రివర్గం నుంచి తొలగించి పార్టీ బాధ్యతలు అప్పగించవచ్చునని అంటున్నారు. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు విషయంలో కూడా మోదీ ఎంతో అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌లకు ఉద్వాసన తప్పదంటున్నారు. గిరిరాజ్ సింగ్ అత్యంత వివాదాస్పద ప్రకటనలు చేయటంలో దిట్ట అనేది అందరికి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలకు మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణంలో కొంత ప్రాధాన్యత ఇవ్వవచ్చునని భావిస్తున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సంవత్సరం జరుగనున్నాయి.