జాతీయ వార్తలు

థరూర్‌ను మరోసారి ప్రశ్నించిన సిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సునందా పుష్కర్ మృతికి సంబంధించి ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆమె భర్త, కాంగ్రెస్ ఎంపి శశిథరూర్‌ను మరోసారి ప్రశ్నించిందని, అవసరమైతే ఆయనను మరోసారి కూడా పిలిపిస్తామని ఢిల్లీ పోలీసు కమిషనర్ బిఎస్ బస్సీ చెప్పారు. కాగా, కేసు దర్యాప్తు సరయిన దిశలోనే సాగుతోందని, వీలయినంత త్వరలో ముగింపు దశకు తీసుకెళ్తామని తాము అనుకుంటున్నట్లు ఆయన విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఢిల్లీలోని వసంత్ విహార్ పోలీసు స్టేషన్ ఆవరణలోని యాంటీ ఆటో థెఫ్ట్ స్క్వాడ్ కార్యాలయంలో థరూర్‌ను సిట్ బృందం శనివారం దాదాపు అయిదు గంటల పాటు ప్రశ్నించినట్లు పోలీసు వర్గాలు తెలియజేశాయి. ఏడాది క్రితం థరూర్‌ను సిట్ బృందం మూడుసార్లు ప్రశ్నించింది కూడా. శశిథరూర్‌నుంచి కొన్ని వివరణలు కావలసి ఉండిందని, ఆ వివరణలు తీసుకోవడం జరిగిందని బస్సీ చెప్పారు. మరిన్ని వివరణలు అవసరమని సిట్ భావిస్తే థరూర్‌ను మరోసారి కూడా పిలిపించవచ్చని కూడా ఆయన చెప్పారు. వీలయినంత త్వరగా ఈ కేసును ముగింపునకు తీసుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నారని కూడా ఆయన చెప్పారు.
సునంద కడుపులోని పదార్థాల శాంపిల్స్‌ను, ఇతర కీలక సాక్ష్యాధారాలను విశే్లషణకోసం పోలీసులు వాటిని అమెరికాలోని ఎఫ్‌బిఐ లేబరేటరీకి పంపించిన విషయం తెలిసిందే. వీటిపై ఎఫ్‌బిఐ పంపిన నివేదికపై ఎయిమ్స్ మెడికల్ బోర్డు అభిప్రాయాన్ని కోరిన నేపథ్యంలో థరూర్‌ను సిట్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సునంద కడుపులో కనిపించిన అల్‌ప్రాక్స్, అలాగే ఆమె మృతికి దారితీసిన విషప్రయోగానికి కారణమైన లోడికైన్ మందులు ఎక్కడినుంచి వచ్చాయనే దానికి సంబంధించి ప్రధానంగా సిట్ బృందం థరూర్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సునంద మృతివెనుక ఎలాంటి కుట్రా లేదని థరూర్ ఇప్పటివరకు వాదిస్తున్నారు. 2014 జనవరి 17న దక్షిణ ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్ గదిలో సునందా పుష్కర్ చనిపోయి కనిపించిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఏడాది తర్వాత ఆమెది ‘అసహజ మరణం’గా పరిగణించిన ఢిల్లీ పోలీసులు ఏడాది తర్వాత హత్య కేసు నమోదు చేశారు.