రంగారెడ్డి

చిరుత సంచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, ఫిబ్రవరి 7: తాండూరు మండలం మల్కాపూర్‌లోని ఐసీఎల్ ఫ్యాక్టరీకి సంబంధించిన మైనింగ్ పరిసరాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్టు అధికారులకు ప్రజలు బుధవారం ఫిర్యాదు చేశారు. మూడు నాలుగు రోజులుగా చిరుత సంచరిస్తున్నట్టు సమాచారం. మల్కాపూర్, పరిసర గ్రామాల ప్రజల సమాచారం మేరకు తాండూరు ఫారెస్ట్ రేంజ్ అధికారులు, రేంజ్ ఆఫీసర్ రాజేందర్ తమ బృందంతో వెళ్లి ఆరా తీశారు. చిరుత సంచరించిన ప్రదేశాలలో ఉన్న అడుగులను పరిశీలించి నిజమేనని వెల్లడించారు. చిరుతను బంధించటానికి ఉన్నత అధికార యంత్రాంగానికి సమాచారం అందిస్తున్నట్టు తెలిపారు.