ఆంధ్రప్రదేశ్‌

తాత్కాలిక సచివాలయంపై తొందరేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 15: రాజధాని అమరావతి నగర నిర్మాణం కోసం స్థల నిర్ణయం, ఎంపిక, బలవంతంగా పంట భూముల సేకరణ వంటి అంశాలపై ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ తాము దాఖలు చేసిన పిటిషన్లపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో విచారణ కొనసాగుతుండగా తాత్కాలిక సచివాలయం నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు తొందరపడుతున్నారో అర్థంకావటం లేదని పర్యావరణ, సామాజిక ఉద్యమవేత్తలు పండలనేని శ్రీమన్నారాయణ, బొలిశెట్టి సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెబుతున్న రీతిలో రాష్టస్థ్రాయి పర్యావరణ అనుమతులు కేవలం రెండు మూడు ఎకరాలకు సరిపోతాయికాని 33వేల ఎకరాలకు కాదని వారు అభిప్రాయపడ్డారు. అనుమతులు ఎలా లభించాయో బహిర్గతం చేయకుండానే దురుద్దేశ పూరితంగా ముందు తాత్కాలిక సచివాలయం నిర్మించి ఆపై ఏదోరీతిలో అనుమతులు పొందవచ్చని భావిస్తోందని ఆరోపించారు. తాత్కాలిక రాజధాని నిర్మాణంపై విశ్రాంత ఐఎఎస్ అధికారి ఇఎన్‌ఎస్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా విచారణ జరుగుతోందని వారు వెల్లడించారు. తమ పిటిషన్లతో పాటు కోర్టు ధిక్కరణ కేసుపై కూడా ఈ నెల 23, మార్చి 7న విచారణకు రానున్నాయని వారన్నారు. గంగపుత్ర సంఘ జాతీయ అధ్యక్షుడు, కేంద్రం ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు గజేంద్ర బాన్జీ, అసైన్డ్ భూమి లబ్ధిదారుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయవాది సిరిపురపుఫ్రాన్సిస్‌తో కలిసి కృష్ణానది తీర ప్రాంతాలను పర్యటించిన వచ్చిన బొలిశెట్టి, శ్రీమన్నారాయణలు సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. బాన్జీ మాట్లాడుతూ రాజధాని పేరిట దశాబ్దాల తరబడి నీటిని, చేపల వేటను నమ్ముకుని జీవిస్తున్న వందలాది మత్స్యకార కుటుంబాలను అనాధలుగా రోడ్డుపైకి గెంటివేసే ప్రయత్నాలు సాగుతున్నాయని ఆవేదన వ్యక్తపర్చారు. దీనిపై సిఎం చంద్రబాబు పునరాలోచన చేయనిపక్షంలో దేశవ్యాప్తంగా తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. కృష్ణానదిలో యంత్రాలతో ఇసుకను తోడేస్తుంటే పరిసరాల్లో తరచూ భూకంపాలు వస్తున్నాయంటూ హైకోర్టు ఇసుక తవ్వకాలను నిరోధించిందని గుర్తుచేశారు. అయితే నాటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం అక్కడి వారితో బోట్‌మెన్ ఫెడరేషన్లు ఏర్పాటు చేసి పడవల్లో ఇసుక తెచ్చి విక్రయించుకునేందుకు అనుమతివ్వగా నేడు కార్పొరేట్ శక్తులు కృష్ణాతీరంలో సొసైటీలు ఏర్పాటు చేసుకుని భారీ యంత్రాలు, భారీ పడవలతో అక్రమంగా టన్నులకొద్దీ ఇసుకను కొల్లగొడుతున్నాయని ఆరోపించారు. న్యాయవాది ఫ్రాన్సిస్ మాట్లాడుతూ ఒక్క రాజధాని ప్రాంతంలోని 2వేల 500 ఎకరాల దళితుల అసైన్డ్ భూములపై వందల కోట్లలో అక్రమ వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయని ఆరోపించారు. భూములను నోటిఫై చేయకుండా తన బినామీదారులతో కారుచౌకగా కొనుగోలు చేయించి రిజిస్ట్రేషన్లు చేయించి ప్రస్తుతం క్రమబద్ధీకరణ పేరిట వారికి కట్టబెట్టే ప్రయత్నంలో సిఎం వున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రికి దళితుల సంక్షేమంపై ఏమాత్రం చిత్తశుద్ధి వున్నా ఆ భూములను వారికే రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు.