ఈ వారం కథ

తధాస్తు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా భర్తకు నేనంటే ఇష్టం! పెళ్లి అయిన నాటినుండి పల్లెత్తుమాట అనే్లదు నన్ను! పెళ్లిలోనూ నేను చేత్తో కలిపి పెట్టిన అన్నంముద్దలనే తిన్నాడు. వివాహమై నాలుగేళ్లు దాటినా ఇద్దరి పిల్లలకు తండ్రి అయినా నా దృష్టిలో ఆయన చిన్న పిల్లవాడే!

లంచ్ బాక్స్‌లో సైతం పెట్టిన భోజనాన్ని ముద్దలు చేసి పెట్టాల్సిందే! లేకుంటే భోజనం చేయకుండా నిండు బాక్స్‌ను తిరిగి ఇంటికి తెస్తారు కానె్వంట్ గోయింగ్ బాయ్‌లాగ.
పెళ్లి అయ్యేదాకా వాళ్ల మమీ కంచంలో భోజనాన్ని కలిపి ముద్దలు చేసి మావారి నోటికి అందిస్తూ తినిపించేదట! పెళ్లినాటి నుండే ఆ బాధ్యత నాపరమైంది. మొదట్లో నాలో నేను నవ్వుకున్నా... ఆశ్చర్యమన్పించినా... నేనే ముద్దలు చేసి భర్త నోటికి అందించటంలో గల తృప్తి ఆనందం నాకెందులోనూ లేదన్పించిన మాట వాస్తవం!
అంతేకాదు... స్వయంగ నేనే వళ్లు రుద్ది రోజూ స్నానం చేయించాలి! ఏ బట్టలు ఏరోజు వేసుకోవాలో నేనే నిర్ణయించాలి! ఆయన కోరికలకు భిన్నంగ నడిస్తే నాతో మాట్లాడటం మానేస్తారు. మూగనోము పాటిస్తారు. లుంగీ అయినా చుట్టుకోకుండా ఇల్లంతా టవల్‌తోటే తిరుగుతారు. ఇక ఆరోజు ఆఫీసుకి ‘డుమ్మా’నే!
అందుకే నేనాయన్ను అలక పూననీయను. ఆయన సంతోషమే నాకు ఆనందం. ఆయన షాంపూ వాడరు. కుంకుడు నురుగునే వాడి తలంటు పోయాలి! సబ్బు వాడరు కాబట్టి సీకాయ పొడితోనే వళ్లు రుద్దాలి!
శ్రీవారి జుట్టు వత్తుగ... నల్లగ... రింగులు తిరిగి వుంటుంది. టవల్‌తో అర్ధగంటసేపు తుడిస్తే గానీ తల తడి ఆరదు. హెయిర్ డ్రైయ్యర్ ఇంట్లోవున్నా దాన్ని వాడరు. అదేమంటే అది కేవలం నేను మాత్రం వాడాలని.. నా కోసమే తెచ్చానని చాలాసార్లు క్లాసు పీకారు.
ఇచ్చిన బట్టలు వేసుకున్నాక... స్వయంగా నేనే నెక్‌టై కట్టి నాట్ వేయాలి! తలకు ధూపంవేసి దువ్వెనతో నొప్పి పుట్టకుండా మృదువుగా తల దువ్వి క్రాఫ్ ఆయనకు ఇష్టమైన పద్ధతిలోనే వుండేలా చూడాలి! లేకపోతే అలకే!!
పిల్లలు పుట్టాక కూడా ఆయన అలవాట్లు మారలేదు. మార్పు ఇష్టం లేదు. వారు నాకు ఒక బిడ్డతో సమానం! పిల్లలైనా చెప్పిన మాట వింటారుగానీ... ఈయన మాత్రం ప్రతిదానికి మారాం చేస్తారు.
ఇంటికి బంధువులొచ్చినా సరే... అన్నీ పన్లూ నా చేత చేయించుకోవటానికి బిడియపడరు. వచ్చినవాళ్లు ఈయన వింత ప్రవర్తనకు అవాక్కై ముక్కున వేలేసుకోక తప్పదు.
పెళ్లినాటికి మా శ్రీవారిది టూరింగ్ జాబ్! నా మెడలో తాళిపడిన మరుసటిరోజే చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసి... ఛైర్ జాబ్ వెతుక్కున్నారు! ఆయన ఏది చేసినా నా కోసమే! నన్నొదిలి ఒక్క రోజైనా వుండలేరు. నాకోసం... చేసే వుద్యోగాన్ని మానేసి కొత్త ఛైర్ జాబ్‌లో జాయినైనారు.
ఎంత గొప్ప మనసు ఆయనది? నేనంటే ఎంత అభిమానం.. ప్రేమ! తల్చుకున్న ప్రతి క్షణం నా తనువు పులకరిస్తుంది.
నెల జీతం అవసరాలకుమించే వస్తుంది. నాకేమో పొదుపు పాటించడం ఇష్టం! ఆయన దుబారా చేయకపోయినా ధారాళంగా అవసరాలకు మించి ఖర్చుచేస్తారు.
ఇక్కడే మా ఇద్దరికీ చిన్న గొడవ! వారితో వాదించి గెలవలేను. నన్ను ఆయన అంతగ ‘కన్విన్స్’చేస్తారు. చెప్పాలంటే... మా ఆయన మహా తెలివైనవారు.
ఒకసారి మా అత్తమామలు మా ఇంటికొచ్చారు... మా మీద బెంగతో నాలుగురోజులు మాతో కాలక్షేపం చేయాలని! వారికి మావారొక్కరే మగ పిల్లాడు! మిగతా ఇద్దరూ ఆడ పిల్లలు. వారికి వివాహమై విదేశాల్లో సెటిలైనారు.
‘‘ఏం కోడలు పిల్లా..?... ఏమంటున్నాడు మావాడు పార్వతీశం?’ కిచన్లోకొచ్చి నా పక్కనే నిలబడి అడిగారు అత్తగారు.
‘మీ అబ్బాయిని నా కాళ్లపై పడుకోబెట్టి స్నానం చేయించాల్సిందే. గోరుముద్దలు తినిపించాల్సిందే...? కసిక్కున నవ్వాను.
‘మా వాడంటే ఏమనుకున్నావ్ మరి?- వాడు మాకు అప్పుడు... ఇప్పుడూ.. ఎప్పుడూ పసి పిల్లాడే..’
‘మీకే కాదండోయ్. నాకూ అంతే! అంతా ‘స్పూన్’పీడింగ్! తనంటూ ఏ పని స్వయంగా చేసుకోవటానికి ఇష్టపడరు...
‘మొదటినుంచీ వాడంతే! గారాలపట్టి! అబ్బురంగ పెరిగాడు. వాడికేం కావాలన్నా వాడి డాడీ ‘నో’అనేదే లేదు. అల్లరివాడు మాత్రం కాదు. తెలివైనవాడు. కష్టపడి చదివే వాడు. ఫారిన్లో సెటిలవరా... అక్కడ జాబ్ చేస్తే సొసైటీలో మంచి రెస్పెక్ట్ అంటే.. నా ప్రతిపాదన కొట్టిపారేశాడు. మీ మామగారు సైతం కొడుకునే సమర్ధించారు.’
‘ఒక్కగానొక్క పిల్లాడు మనకు దూరంగా ఎక్కడో వుంటే... మనకు అందుబాటులో వుండే అవకాశం వుండదు. ఇప్పుడు చూడు. మనం చూడాలన్పించినప్పుడల్లా రెక్కలు కట్టుకుని ఫ్లైట్లొచ్చి వాలుతున్నామా! మనసులో మాట వ్యక్తపరిచాడు.
నాక్కూడా మావారు ఇండియాలోనే జాబ్ చేయటం ఇష్టం! వారికి నేను... నేను వారికి దూరంగా వుండటానికి ఇష్టపడం! - అనుకున్నాను మనసులో...
* * *
ఒక రోజున...
‘ఏమండీ... నేనోమాట చెప్తాను కోప్పడరుకదూ...?’ ఇద్దరం ఒకే బెడ్ పంచుకున్న నేను ఒత్తిగిల్లి ఆయన వుంగరాల జుట్టులోకి నా చేతి వేళ్లను చొప్పించి సరదాగా ఆడుతూ అన్నాను.
‘వాట్... నిన్ను నేను కోప్పడటమా?... నో! నెవ్వర్. యూవార్ మై స్వీట్ హార్ట్...’ దగ్గరకు తీసుకుని ఓ ‘కిస్’ ఇచ్చాడు పార్వతీశం.
‘బీ సీరియస్..’ బుంగమూతి పెట్టాను.
‘నోనో... నువ్వెప్పుడూ నవ్వుతూ వుండాలి. నిన్నిలా చూచి తట్టుకోలేను...’
‘అయితే చెప్తా... వినండి! నేనంటే ఎంత ప్రేమో పిల్లలన్నా అంతకుమించిన ప్రేమ వుందని నాకు తెల్సు! కానీ...’
3‘వాట్ కానీ...కానీలు అర్థణాలు ఇప్పుడు లేవు. కమాన్ కమాన్ చెప్పు..’
3‘ఎం లేదండీ! మనం ఒకరు లేకుండా మరొకరు జీవించలేం...నాకు తెల్సు! అలాంటిది అకస్మాత్తుగా నేనే చనిపోతేనో...’
గభాలున బెడ్ మీదినుంచి లేచి ‘ఇవేం పిచ్చి మాటలు? ఇట్లా ఎలా ఆలోచించగలిగేవ్? నీ మాట విన్నాక నా హార్ట్‌బీట్ పెరిగింది. మనసంతా కకావికలమైంది... మిన్ను విరిగి మీద పడ్డట్టన్పించింది తెల్సా?’
భర్త మాటలకు కంగారుపడి ఆయనలో కంగారు తగ్గించాలనే వుద్దేశంతో మాట మార్చి ‘మీరు కంగారుపడ్డారా?- నేను వూరికే తమాషాకి అలా అన్నాను. మిమ్మల్ని ఆటపట్టించాలని..’ సర్ది చెప్పబోయాను.
‘అయితే మాత్రం... ఇలాంటి షాకింగ్ మాటలా? నాకు అసలు నచ్చదు. ఇంకెప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడకు. పడుకుని కళ్లు మూసుకుని దైవాన్ని స్మరించు.. మంచి నిద్ర పడుతుంది... పిచ్చి పిచ్చి ఆలోచన్లు నీ మనసు పొలిమేరల్లోక్కూడా రావు..’ వీపు తట్టి భార్యకు ధైర్యం చెప్పాడు పార్వతీశం.
పార్వతీశం భార్యకు ధర్మ సూత్రాలను నూరిపోశాడు కానీ... తనకు మాత్రం కంటి మీద కునుకురాలేదు.
అప్పటికి అర్ధరాత్రి పనె్నండైంది!
శ్రీవారు ఇంకా నిద్రపోలేదని నేను క్రీగంట గమనిస్తూనే ఉన్నాను! అటూ ఇటూ పక్కమీద మసలుతూనే వున్నారు!
‘ఏంటి... నిద్ర పట్టటం లేదా?-’ బెడ్ మీద లేచి కూర్చుని గోముగా అడిగాను.
‘అవునే! ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచన్లు మనసు నిండా కందిరీగల్లాగ ముసురుకున్నయ్- నాకెందుకో భయంగ కూడా వుంది...’ బేలగా అన్నాడు పార్వతీశం.
‘్భయమా...మీకా. నెవ్వర్... నమ్మశక్యంగాలేదు..’ వెర్రిగా నవ్వింది.
‘నీ నోట ఆపభ్రంశపు మాట వచ్చినందుకు నిన్ను కోప్పడనా?... ఇప్పుడు నాదీ అదే స్థితి! - మనిద్దరం ఒకరికోసం మరొకరు పుట్టామన్పించింది. అలాంటిది నీవు క్షణం క్రితం మాట్లాడిన తీరు విన్న తర్వాత... నాలోనూ అదే బాధ కలవరపెడుతోంది. నీకంటే నేను ముందు చనిపోతే?... నువ్వు నన్ను విడిచి బ్రతుకగలవా?
‘అవును. మీ మాట అక్షర సత్యం! సతీసహగమనం చేస్తాను. ఇద్దరం పోతే ఒకేసారి పోవాలి! ఒకరు ముందు మరొకరు తర్వాత కాకూడదు...’
‘మన స్వార్థం మనం చూచుకుంటే పిల్లల్ని ఎవరు చూస్తారు? అనాధలైపోతారు?’
‘మీ మమీడాడీ వద్ద వుంటారు. అక్కడే... వారి పర్యవేక్షణలోనే పెరిగి పెద్దవుతారు...’
‘మనం పోయిన మరుక్షణం వారూ తుదిశ్వాస విడుస్తారు. ఆ నిజం నాకు తెలుసు...’
‘అయినా మనమేం ముసలివారమైనామా? మన్లో ఇలాంటి దరిద్రపుగొట్టు ఆలోచనలు ఏమిటి? అంతా ‘ట్రాష్!’ సరదాకాస్తా చివరికి సీరియస్సైంది...’
‘ఎవరి జీవితకాలం ఎంతో ఎవరూ చెప్పలేరు దుర్గా... ఏది ఏమైనా జాతస్య మరణం ధృవం! మృత్యువు ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో కబళిస్తుందో మానవులు అంచనావేయగల ‘సైన్సు’ ఎడ్వాన్స్ కాలేదు.’
పార్వతీశం... దుర్గ ఇద్దరూ గలగలా నవ్వి నిద్రకుపక్రమించారు. ఒకరి బాహుల్లో మరొకరు ఇమిడిపోయారు.
* * *
పార్వతీశం అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్‌ను గుర్తించిన సంస్థ అతడికి రీజినల్ మేనేజరు ప్రమోషనిచ్చి మరో ప్రదేశానికి ట్రాన్స్‌ఫర్ చేయకుండా అక్కడే వుంచినందుకు సంస్థకు యాజమాన్యానికి ధన్యవాదాలు తెల్పుకున్నాడు.
ఈ శుభ సందర్భంలో పదవి జీతం పెంపుతోపాటు ఒకే లేటెస్ట్ మోడల్ కారుని ‘గిఫ్ట్’గా కంపెనీ ఇవ్వటం మరో సంతోషకరమైన విషయం.
చాలారోజులుగా భార్య దుర్గ కారు కొనమంటూ ఒకే పోరు! డబ్బు లేక కాదు... ఎందుకో మంచి మూడే లేక తర్వాత కొనుక్కుందాంలే అనేశారు.
శ్రీమతిలో వున్న నిరుత్సాహాన్ని ఇప్పుడు కారును గిఫ్ట్‌గా ఇచ్చి దూరం చేసింది కంపెనీ! ఇంటికెళ్లగానే ఈ విషయం చెప్తే ఎంతగా సంబరపడుతుందో దుర్గ... మాటల్లో చెప్పటం స్వల్పమే అన్పిస్తుందని భావించాడు పార్వతీశం.
కొత్త కారుని స్వయంగ నడుపుతూ హేపీగా ఇల్లుచేరుకుని కారు దిగకుండా... ఇంట్లోకి పోకుండా... అదే పనిగ హారన్ మ్రోగించ నారంభించాడు.
హారన్ శబ్ధాన్ని విని గబగబా వాకిట్లోకొచ్చిన దుర్గ కారు స్టీరింగ్ ముందు భర్త కూర్చుని వుండటం చూచి ‘అద్దె కారులో వచ్చారా ఏమిటి?... లేకపోతే ఏ ఫ్రెండ్ కారునైనా తీసుకొచ్చారా?’ ఆశ్చర్యపోతూ కారుని సమీపించి భర్తనడిగింది.
కారు దిగి శ్రీమతి దగ్గరగా వచ్చి భుజంమీద చెయ్యివేసి... బుగ్గమీద చిలిపిగ చిటికేసి ‘బావుందా కారు...’ అడిగాడు.
‘మనది కానప్పుడు కారెలా వుంటే మనకెందుకు లెండి...’ ఉడుక్కుంటూ అంది.
‘మనం వుంచేసుకుందామా...?’ లోనికి నడుస్తూ మురిపెంగ అడిగాడు.
బుంగమూతి పెట్టింది దుర్గ!
‘నువీ పూట వంట చేయద్దు! ఇద్దరం కలిసి పిల్లలతో ఈ కార్లో ఏ నక్షత్రాల హోటల్లోనైనా డిన్నర్ చేసొద్దాం!’ కోటు విప్పి శ్రీమతికి అందిస్తూ హుషారుగా అన్నాడు.
‘దొరగారు ఈ పూట ఎందుకో ఇంత హేపీగా అవుపిస్తున్నారో తెలుసుకోవచ్చా?’
‘ముందు నాకో స్వీట్ అండ్ హాట్ కిస్సిస్తే గాని చెప్పనుగాక చెప్పను...’ భార్య నడుము చుట్టూ చెయ్యి పోనిచ్చి దగ్గరకు లాక్కుని గుండెకి హత్తుకున్నాడు.
‘ష్! ఏమిటీ చిలిపి చేష్టలు... పిల్లలు చూస్తే బాగుండదు...’
‘అవునవును కదూ...! నన్ను ‘రీజినల్ మేనేజర్’గా ప్రమోట్ చేస్తూ కంపెనీ ఆ కారుని గిఫ్ట్‌గా ఇచ్చింది! అంటే డబుల్ హేపీ నాకు, ప్లస్ నీకు! అందుకే అందరం అలా కొత్త కార్లో బైటికెళ్లి డిన్నర్ చేసొద్దాం... హరీ అప్.. నువ్వు తయారై పిల్లలను రెడీ చెయ్... నేను ‘ప్రెష్’ అవుతాను... ’ లుంగీ చుట్టుకుని బాత్‌రూమ్‌లోకి జొరబడ్డాడు పార్వతీశం.
అమ్మో! ప్రమోషను... కారు.. రెండూ కంపెనీ ఇచ్చిందా...? నమ్మలేక పోయినా.. భర్త టాలెంట్ డెడికేషన్.. శ్రమించటంవల్లే ఇంత గుర్తింపు వచ్చింది కాబోలు అనుకుని లోనికి నడిచింది పిల్లలిద్దరినీ బయల్దేరటానికి రెడీ చేయాలని.
పిల్లలిద్దరూ కేరింతలు కొడుతూ ముందుగా కారెక్కేశారు. ఫ్రంట్ సీట్లో దుర్గ... స్టీరింగ్ ముందు పార్వతీశం... కారు బయల్దేరి వేగాన్ని పుంజుకుంది.
‘‘అబ్బ... కాస్త మెల్లగా డ్రైవ్ చేద్దురూ...’
‘‘ఏం. భయమేస్తోందా...? ... కొత్త కారు కదోయ్... స్పీడ్‌గా వెళ్తేనే త్రిల్’’.. ఎద్దుల బండిలా నడిపితే పాదచారులు నవ్విపోగలరు...
సందులోంచి మెయిన్‌రోడ్ ఎక్కగానే లారీ స్పీడ్‌గా వచ్చి పార్వతీశం కారుని ఢీకొంది.
కొత్తకారు తుక్కుతుక్కైంది. డ్రైవ్ చేస్తున్న పార్వతీశం ఫ్రంట్ సీట్‌లో కూర్చున్న భార్య దుర్గ స్పాట్ డెత్!
ఈ హఠాత్ పరిణామానికి రోడ్డుమీద వున్నవారంతా చుట్టూ మూగారు. ట్రాఫిక్ పోలీసు అంబులెన్స్‌కోసం మొబైల్ చేశాడు.
వెనక సీట్లోవున్న ఇద్దరు పిల్లలు కూడా తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు.
ఒకనాటి భార్యభర్తలు ఇరువురికీ చనిపోవాలనే ప్రేరణ ఈ విధంగా తీరింది. ఏక కాలంలో ఇరువురిని ఈ రూపంలో మృత్యువు కబళించింది!
ఎంత ఘోరం! ఎంతటి దారుణం? పొరపాటున కూడా జీవితంలో చెడు గురించి మాట్లాడుకుంటే ‘తధాస్తు దేవతలు పైనుండి దీవిస్తారనే’మాట పార్వతీశం దుర్గ విషయంలో నిజమై రుజువైంది.
*

- యస్.వివేకానంద, సెల్ నెం: 9959213789