Others

తెలుగుతల్లి తాటంకాలు.. సామెతలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగుభాషకు సొబగులు అద్దేవి సామెతలు. సామెతలు జీవనసారమంతా ఒక్కమాటలో చెప్పాలంటే అనువైన పదం కేవలం సామెతనే. సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు ఉండదంటారు. సామెతలు జీవితసారానికి దర్పణాలు. సామెతలు సేకరించడం భద్రపర్చడం నేటి తరం వారి బాధ్యతగా తీసుకోవాల్సి ఉంటుంది. నాటి తెలుగువారి జీవనయానాన్ని భవిష్యత్తరాలకు చూపించాలంటే చిత్రం, గిత్రం లాంటివి ఏమీ లేకున్నా కేవలం ఒక్క వాక్యంతో కళ్లముందు కదలాడేటట్టుచేయగలిగేది సామెత ఒక్కటే. ఉదా. మోసం చేయడం అంటే ఇపుడు అందరికీ కుడిచేతివాటమే అనుకోండి. కాని ఆనాడు మోసం చేయడంలో ఆరితేరిన దిట్టలు కేవలం కంసాలివారేనట అందుకే ఆయన బర్రెనమ్మినా అందులో కూడా కల్తీచేయగల ధీశాలి అని చెప్పడానికి ఎంత చక్కని సామెతను అల్లారో! కంసాలి బర్రెనమ్ముతున్నాడు. లోపల లక్కవుందేమో చూడరా అన్నట్లు.. అట్లాంటిదే ‘కట్టని నోరు కట్టలేని నదీ ప్రమాదకరం... కాలు జారినా తీసుకోవచ్చు కాని మాట జారితే తీసుకోలేమన్నట్లుగా మాట పెదవి దాటి వచ్చినతర్వాత అది ఎదుటివారికి మంచినో చెడునో చేసేస్తుంది. అందుకే కట్టులేకుండా మాట్లాడితే కొంపలంటుకొంటాయి. మాట్లాడేముందు కాస్త ఆలోచించి మాట్లాడమని చెప్పడానికి ఈ సామెత వాడుతారు.
ఇట్లాంటి సామెతలు నేటి తరానికి తెలిస్తే మన తెలుగుభాష నాలుగు కాలాల పాటు బతికి ఉంటుంది.