రాష్ట్రీయం

తల్లులు రాకముందే తరలివస్తున్న భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవిందరావుపేట, ఫిబ్రవరి 14: వరంగల్ జిల్లాలో మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లుల రాకకు ముందు నుండి భక్తులు భారీగా మేడారం తరలివస్తుండగా ఆదివారం ఈ సంఖ్య మరింత భారీగా పెరిగింది. ఆదివారం సుమారు అయిదు లక్షల మంది భక్తులు మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకున్నట్టు సమాచారం. వేలాది ప్రయివేటు వాహానాలతో పాటు ఆర్టీసీ బస్సులలో భక్తులు ఆదివారం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిక్కిరిసి పోయాయి. చింతల్ క్రాస్ నుండి నార్లాపూర్, కొత్తూరు, రెడ్డిగూడెం, మేడారం అంతా భక్తజనంతో ఇప్పటికే నిండిపోయాయి. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసిన భక్తులు తల్లుల దర్శనం కోసం క్యూలైన్లో బారులు తీరారు. తల్లుల దర్శనం కోసం రెండు గంటలపాటు క్యూలైన్లో భక్తులు వేచి ఉండాల్సి వచ్చింది. గద్దెల ప్రాంగణం అంతా భక్తులతో కిక్కిరిసి పోగా గద్దెలపై బంగారం (బెల్లం) వేసేందుకు భక్తులు ఆరాట పండటం కనిపించింది. అంతేకాక అమ్మల ప్రసాదాన్ని తీసుకునేందుకు భక్తులు తోపులాడకోవాల్సి వచ్చింది. పిల్లా పాపలతో, కుటుంబసమేతంగా వచ్చిన భక్తులు అమ్మల దర్శనం కోసం ఆరాటపడ్డారు. చిన్నపిల్లలతో, ముసలివారితో వచ్చిన వారు క్యూలైన్లో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే వృద్ధులకు, చిన్నపిల్లలకు ప్రత్యేక క్యూలైన్ ఎర్పాటు చేయాలని భక్తులు అధికారులను వేడుకుంటున్నారు.