తెలంగాణ

తల్లుల్లారా దీవించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగపేట, ఫివ్రబరి 15 : మరో రెండు రోజుల్లో జరగనున్న మేడారం జాతర కోసం భక్త జనం అప్పుడే తరలివస్తున్నారు. వన దేవతలైన సమ్మక్క - సారలమ్మలను దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. కొంత మంది మహిళా భక్తులు పూనకాలతో ఊగిపోతున్నారు. జంపన్నవాగు వద్ద నిర్మించిన స్నాన ఘట్టాల వద్ద భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి తలనీలాల సమర్పిస్తున్నారు. మేడారం జాతరకు విచ్చేసిన భక్తజనంలో భక్త్భివం ఉప్పొంగుతుంది. జంపన్నవాగులో స్నానాలు ఆచరించిన భక్తులు అక్కడ నుండి గద్దెల వద్దకు చేరుకుని తమ మొక్కులు చెల్లించుకునే వరకు సమ్మక్క తల్లీ కాపాడు ... సారక్క తల్లీ కాపాడు అంటూ వన దేవతలను నామజపం చేస్తూ తమ కోర్కెలు తీర్చమని వేడుకుంటున్నారు. రెడ్డిగూడెం, కొత్తూరు, కనె్నపల్లి, జంపన్నవాగు, మేడారం తదితర ప్రాంతాలలో శివసత్తులు పూనకాలతో ఊగిపోతున్నారు. యాట పోతులతో అమ్మవారి గద్దెల వద్ద పూజలు నిర్వహించి అనంతరం తమ గుడారాల వద్ద వాటిని తల్లులకు బలిచ్చి కుటుంబ సభ్యుల, బందుమిత్రులతో విందు భోజనాలు చేసి వేడుకను జరుపుకుంటున్నారు.