తెలంగాణ

టిడిపి-బిజెపిలను ఆశీర్వదించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: ‘గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిడిపి-బిజెపిలను ఆశీర్వదించండి..’ అని టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ, బిజెపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా టియుడబ్ల్యుజె శుక్రవారం నిర్వహించిన మీట్-ది-ప్రెస్ కార్యక్రమంలో ఎల్. రమణ, కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత కిషన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో ఓటర్లు మూడో కన్ను తెరిచి అక్రమార్కుల ఆటకట్టించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిదే రాష్ట్రాలు అభివృద్ధి చెందవని అన్నారు. ముఖ్యమంత్రి, గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు ఒక్కో డివిజన్‌ను అభివృద్ధి చేసేందుకు ఎంచుకున్నా ఫలితం శూన్యమని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి పాటిగడ్డను ఎన్నుకున్నా ఒక్క అడుగు ముందుకుపడలేదని అన్నారు. ఈ ఎన్నికల్లో తమను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో గ్రేటర్ హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. నిధులు లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం గులాబీ రంగుల కల చూపిస్తున్నదని ఆయన విమర్శించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదని, టిఆర్‌ఎస్-మజ్లిస్ లోపాయికారి ఒప్పందం పెట్టుకున్నదని ఆయన విమర్శించారు. ఎల్. రమణ మాట్లాడుతూ టిడిపి అధికారంలో ఉన్నప్పుడు శాంతి-్భద్రతలు సజావుగా ఉన్నాయని తెలిపారు. వౌలిక సదుపాయాలు కల్పించామని, హైదరాబాద్‌కు ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చామని ఆయన చెప్పారు.
సోనియాపై కేసు..?
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకున్న ఘటనకు తమ పార్టీ జాతీయ నాయకుడు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు సంబంధం లేదని కిషన్‌రెడ్డి తెలిపారు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని రోహిత్ పేర్కొన్నా, దత్తాత్రేయను అప్రతిష్టకు గురి చేయాలన్న ప్రయత్నం జరుగుతున్నదని ఆయన విమర్శించారు. తమకు వచ్చే వినతి పత్రాలను సంబంధిత మంత్రులకు పంపించడం ఆనవాయితీగా వస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపి రాజయ్య కోడలు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారని, అంత మాత్రాన సోనియాపై కేసు నమోదు చేయలేదు కదా? అని ఆయన ఎదురు ప్రశ్నించారు.
రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చులు పెరుగుతున్నాయని, ప్రజల కోరికలు కూడా మితిమీరి ఉంటున్నాయని అన్నారు. అపార్ట్‌మెంట్ వాసులు లిఫ్ట్ పెట్టిస్తారా? అని అడిగారని ఆయన చెప్పారు. పోటీ చేసే వాళ్ళు కూడా వ్యక్తిగత హామీలు ఇవ్వరాదని ఆయన సూచించారు. విలేఖరులు అడిగిన ప్రశ్నలకు రమణ సమాధానమిస్తూ రోహిత్ ఆత్మహత్య జరిగిన వెంటనే తమ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ ఉంచి స్పందించారని అన్నారు. తమ పార్టీ నాయకులు కూడా రోహిత్ కుటుంబాన్ని పరామర్శించారని ఆయన తెలిపారు. మెజారిటీ డివిజన్లను గెలుపొంది, మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని ఆయన ధీమాగా చెప్పారు.