టీజర్‌లో పడేసావే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తిక్‌రాజు, నిత్యాశెట్టి జంటగా చునియా దర్శకత్వంలో అయాన్ క్రియేషన్స్ పతాకంపై అక్కినేని నాగార్జున ప్రోత్సాహంతో రూపొందిన చిత్రం ‘పడేసావే’. ఈ సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నటుడు నాగార్జునలు టీజర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ, నేను రాజవౌళితో సీరియల్ మొదలుపెట్టినపుడే మాతోపాటు చునియా కలిసి పనిచేసిందని, ఆ తరువాత నాగర్జున దగ్గర కూడా వర్క్ చేసిందని, మా ముగ్గురి దగ్గర పనిచేసి ఆడియన్స్‌ను ఎలా పడేయాలో నేర్చుకుందన్నారు. నాగార్జున మాట్లాడుతూ, దేనికైనా ఫౌండేషన్ గట్టిగా ఉండాలని, చునియా రాఘవేంద్రరావు, రాజవౌళిలాంటి వారి దగ్గర పనిచేసిందని, అలాగే బ్యాడ్ డైరెక్టర్స్‌తోకూడా పనిచేసిందన్నారు. అన్నిరకాల అనుభవాల్ని తెలుసుకుందని అన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో కూడా పనిచేసి చాలా నేర్చుకుంది. ఆమె ఈ కథ చెప్పినపుడు బాగా నచ్చిందని, అందుకే ఆమెని ఎంకరేజ్ చేశామని, ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కథతో రిలేట్ అవుతారని అన్నారు. దర్శకురాలు చునియా మాట్లాడుతూ, తాను ఈరోజు ఈ స్థాయిలో వుండడానికి కారణం రాఘవేంద్రరావేనని, ‘యువ’ సీరియల్‌తో నాగార్జున అవకాశం కల్పించారని, ‘మనం’ సినిమా చేస్తున్న సమయంలో ఈ కథను రెడీ చేశానని, అప్పుడే నాగార్జునగారికి చెప్పడంతో ఆయనకు ముందుకెళ్లమన్నారని చెప్పారు. ఇదొక యూత్‌ఫుల్ సినిమా అని, ప్రస్తుతం యువత ఎంత కన్‌ఫ్యూజన్‌లో వున్నారో, స్నేహం, ప్రేమ- ఇలా అన్ని విషయాలను చర్చించామన్నారు. ఈ కార్యక్రమంలో కార్తిక్‌రాజు, నిత్యాశెట్టి, అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు.