తెలంగాణ

రాజకీయ కోణం, దురుద్దేశం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్ధ పరిధిలో 6.39 లక్షల ఓటర్ల పేర్లను జాబితా నుంచి రాజకీయ కోణం లేదా ఉద్దేశపూర్వకంగా తొలగించారనే అపవాదు సత్యదూరమని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. జిహెచ్‌ఎంసి ఓటర్ల తుది జాబితాను తొలగించిన ఓటర్ల పేర్ల అంశం తేలేదాక ప్రకటించరాదని కోరుతూ నాగేష్ ముదిరాజ్, మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు విచారించింది.
ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం పిటిషన్లలో చేసిన అభియోగాలపై హైకోర్టుకు నివేదిక రూపంలో వివరణ ఇచ్చింది. పిటిషనర్లు చేసిన ఆరోపణల్లో నిజాలు తేల్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఒక అధికారుల బృందాన్ని హైదరాబాద్‌కు పంపిందన్నారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారుల బృందం అక్టోబర్ 29నుంచి నవంబర్ 2 వరకు పర్యటించి నివేదికను అందించిందన్నారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు వెనక ఎటువంటి దురుద్దేశాలు లేవని నివేదికలో బృందం పేర్కొన్నదని ఇసి హైకోర్టుకు తెలిపింది. అంతకు ముందు తొలగించిన ఓటర్ల పేర్లపై డిసెంబర్ 10లోగా నిర్ణయం తీసుకుని హైకోర్టు ద్వారా పిటిషనర్లకు తెలియచేయాలని జస్టిస్ సివి నాగార్జునరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన విషయం విదితమే.
తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి ఓటర్ల తొలగింపు వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి తనిఖీ చేశారన్నారు. 22,421 పేర్లు తొలగించినట్లు కనుగొన్నారన్నారు. వీరికి నోటీసు ఇవ్వలేదని కనుగొని, వీరిలో 21,360 పేర్లను పునరుద్ధరించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం తమకు రాసిన లేఖలోని సారాంశాలన్నీ పిటిషనర్ల తరఫున న్యాయవాదులు హైకోర్టుకు చదివి వినిపిస్తూ , 6.39 లక్షల ఓటర్ల పేర్లను తొలగించడమే కాకుండా, అదనంగా 7.39 లక్షళ ఓటర్ల పేర్లను కూడా తొలగించేందుకు అర్హమైనవిగా గుర్తించినట్లు తమకు సమాచారం ఉందని హైకోర్టుకు తెలిపారు.
ఈ విషయాన్ని ఈ నెల 9న ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు. తొలగించిన పేర్లను చేర్చితే బిసి వార్డుల కేటాయింపుప్రక్రియలో మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. అనంతరం హైకోర్టు ఈ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.